పూర్వము కైలాస పర్వతము మీద శంకరుడు బ్రహ్మాది దేవతలో కొలవైయుండి, యీ స్కాందపురాణమును వారికి వినిపించెను. పార్వతి అది విని కుమారస్వామికి (స్కందునకు) చెప్పెను. ఆయన నంది గణమునకు చెప్పెను. నంది దత్తాత్రేయునకు జెప్పెను. ఆయన వ్యాసనునకు జెప్పెను. వ్యాసుడు దానిని సూతునకు జెప్పెను. ఆయన శానకాది మునులకు జెప్పెను. తత్పురుష కల్పములో, సర్వసిద్ధులను సమకూర్చెడి మహేశ్వర ధరమములు కుమారస్వామిచే లోకానుగ్రహ బుద్ధితో చెప్పబడినది. అవి అన్నియు ఒక పురాణమై వెలసినవి. స్కందునిచే చెప్పబడిన పురాణము కావున ఇది స్కాంద పురాణమని ప్రసిద్ధికెక్కెను.

చంద్రాంగదుడు - సోమవార వ్రతము.....
నలదమయంతుల కుమారుడు ఇంద్రసేనుడు. అతనికి చంద్రాంగదుడను కుమారుడుండెను. అతడు సమస్త విద్యాకుశలుడై యువరాజ్య పట్టాభిషిక్తుడయ్యెను. అతనికి చిత్రకర్ముడను రాజు తన కుమార్తె సీమంతిని నిచ్చి పెండ్లి చేసెను. చంద్రాంగదుడు అత్తవారింట్లో కొన్నాళ్లుండెను. ఒకనాడు యమునానదిలో నౌకావిహారము చేయుటకై మిత్రులతో వెళ్లెను. పెద్దగాలి విసరి పడవ తిరుగబడి అందరును నీళ్ల పాలైరి. చిత్రకర్ముడు చంద్రాంగదునికై వెదకించెను. లాభము లేకపోయినది. విచారముతోఇంటికి బోయి, కుమార్తెకు అలంకారములన్నియు తీసివేసెను. ఆమె వితంతు వేషముతో నుండెను.
ఆమెను జూచి మైత్రేయి అను మునిపత్ని, "పరమశివుని ఉద్దేశించి సోమవార వ్రతమును దీక్షతో చేయుము. నీకు శుభములు గలుగు"నని బోధించి, ఆమెకా వ్రతము చేయు విధానము చెప్పి వెళ్లెను. ఆమె ఆ సోమవార వ్రతము చేయనారంభించెను. (సోమ: ఉమయాసహిత: శివ: పార్వతితో కూడిన శివుని సోముడందురు. అతనికి ఇష్టమైనది సోమవారము. ఆనాడు అతనికి గూర్చిచేయు వ్రతము.) చంద్రాంగదుడు నీటిలో మునిగి నాగలోకము చేరెను.

ఇతనిని తెచ్చిన నాగకన్యలు తక్షకు నెదుట నిలువబెట్టిరి. తక్షకుడతనిని జూచి "నీవెవరి కుమారుడువు? ఎందుకీ లోకమునకు వచ్చితిని?" అని యడుగగా, రాజకుమారుడు, తాను నిషధదేశాధిపతియైన నలునిపౌత్రుడననియు యమునలో నౌకవిహారము చేయుచు ప్రమాద వశమున నటిలో మునిగి యా లోకమునకు వచ్చితిననియు, తక్షకునివంటి మహాత్ముని దర్శనము వలన ధన్యుడనైతి ననియు తన కథ వినిపించెను. తక్షకుడు అతని వినయ విధేయతలకు ఆనందించి తన యింట కొన్నాళ్లుండుమనెను.

చంద్రాంగదుడు, "ఇప్పటికే నావారందరును నన్ను చచ్చినవారిలో లెక్కవేసి యుందురు. నేను వెళ్లి నా తల్లిదండ్రులకును, నా భార్యకును, అత్తమామలకును సంతోషము గలిగింపవలెను. కావున త్వరలో నాకు సెలవిచ్చి నా లోకమునకు పంపు"డని కోరెను. ఆయన అనేకములైన కానుకలిచ్చి, అవి మోయుటకు ఒక రాక్షసుని, మిత్రుడుగా ఒక నాగయువకుని తోడిచ్చి పంపెను. ఈతదంగముజరుగు లోపక, భూలోకములో మూడేండ్లు గడచెను. ఈలోగా ఇతని తండ్రిని శత్రువులు చెరలో బెట్టి రాజ్యమాక్రమించిరి.

చంద్రాంగదుడు యమునా తీరమునకు వచ్చెను. అతని భార్య వితంతు వేషముతో శివాలయమునకు వచ్చెను. ఆమెను జూచి యెక్కడో చూచినట్లున్న దనుకొని "నీ వెవరు? ఇట్లుండుటకు కారణమే" మనగా.. ఆమె, తన వృత్తాంతము చెప్పెను. ఆమె తన భార్యయని తెలుసుకొని, "నీ భర్త మూడు నాలుగు రోజులలో వచ్చును. నేనతని మిత్రుడను" అని చెప్పి తన పురమునకు వెళ్లి కోటముందు నిలబడి, శత్రురాజులనుద్దేశించి "మీకు ప్రాణముల మీద ఆశ యున్నచో ఉన్నపాటున నగరము విడిచిపొండు.

నేను నలుని మనుమడను. చంద్రాంగదుడను. తక్షకుని వల్ల వరములు పొంది వచ్చినాడను. నా మాటలు లెక్కచేయనిచో మిమ్ము నా బాణాగ్నిలో భస్మము చేసెద"నని చెప్పెను. శత్రురాజు వచ్చిచూచి, రాజకుమారుని ధైర్యసాహస పరాక్రమాదులకు భయపడి, అతని రాజ్యమును విడిచి వెళ్లిపోయెను. చంద్రాంగదుడు తల్లిదండ్రులను చెరనుండి విడిపించి, తన కథను వినిపించెను. ఇంద్రసేనుడు తన వియ్యంకునకు చంద్రాంగదుడు క్షేమముగా వచ్చినాడని వార్తనంపెను.

అతడు బ్రహ్మానందము నొంది కుమార్తెతో.. "తల్లీ! నీవు చేసిన సోమవారవ్రతము ఫలించినది. నీ భర్త తిరిగి వచ్చినాడు" అని చంద్రాంగదుని తీసుకొని వచ్చి తన కూతురును మరల పెండ్లికూతురును జేసి చంద్రాంగదుని కిచ్చి మహావైభవముతో పెండ్లి చేసెను. అతడు సీమంతినితో గలసి సోమవారవ్రతము నియమముగా జేయుచు పదివేలేండ్లు రాజ్యపాలన చేసి శంకరుని అనుగ్రహమును బొందెను.

సోమవార వ్రత మహిమ - 

విదర్భ దేశములో వేదమిత్రుడు, సారస్వతుడు అను బ్రాహ్మణు లిద్దరుండిరి. వారు ప్రాణమిత్రులు. వేదమిత్రుని కొడుకు సుమేధుడు. సారస్వతుని కొడుకు సామవంతుడు. వీరిద్దరు కూడా మిత్రులై ఒకే గురువు దగ్గర సమస్త విద్యలను అభ్యసించి పండితులైరి. వారికి వివాహయోగ్యమైన వయసు వచ్చెను. వేదమిత్ర సారస్వతులు ధనవంతులు కారు.

అందుచేత కొడుకులతో "మీ పాండిత్యములతో ఈ దేశపు రాజును మెప్పించి ధనము సంపాదించుకొని రండు" అని పంపిరి. వారు వెళ్లి రాజదర్శనము చేసి, తమ పాండిత్యప్రకర్షను ప్రదర్శించిరి. ఆ రాజు మీకేమి కావలెనని యడిగెను. వివాహము చేసుకొని సంసారము గడుపుకొనవలెను గాని, మా విద్వత్తును మెచ్చుకొన్నచో తగిన బహుమాన మిప్పింపుడని వారడిగిరి. రాజునకు, రాకూడని ఒక కొంటె ఆలోచన వచ్చెను. "మీలో ఒకరు ఆడ వేషము వేసుకొని, మీరు భార్యాభర్తల వలె నటించుచు, నిషధ రాజైనచంద్రాంగదుని యొద్దకు వెళ్లుడు. ఆయన భార్య సీమంతిని మహాశివభర్తురాలు.

సోమవారమునాడు వ్రతము చేయుచు దంపతీపూజ చేసి అపరిమితమైన ధనములను కానుకగా వచ్చును. వెళ్లి తెచ్చికొనుడు. మీ దారిద్ర్యము తీరిపోవు"ననెను. వారు కపటకృత్యమునకు భయపడుచుండగా "ఇదిరాజాజ్ఞ. తప్పకుండా పాలింపవలసినదే. పొండు" అని అంత:పుర పరిచారికలను బిలిచి సామవంతునికి ఆడవేషము వేయించి పంపెను. వారు సంకోచించుచునే చంద్రాంగదుని భార్య చేయు వ్రతమునకు దంపతులుగా వెళ్లిరి. ఆమె వీరిని చూసి, నిజము గ్రహించి నవ్వుకొని, పీఠముపై కూర్చుండబెట్టి పార్వతీ పరమేశ్వరులుగా భావన చేసి సమస్తోపచారములతో యథావిధిగా పూజించెను.

షడ్రసోపేతమైన విందు చేసి అపారమైన ధనములను దక్షిణగానిచ్చి సాగనంపెను. వారు తిరిగి వచ్చుచుండగా దారిలో సామవంతుడు సుమేధునితో ప్రణయ సంభాషణ మొదలుపెట్టెను. సుమేధుడు, "ఏమిరా! నిజముగా ఆడదానివలె మాట్లాడుచున్నావేమి? నీవు మగవాడవు. అది గుర్తుంచుకొని మసలుము" అనగా సామవంతుడు "నేను ఇప్పుడు మగవాడనుగాను. స్త్రీనైపోతిని. నీవునాకు నచ్చినావు. నాతో విహరింపు"మనెను. సుమేధుడాశ్చర్యపడి ఆమెను నిశితముగా చూచెను.

సామవంతుడు నిజముగా స్త్రీమయ్యెను. సుమేధుడు "నీవు నిజముగా స్త్రీవైనచో, నీ తండ్రి నాకు నిన్నిచ్చినచో మనము దంపతుల మగుదము. పోవుదము రమ్మ"ని ఇంటికి దెచ్చెను. విషయము తెలిసి వేదమిత్ర సారస్వతులాశ్చర్యపడిరి. సారస్వతుడు తన ఏకైక కుమారుడు స్త్రీయైనందుకు విచారించుచు రాజువద్దకు బోయి, "నీ ధూర్తత్వము వలన నా కొడుకు స్త్రీగా మారినాడు. నాకు వంశాభివృద్ధి చేయు నా కుమారుని నీ విట్లు చేసినావు. రాజులకిట్టి పరాచికములు తగునా" యని పలికెను. రాజు, అతడు నిజముగా స్త్రీగా మారెనని తెలిసికొని, సోమవారవ్రత మహాత్మ్యమును గ్రహింపలేక తాను చేసిన శివాపరాధమునకు పశ్చాత్తాపము నొంది, వీరందరితో కలిసి దేవాలయమునకు వెళ్లి నియమముతో నిరాహారుడై మూడు దినములు జగన్మాత నారాధించెను.

దేవి ప్రత్యక్షము కాగా, రాజు ఆమెకు సాష్టాంగ ప్రణామము చేసి తన యపరాధమును మన్నింపుమని ప్రార్థించి, "తల్లీ! ఈ స్త్రీగా మారిన యునవకుని మరల పురుషునిగా జేయు"నని యడిగెను. ఆ తల్లీ.. "రాజా! నా భక్తురాలి భావనను మార్చు శక్తి నాకు లేదు. ఈమె సుమేధునికి భార్యయగును. సారస్వతునికి వంశోద్ధారకుడైన కుమారుడు కలుగును" అని వరములిచ్చెను. జగన్మాత చెప్పినట్లు సామవతిని సుమేధునికిచ్చి సారస్వతుడు పెండ్లి చేసెను. అతనికి తరువాత ఒక కొడుకు పుట్టెను.

భద్రాయుపు చరిత్ర : 

పూర్వం అవంతి దేశంలో ఒక బ్రాహ్మణుడు వుండేవాడు. అతడు కులధర్మాన్ని విడిచిపెట్టి వేశ్యాలోలుడై వున్నాడు. ఒకనాడు ఆ వేశ్యా ఇంటికి ఋషభుడు అనే ఒక యోగి వచ్చాడు. వేశ్య అయిన బ్రాహ్ముణుడు ఆయనకు పరమభక్తితో సేవలు చేసి, పిండివంటలు వండబెట్టి, భోజనం పెట్టి పరిచర్యలు చేశారు. ఆయన వారిని దీవించి వెళ్లిపయాడు. కాలాంతరం తరువాత బ్రాహ్మణుడు మరణించి దశార్ణదేవరాజు భార్య కడుపున పుట్టాడు. ఆమె సవతులు ఆమెకు విషం ఇచ్చారు. అయినా ఆమె చావలేదు. నెలలు నిండగానే ఆమె ఒక కొడుకుకు జన్మనిచ్చింది.

సవతులు ఆమెకిచ్చిన విషప్రభావం వల్ల తల్లీకొడుకులకు దేహమునిండా వ్రణాలు పుట్టి పెద్దగా అయ్యాయి. రాజు దీని బారినుండి బయటపడడానికి ఎన్నో చికిత్సలు చేయించాడు. కాని అవి తగ్గలేదు. చివరికి రాజు విసిగిపోయి తల్లీకొడుకులను అడవిలో విడిచి పెట్టేస్తాడు. ఆ అడవులకు సమీపంలో ఒక నగరం వుండేది. ఆ నగరంలో సంపన్నుడైన పద్మాకరుడు వైశ్యుడు వుండేవాడు. ఈ పద్మాకరుడి దాసి ఒకతే వీరిని చూసి తన యజమాని దగ్గరకు తీసుకుని వెళ్లి, వారికి రక్షణ కల్పించమని ప్రార్థిస్తుంది. అతడు అంగీకరించి వారిని తన ఇంటిలోనే స్థావరం కల్పించి చికిత్స చేయిస్తూ వుంటాడు. ఒకనాడు వ్రణముల బాధతో రాకుమారుడు మరణిస్తాడు. కొడుక చావు బాధను తట్టుకోలేక రాజపత్ని కుంగిపోతుంది.

ఇలా రాజపత్ని ఏడుస్తుండగా.. శివయోగి ఋషభుడు వారింటికి వస్తాడు. అతడు రాజపత్నిని ఓదార్చినా ఆమె శాంతింపలేదు. అప్పుడు ఆ యోగి భస్మము ఆ బాలుడిపై చల్లి అతడ్ని బ్రతికిస్తాడు. తరువాత భస్మమంటిన చేతితో ఆ మాతాపుత్రల శరీరాలకు తాకుతాడు. దీంతో వారి మీద వున్న వ్రణములు పోయి ఆరోగ్యవంతులు అవుతారు. పద్మాకరునికి ఒక కుమారుడు వుంటాడు. అతడు, రాజకుమారుడు ప్రాణస్నేహితులుగా మెలిగి, గురువుల వద్ద తమతమ కులానికి సంబంధించిన విద్యలను భక్తిశ్రద్ధలతో అస్యసిస్తారు. ఒకనాడు ఋషభుడు ఆ రాకుమారుడి వద్దకు వస్తాడు.

అతడు చదివిన చదువులను పరీక్షించి తెలుసుకొని.. "నాయనా! నీకు శివారాధనము చేయు విధానము, శివకవచమును బోధిస్తాను. వానితో నువ్వు శంకరుని ఆరాధించు. నీకు సర్వత్రా జయం కలుగుతుంది" అని ధనుర్బాణములను, ఖడ్గములను ఇస్తాడు. భద్రాయువు (రాకుమారుడు) నియమనిష్టలతో పరమేశ్వరుడిని ఆరాధించడం మొదలు పెడతాడు. శివా తనను అనుగ్రహించడం వల్ల అతనికి అపూర్వశక్తులు లభిస్తాయి. ఇంతలో దశార్ణదేశరాజైన వజ్రబాహునిపై మాగధులు దండెత్తి వారిని ఓడించి, బంధించి రాజ్యాన్ని ఆక్రమిస్తారు.

ఆ సంగతి తెలుసుకున్న భద్రాయువు పద్మాకరుని అనుమతి తీసుకొని వెళ్లి.. ఏకాంగ వీరుడై మగధులను రణమునకు బిలిచి తన పరాక్రమంతో విజృంభిస్తాడు. శివకవచం ప్రభావం వల్ల శత్రువులు ప్రయోగించిన అస్త్రశస్త్రాలు ఇతనికి ఎటువంటి హానిని చేయలేకపోయాయి. అప్పుడతను వారినందరిని సంహరించి, శత్రురాజును బంధించి, సింహాసనాన్ని ఆక్రమిస్తాను. వెంటనే చెరసాలలో వున్న తన తల్లిదండ్రులను విడిపించి, ఆ సింహాసనం మీద తన తండ్రిని కూర్చోబెడతాడు.

వజ్రబాహుడు "నాయనా! నీవు ఎవరివో నాకు తెలీదు. కానీ, నువ్వు నాకు చేసిన ఈ మహోపకారానికి నేను, రాజ్యంలో వుండే ప్రజలందరూ నీకు ఋణపడి వుంటాం" అని చెబుతుండగా.. శివయోగి అక్కడికి వచ్చి "రాజా! నీ భార్యాపుత్రులను రోగగ్రస్తులని పూర్వంలో నీవు అడవిలో విడిచావుకదా... ఆ పుత్రుడే ఇతడు. నీ భార్య ఉత్తముడైన పద్మాకరుని రక్షణలో వుంది" అని చెబుతాడు. దాంతో ఆ రాజు తన కొడుకును ఆనందంతో కౌగిలించుకుంటాడు. రాణిని కూడా పిలిపించి, వారితో సుఖంగా తన జీవనాన్ని సాగిస్తాడు.

చంద్రాంగదుడు అనే రాజు భద్రాయయువు గుణగణాలను వినివుంటాడు. శివయోగి చంద్రాంగదునితో "నీ కుమార్తె కీర్తిమాలినికి యోగ్యుడైన వరుడు అతడే. కావున అతనికిచ్చి వివాహం చేయుము" అని చెబుతాడు. పూర్వజన్మలో వేశ్య అయివుండి కూడా శివయోగిని సేవించిన పుణ్యంవల్ల చంద్రాంగదునికి ఆమె కుమార్తెగా పుట్టింది. ఆ సంగతి తెలిసిన శివయోగి వారిద్దరిని కలిపి, వివాహం జరిపిస్తాడు.

ఒకనాడు భార్య కీర్తిమాలినితో కలిసి అరణ్యానికి విహరించడానికి వెళతాడు. అక్కడ ఒక బ్రాహ్మణ మిథునము వచ్చి రాజును దర్శించి వెళుతుంటుంది. ఆ సమయంలో వారిని ఒక పెద్దపులి తరుముకొని వస్తుంటుంది. అప్పుడు ఆ భయంతో వారు అక్కడినుండి పరుగులు తీస్తారు. అక్కడున్న భద్రాయువు పరుగెత్తి ఆ పులిని బాణములతో హరించడానికి ప్రయత్నిస్తాడు. అయినా ఆ పులి చలించదు. వివిధ శాస్త్రాలను ఉపయోగించి దానిని చంపడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు. కానీ అవేమీ పులిని హాని కలిగించవు. అక్కడున్న బ్రాహ్మణ స్త్రీని ఆ పులి చంపి, తినేస్తుంది.

బ్రాహ్మణుడు ఏడుస్తూ.. "రాజా! నువ్వు ప్రజలను కాపాడలేకపోయావు. నీ రాజరికం ఎందుకు? ఇప్పుడు నీముందే నా భార్య పులి నోటబడి మరణించింది. నాకు యజ్ఞాగ్ని హోత్రాదులు సాగుట ఎలా? అందుచేత నీ భార్యను నాకిచ్చి నువ్వు ఇక్కడినుంచి వెళ్లిపో" అని అంటాడు. రాజు ఆశ్చర్యపడి... "ఓయ్ బ్రాహ్మణా! నీకు ఎన్నో ధర్మాలు తెలుసు. వాటిని నువ్వు ఆచరిస్తావు కూడా. అయినా పరులభార్యను కోరవచ్చా?" అని అడగగా... అతడు ఆ మాటలు పట్టించుకోకుండా ఏడుస్తూనే వుంటాడు. అప్పుడు రాజు తన మనసులో "దు:ఖములో వున్న బ్రాహ్మణుని ప్రాణాలు ఇచ్చిఐనాసరే.. అతని శాంతింపజేయాలి. ఇతడు నా భార్యను అడుగుతున్నాడు. ఇచ్చి ఇతని దు:ఖమును పోగొట్టాలి" అని నిశ్చయించుకుంటాడు.

అలా రాజు అతనితో "ఓ భూసురా! ఇదిగో.. నువ్వు కోరినట్లే నా భార్యను నీకు దానంగా ఇస్తున్నాను. తీసుకో" అని తన సతీమణిని అతనికి ఇచ్చేస్తాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గజ చర్మంతోను, సర్పాభరణాలతోను, చంద్రరేఖతోను, జటాజూటముతో పరమశివుడిగా ప్రత్యక్షమై.. "ఓ రాజా! నీ భూతదయను పరీక్షించడానికి నేనే బ్రాహ్మణుడి రూపంలో వచ్చాను. పులినోట పడిన స్త్రీ పార్వతి. పులి అన్నది నామాయా విలాసము. నీ త్యాగబుద్ధికి నేను చాలా సంతోషిస్తున్నాను. కావలసిన వరాలను కోరుకో" అని పలుకగా.. రాజు ఆయనకు సాష్టాంగదండ ప్రణామములు చేసి, భక్తితో స్తుతించి "పరమేశ్వరా! నీ దర్శనం కలగడంతో నేను ధన్యుడిని అయ్యాను. నన్ను, నా భార్యను, నా తల్లిదండ్రులను, నన్ను పెంచిన పద్మాకర దంపతులను కూడా నీ గణములలో చేర్చుకుని సర్వదా నీ సాన్నిధ్యభాగాన్ని ప్రసాదించు" అని వేడుకుంటాడు.

మాలిని వచ్చి వారిని నమస్కరించి, "దేవదేవా! నా తల్లిదండ్రులకు కూడా నీ సాన్నిధ్యమును ప్రసాదించు" అని అడుగుతుంది. పరమశివుడు వారికి ఆ వరాలచ్చి అక్కడినుంచి అదృశ్యమవుతాడు.

రుద్రాధ్యాయ (నమక) మహిమ :

శివుని విశ్వరూపాన్ని వర్ణించే మంత్రభాగాన్ని రుద్రాధ్యాయం అంటారు. దీనికి నమకమని, శతరుద్రియమనే పేర్లు కూడా వున్నాయి. సంప్రదాయజ్ఞులు నమకము, చమకము, పురుషసూక్తము వంటి మంత్రాలతో శివునికి ఒకసారిగానీ, మూడుసార్లుగానీ, ఐదుసార్లుగానీ, తొమ్మిదిసార్లగానీ, పదకొండుసార్లుగానీ అభిషేకం చేస్తారు. ఈ నమకమును బ్రహ్మ తన దక్షిణ ముఖంనుండి యజుర్వేదంతో సహా ఉచ్చరిస్తాడు. ఇది సకలోపనిషత్తులను సారభూతమైంది.

శ్లోకము : ఏష ఏవ పరోమంత్ర: ఏష ఏవ పరం తప:
రుద్రాధ్యాయజప: పుంసాం పరం కైవల్యసాధనమ్!!

భావం : ఈ రుద్రాధ్యాయము సర్వత్తమమైన మంత్రం. ఇది ఒక గొప్ప తపము. ఇది ముక్తి సాధనం కోసం జపిస్తారు. కామక్రోధలోభాది షడ్వర్గములను నాశనం చేసి కైవల్యమును ప్రసాదించును. నమక పారాయణమును, రుద్రాభిషేకమును చేయు వారి జోలికి మేము పోలేమని యమభటులు యమునితో విన్నవించుకొంటున్నారు. రుద్రాభిషేకం చేసేవారికి అన్నవస్త్రములకు, ఐశ్వర్యాలకు లోపం ఎప్పుడూ కలగదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది. ఆయువు, ఆరోగ్యం లభిస్తుంది.

శ్లోకము : రుద్రాధ్యాయీ వసే ద్యత్ర గ్రామే వా నగరేపి వా!
న తత్ర క్షుత్పిపాసాద్యా దుర్భిక్ష వ్యాధయో పిచ!!

భావం : ఒక రుద్రపారాయణపరుడు ఏదైనా ఒక గ్రామంలోగానీ, నగరంలోగానీ నివసిస్తాడో.. అక్కడ ఆకలిదప్పులుగానీ, కరువుకాటకాలుగానీ, వ్యాధులుగానీ వుండవు.

వింధ్వపర్వతము - అగస్త్యుడు :

ఒకప్పుడు నారదుడు ఓంకారక్షేత్రమును దర్శించి మార్గవశమున వింధ్వపర్వతం దగ్దరకు చేరుకుంటాడు. నారదుని చూసి వింధ్వము మానవరూపంలో ఎదురువచ్చి, స్వాగతం పలికి, తన నివాసానికి తీసుకొని పోతాడు. దధి, మధు, ఆజ్య, నీర, ఆర్ద్రాక్షత, దూర్వ, కుశ, ప్రసూనములతో అష్టార్ఘ్యములొసంగి పూజించెనను. విశ్రాంతి కోసమని నారదుని పాదాలను తొక్కుతూ... "మీరు రావడం వల్ల నా ఇల్లు పవిత్రమైంది. కులపర్వతాలతో మాన్యడయ్యాను. మీరు ఏమి భావించకపోతే.. ఒక మాట అడగాలనుకుంటున్నాను. మేరుప్రముఖ పర్వతాలకు భూమిని ధరించే సామర్థ్యం వున్నదని పెద్దలంటుంటారు. నేను భూమిని భరిస్తున్నాను. పార్వతీ జననం చేత, శివునికి మాయమవుట వల్ల హితవంతుడు పర్వతాలకు రాజయ్యాడు.

సరే.. మరి బంగారంతో, రత్నాలతో నిండి వున్నంతమాత్రాన మేరుపర్వతం గొప్పదవుతుందా? ఉదాహరణకు ఉదయపర్వతమును చూద్దామా..! అది మందేహ రాక్షసులతో నిండిపోయింది. అస్తపర్వతం కాంతిహీనమైంది. మందరము సముద్రంలో తిరిగితిరిగి గుడ్డిదైంది. మలయము సర్పాలతో నిండివుంది. రైవతకము నేతిబీరకాయ వల్ల ధనము ఇవ్వగలుగుతుంది. మిగిలిన పర్వతాలకు భూమిని భరించు సామర్థ్యం లేదు. మరి నాకేమీ తక్కువ?" అని పలుకుతాడు. అప్పుడు వింధ్యుని గర్వమును గ్రహించిన నారదుడు "ఇతడు శ్రీశైలాదులను గమనించినట్లు లేదు" అనుకొని.. అప్పటికి తగిన మాటలను అని వెళ్లిపోతాడు.

వింధ్యునికి తాను తక్కువ వాడని భావం కలిగి.. తన ఆధిక్యాన్ని నిరూపించుకోవాలని తపన కలిగుతుంది. సూర్యచంద్రులు మేరువునకు ప్రదక్షిణము చేస్తారు. వారు నా చుట్టు దిరిగునట్లు చేసెదనని మహోన్నతంగా పెరిగిపోతాడు. సూర్యుడు ఉదయించెను. కానీ రథము ముందుగు సాగలేదు. అక్కడ వింధ్యుడు అడ్డగా నిలుస్తాడు. నక్షత్ర గ్రహసంచారం కూడా ఆగిపోయాయి. అహోరాత్రులకు భేదాలు తెలియడంలేదు. మునుల స్నానసంధ్యాదికృత్యాలు స్తంభించిపోయాయి. బ్రహ్మాది దేవతల దగ్గరకు వెళ్లి మునులు మొరపెట్టుకుంటారు.

వారందరూ ఆలోచించి మహాతపశ్శాలి అయిన అగస్త్యుడు తప్ప మరొకరు దీనికి పరిష్కారం చెప్పలేరని నిర్ణయించి.. అందరూ కలిసి కాశీపురంలో లోపాముద్రంతో నివసిస్తున్న అగస్త్యుని దగ్గరకు వెళ్తారు. ఆయన బ్రహ్మాది దేవతలను చూసి, పరమాశ్యర్యం చెందుతాడు. వారికి తగిన మర్యాదలు చేసి, "మీరందరు నన్ను ధన్యుని చేయడానికి వచ్చారని భావిస్తున్నాను" అని అంటాడు. బ్రహ్మదేవుడు ముందుకు వచ్చి "ఓ మునీంద్రా! ఒక లోకోపకారం నీవల్ల కావలసి వుంది. నువ్వు సామాన్యుడివి కావు. గర్వాంధుడైన నహుషుని శపించి దేవలోకాన్నే కాపాడావు. సముద్రాల నీటిని తాగి కాలకేయాది రాక్షసులను చంపడానికి తోడ్పడినావు. ఈ లోపాముద్ర రాజకుమార్తె అయిన గణనకెక్కిన మహాపతివ్రత" అని పొగుడుతుండగా... "విషయమేంటో చెప్పండి" అని అగస్త్యుడు అంటాడు.

అంతట బ్రహ్మ "చూశావు కదా! లోకానికి కలిగిన ప్రళయము? సూర్యోదయం కాలేదు. సర్వలోకాలు చీకాకు పడుతున్నాయి. సూర్యచంద్రాదుల గమణానికి వింధ్వము అడ్డుగా వచ్చివుంది. నువ్వే అతని గర్వాన్ని అణచగల సమర్థుడివి. ఇది లోకానికి క్షేమంకరమైన కార్యం" అని పలుకగా.. అగస్త్యుడు సరే అని అంగీకరిస్తాడు.

కానీ కాశిని విడిచి వెళ్లవలసి వస్తుంది కదా అని విచారణలో వుంటాడు అగస్త్యుడు. గంగలో స్నానమాడి, గంగను, విశ్వేశ్వరునిని సేవించి, అతనికి, విశాలాక్షిని, కాలభైరవునకు, డుంఢి విఘ్నేశ్వరుడికి, బిందుమాధవునకు, ఇతర దేవతలకు వీడ్కోలు పలికి విచారంగా అగస్త్యుడు కాశీని విడిచి వెళతాడు. వింధ్వపర్వత సమీపానికి వెళ్లగానే అతడు మనిషిరూపంలో ఆయనకు స్వాగతం పలుకుతాడు. "మీరు ఇటువైపుకు రావడానికి కారణమేంటి?" అడి అడుగుతాడు.

మునీంద్రుడు "నేను దక్షిణ దేశయాత్ర చేయడానికి బయలుదేరాను. నీ మర్యాదలకు చాలా సంతోషం. కాని ఈమె రాజకుమార్తె అని నీకు తెలుసుకదా! ఇప్పటికే ప్రయాణం చేసి అలసిపోయింది. నువ్వు ఇంత ఎత్తుకు ఎదిగినందుకు ఆనందమేకానీ, మాకు ముందుకు వెళ్లడానికి దారేది? నువ్వు కొంచెం తగ్గి, ఆయనకు నమస్కరించి, ఇంతకుముందు లాగా తగ్గి దారియిచ్చెను.

ఆయన వెళుతూ.. "మేము మరలా ఈ మార్గం నుండే వచ్చెదము. అప్పుడు మళ్లీ నేను నిన్ను ప్రార్థించలేను. మేము వచ్చేంతవరకు ఇలాగే వుండు" అని కేరి దక్షిణదిశకు వెళ్తాడు. ఆయన కొల్లాపురం దగ్గర శ్రీమహాలక్ష్మిని సేవించి, అక్కడినుండి దక్షారామంనందు వున్న భీమేశ్వరునిని చూసి, అక్కడినుండి శ్రీశైలానికి వెళ్లి భ్రమరాంభమల్లికార్జునులను సేవించి, కాశిని విడిచి వచ్చిన దు:ఖాన్ని విస్మరిస్తాడు. స్కందవనమును చేరి, స్కందుని వల్ల వారణాసీ విశేషాలను తెలుసుకుంటాడు.

జ్ఞానవాపి : 

స్కందుడు అగస్త్వమునితో ఈ విధంగా అంటాడు..."జ్ఞానవాపీ వృత్తాంతము చెబుతాను విను. ఒకప్పుడు భూలోకంలో అనావృష్టి కలిగి ప్రాణులకు గొంతు తడుపుకోవడానికి కూడా నీళ్లు దొరకక అల్లాడిపోతారు. చెరువులు ఎండిపోతాయి. నదులలో నీళ్లు నామమాత్రం అవుతాయి. అటువంటి సమయంలో ఈశానుడు అనేవాడు (ఇతడు ఈశాన్యదిక్పాలుడో లేక ఒక మునియో కావచ్చు) జటాధారి ఆనందకాననమని చెప్పబడే కాశీక్షేత్రమునకు వచ్చాడు.

అక్కడ ఆయన విశ్వేశ్వరలింగాన్ని చూసి అభిషేకం చేయాలని సంకల్పిస్తాడు. కానీ ఎక్కడ నీరు దొరకలేదు. అప్పడు ఈశానుడు తన చేతిలోని త్రిశూలంతో ఆలయానికి దక్షిణంవైపు తవ్వుతాడు. ఆ కుండంనుండి ప్రచండవేగంతో నీళ్లు పైకి వస్తాయి. దాంతో కాశీనగరమంతా జలసంపూర్ణమయ్యింది. ఆ నీటితో ఈశానుడు విశ్వేశ్వరునికి తనివితీర అభిషేకం చేస్తాడు.

దీంతో విశ్వేశ్వరుడు సంతుష్టుడై ఈశానునితో ఇలా అంటాడు.."నువ్వు చేసిన ఈ అభిషేకానికి చాలా సంతోశిస్తున్నాను. నువ్వు ఏదైనా వరాన్ని కోరుకో"అని. ఈశానుడు "స్వామీ! నువ్వు నాకు వరమిచ్చినట్లయితే.. ఈ తీర్థం నీ పేరుమీద ప్రసిద్ధికెక్కినట్లు వరమివ్వు" అని ప్రార్థిస్తాడు.

విశ్వనాథుడు "త్రిలోకంలో వున్న తీర్థములకంటే ఈ తీర్థం శ్రేష్టమై వుంటుంది. ఇది శివతీర్థమని ప్రసిద్ధి పొందును. శబ్దార్థవేత్తలు 'శివ' మనగాజ్ఞానమని చెబుతారు. అది ఇక్కడ ద్రవరూపంలో వెలసింది కావున "జ్ఞానతీర్థం" అని చెప్పబడును. అది కలిగి వున్న వాపి (నూయి) జ్ఞనవాపి. ఈ తీర్థాన్ని సృశించినా, ఆచమనం చేసినా అశ్వమేధఫలం లభించును. ఏకాదశినాడు ఉపవాసం చేసి ఈ తీర్థాన్ని మూడుసార్లు పుచ్చుకొని ఆచమించినచో అతని హృదయంలో శివుడు జ్ఞానదీపమై ప్రకాశించును. ఇది సర్వరోగాలను హరిస్తుంది. ఇక్కడ పిండప్రదానం చేసినవారు పితృదేవతలు తరిస్తారు. ఈ తీర్థంతో విశ్వేశ్వరుడైన నన్ను అభిషేకించినవారికి, సర్వతీర్థాలతో అభిషేకించిన ఫలాన్ని కలుగుతారు. ఈ తీర్థాన్ని భక్తితో సేవించినవారికి జ్ఞానోపదేశం కలుగుతుంది" అని చెప్పగా.. ఈశానుడు చాలా సంతోషిస్తాడు.

అష్టవిధి విధానాలు :

మానవుని లోకంలో వివాహం ఎనిమిది విధాలుగా వుంటుంది. అవి, బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము.

1. బ్రాహ్మము : యోగ్యుడైన వరుడిని పిలిచి, అలంకరించిన కన్యను ఇచ్చి చేయు వివాహాన్ని బ్రాహ్మము అంటారు. ఈ దంపతులకు పుట్టిన కొడుకు ఇరవైతరాలవరకు వారిని తరింపజేస్తాడు. ఇది సాధారణంగా ఇళ్లలో జరుగుతున్నదే.

2. దైవము : యజ్ఞంనందు ఋత్విజుడుగా వచ్చిన బ్రహ్మచారికి కన్యనిచ్చి చేసే వివాహం దైవము. వీరికి పుట్టిన కుమారుడు పద్నాలుగు తరాలవారిని పవిత్రులుగా జేస్తారు.

3. ఆర్షము : వరుని వద్దనుండి రెండు గోవులను కన్యాశుల్కంగా గ్రహించి,కుమార్తెనిచ్చి చేసే వివాహము ఆర్షము. వీరి కుమారుడు ఆరు తరాలవారిని పవిత్రులుగా చేస్తాడు.

4. ప్రాజాపత్యము : మీరిద్దరు దంపతులై గృహస్థధర్మాన్ని నిర్వర్తించండి అని వధూవరులను దీవించి చేసిన వివాహమే ప్రాజాపత్యము. వీరి కుమారుడు ఆరుతరాలవారిని ఉద్ధరిస్తాడు.

5. ఆసురము : వధువు ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా, వరునినుండి ధనం తీసుకొని కన్యను విక్రయించి చేసే వివాహమే ఆసురము.

6. గాంధర్వము : వధూవరులు యుక్తవయస్కులై ఒకరిని చూసి ఇంకొకరు ఇష్టపడి, పెద్దల అనుమతి లేకుండా పంచభూతాల సాక్షిగా చేసుకునే వివాహమే గాంధర్వము. కలియుగంతో సత్యం క్షీణించింది కాబట్టి ఈ వివాహం నిషేధించబడింది. పూర్వం శకుంతలా దుష్యంతులు ఈ విధంగానే దంపతులయ్యారు.

7. రాక్షసము : వధూవరులకు పరస్పరం ఇష్టముంటుంది. పెద్దలు అనుమతించరు. అప్పుడు వరుడు తన భుజబలంతో వారితో పోరాడి గెలిచి, కన్యను తెచ్చుకొని వివాహమాడడం రాక్షసము. పెద్దలు ఈ విధమైన వివాహాన్ని తరుచుగా సమ్మతించరు. శ్రీకృష్ణుడు రుక్మిణిని ఈ విధంగానే చేపట్టాడు.

8. పైశాచము : కన్యకు గానీ, ఆమె కుటుంబంవైపు వారికి గాని ఇష్టముండదు. అయినా వరుడు బలాత్కారంగా కన్యను ఎత్తుకొని పోయి చేసుకునే వివాహమే పైశాచము.

ఈ పై ఎనిమిది వివాహాలలో మొదటి నాలుగు బ్రాహ్మణులకు యోగ్యమైనవి. గాంధర్వ, రాక్షసములు రాజులకు, వైశ్యులకు తగినవి. తన ధర్మపత్నియందు బూతుకాలాన్ని సంగమం చేసేవాడు సదా బ్రహ్మచారిగా పరిగణించబడతాడు. పగటి కాలంలో, తల్లిదండ్రుల శ్రాద్ధదినములలో, సర్వపర్వములందు స్త్రీసంగమం చేయరాదు. చేసినచో ధర్మం నుండి పతితుడవుతారు. దానివల్ల అథోగతులు కలుగుతాయి. కన్యలను నమ్ముకొని ఆ ధనంతో జీవించేవాడు ఒక కల్ప పర్వంతం నరకంలో నుండి పురుగులను ఆహారంగా తింటాడు. వాడేకాక వాని పూర్వులను కూడా నరకంలో తీసుకెళ్తాడు.

తన భర్తతో సంతుష్టి పొందిన పతివ్రతను, తన ధర్మపత్నితో సంతోషం పొందిన భర్త, ఏ గృహంలో అయితే వుంటారో, అక్కడ శ్రీమహాలక్ష్మి, నారాయణునితో సహా నివసించి శుభాలు కలుగుతాయి. గృహస్తులకు నిత్యం పంచసూచనాలతో (ఐదు విధాలైన జీవుల వధ్యస్థానములు) పని వుంటుంది. అవి కండన్సిరోలు, పేషణ్సితిరుగలి, లేదా సన్నికల్లు, చుల్ల్సీపొయ్యి, ఉదకుంభ: నీడి కడవ, మార్జన్సీచీపురుకట్ట. ఈ ఐదింటిని గృహస్తులు వాడక తప్పదు. వాడినప్పుడు వారికి తెలియకుండా కొంత జీవహింస జరగవచ్చు. ఈ పాపాన్ని తొలగించుకోవడానికి వెనుక చెప్పిన పంచమహాయజ్ఞములను గృహస్థులు చేయాలి. వాటితో పరిహారమగును.

కొన్ని సాధారణ ధర్మాలు : 

అశ్వద్ధ వృక్షముగాని, రచ్చబండమీద చెట్టుగాని, గురువుగాని, నీటి కడవగాని, అన్నరాశిగాని, పెరుగు - పాల కడవలు గాని కనబడినప్పుడు వాటికి ప్రదక్షిణములు చేయాలి. భార్యతో సహా పంక్తిని భుజింపరాదు. భోజనం చేస్తున్న స్త్రీని చూడరాదు. ఒక్క వస్త్రాన్ని ధరించి భుజింపరాదు. అగ్నిని నోటితో ఊదకూడదు. నిద్రపోతున్న వారిని లేపకూడదు. సాయంత్రంవేళ ఎటువంటి పదార్థాలను తినకూడదు, నిద్రపోకూడదు. నిలబడివుండి మూత్రాన్ని విసర్జించరాదు.

నీటిలో మలమూత్రాలను విడవకూడదు. ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. ఇతరుల బట్టలను ధరించరాదు. చెప్పులు కూడా ఇంకొకరివి వేసుకోకూడదు. రాత్రిపూట పెరుగుతో అన్నం తినకూడదు. చిరకాలం జీవించాలనుకునేవాడు, గోవుమీద స్వారి చేయకూడదు. ప్రేతధూమం (వల్లకాటి పొగ) నాఘ్రాణించరాదు. ఉదయం సూర్యుని ఎండలో కూర్చోకూడదు. ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. అదికూడా ప్రేమగా చెప్పాలి. ప్రేమగా వున్నారుకదా అని చనువుగా తీసుకుని అసత్యం చెప్పకూడదు. ఓ అగస్త్యమునీ! ఇది సనాతనమైన ధర్మం.

శ్లోకం : సత్యం బ్రూయా త్ప్రియం బ్రూయా
న్న బ్రూయా త్సత్య మప్రియం
ప్రియంచ నానృతం బ్రూయా
దేష ధర్మో ఘటో ధ్భవ! (స్కంద:)

భావం : పెద్దవారు వచ్చినప్పుడు, తన పీఠమునుండి లేచి వారికి ఇవ్వాలి. పెద్దలు వున్నచోట కాలుచాపి కూర్చోవడం, పడుకోవడం పనికిరాదు. పెద్దలను పరోక్షంగాకానీ, ప్రత్యక్షంగాగానీ నిందించకూడదు. ఎదుటివారిని స్తుతించుట, ఆత్మనింద పనికిరావు.

శ్లోకం : శ్రద్దయా ప్రతిగృహ్ణాతి శ్రద్ధయా య: ప్రయచ్ఛతి
స్వర్గిణౌ తావుభౌ స్యాతతాం పతతో శ్రద్ధయా త్వద: !!

భావం : దానం ఇచ్చేవాడుగాని, తీసుకునేవాడుగాని శ్రద్ధగలవారైనప్పుడే ఇద్దరికి స్వర్గసుఖం కలుగుతుంది. శ్రద్ధ లేనిచో పతనం చెందుతారు. వేదవిద్యను శిష్యులకు దానం చేయడంవల్ల బ్రాహ్మణుడు బ్రహ్మలోకాన్ని పొందుతాడు. అసత్యం పలికితే చేసిన పూజలు ఫలించవు. గర్వం వల్ల తపము నాశనమవుతుంది. పదిసార్లు పొగడటంవల్ల తానిచ్చిన దానంవల్ల ఫలం నశిస్తుంది. బ్రాహ్మణుని దూషించినచో ఆయుర్దాయము నశించును.

వ్యాసుడు కాశిని శపించబోయి భంగపడుట : 

ఒకప్పుడు వ్యాసుడు శౌనకాది మునులుండే నైమిశారణ్యానికి వెళ్తడు. వేదాలను విభజించిన వాడని, పురాణాలను రచించినవాడని వ్యాసునికున్న గౌరవంతో మునులు ఆయనకు మర్యాదలు చేస్తారు. అప్పుడు ఆ మునుల మధ్య "ముక్తినిచ్చేవాడు విశ్వేశ్వరుడా? లేక విష్ణుమూర్తియా?" అని చర్చ జరుగుతుంటుంది. చివరికి ఆ మునులందరూ "విశ్వేశ్వరుడొక్కడే ముక్తిదాత. మరొకడు ఎవ్వరులేరు" అని అంటారు.

అప్పుడు వ్యాసుడులేచి, చెయ్యి పైకెత్తి "ఇదిగో.. నేను చెబుతున్నాను వినండి. వేదాలలో, పురాణాలలో, మహాభారతంలో వర్ణింపబడినవాడొక్కడు విష్ణుమూర్తియే. అతడే సృష్టి స్థితిలయములకు కారణభూతుడైన యాదిపురుషుడు. కాబట్టి అతడే మోక్షదాత శివుడు కాడు" అని చెబుతాడు. అది విన్న మునులందరూ ఆశ్చర్యపోయి, "మహానుభావా! నువ్వు సర్వజ్ఞుడవు. నీకంటే బాగా తెలిసిన వారెవ్వరున్నారు? అయితే, నువ్వు ఇప్పుడన్న మాటలు కాశిలో విశ్వేశ్వర సన్నిధిలో చెబితే, మాకు ఆనందం కలుగుతుంది" అని అంటారు.

వ్యాసుడు అంగీకరించి తన పదివేలమంది శిష్యులతో, మునులతో కాశికి వెళ్తాడు. అక్కడ స్నానం చేసి, బింధుమాధవునిని భక్తితో సేవించి...

శ్లోకము : సహస్రశీర్ష పురుష పురుహూత సుఖప్రద!
యధ్భూతం యచ్చ భావ్యం వై తత్రైక: పురుషో భవాన్ !!

అనే స్త్రాత్రాన్ని చేస్తాడు. తరువాత నృత్యగీతవాద్యాలతో మాధవునిని సేవిస్తాడు. ఆ పిమ్మట మాధవుడొక్కటే మోక్షదాత అని చేతిని పైకి ఎత్తుతాడు. అప్పుడు అతని చేయి ఎత్తినట్లే స్తంభించిపోతుంది. మాటలు కూడా స్తంభించిపోతాయి. అప్పుడు మాధవుడు వచ్చి... "ఓయి వ్యాపా! ఎంత తప్పు చేసినావు?

ఏక ఏవ హి విశ్వేశో ద్వితీయో నాస్తి కశ్చన,
తత్ప్రసాదా దహం చక్రీ లక్ష్మీ శస్తత్ప్రభావత: !!
తైలోక్యరక్షా సామర్థ్యం దత్తం తే నైవ శంభువా !

భావం : ఈ విశ్వంలో ఈశ్వరుడు అతడొక్కడే. వేరొకరు లేరు. ఆయన దయవల్లే నేను చక్రినయ్యాను. లక్ష్మీశుడనయ్యాను. త్రైలోక్యాన్ని రక్షించే సామర్థ్యం అతని వల్లే నాకు కలిగింది. నువ్వు శుభాన్ని గోరాలంటే శంకరుని స్తుతించు" అని అంటాడు.

అప్పుడు వ్యాసుడు తన కంఠాన్ని తాకుమని సన్న చేస్తాడు. విష్ణువు అలా చేయగా.. నందివల్ల స్తంభించిన వాక్కును, అంగములు తిరిగి స్వాధీనంలోకి వస్తాయి. అప్పుడు వ్యాసుడు శ్రీమహాదేవునిని అనేక విధాలుగా స్తుతిస్తాడు. తరువాత వ్యాసుడు "లింగేష్వేకో హి విశ్వేశ, స్తిర్థేషు మణికర్ణికా" అని చాటుతూ, నిత్యం స్నానంచేసి ముక్తిమండపంలో కూర్చొని శిష్యులకు విశ్వేశుని దివ్యమహిమలను, వేద పాఠాల గురించి చెబుతూ గడుపుతుండేవాడు.

ఒకనాడు విశ్వనాథుడు అన్నపూర్ణతో "వ్యాసుడికి భిక్ష దొరకకుండా చేయు" అని చెబుతాడు. ఆమె కాశియందలి సర్వగృహిణుల హృదయంలో ఆవేశించి, వ్యాసుడిని, శిష్యులను భిక్షకు వచ్చినప్పుడు ఏదో ఒక వంక చెప్పి భిక్ష పెట్టకుండ చేస్తుంది. ఆనాడు శిష్యులతో వ్యాసుడు ఉపవాసం చేస్తాడు. మరునాడు యథాప్రకారంగా భిక్షకు బయలుదేరుతారు. వ్యాసునికిగాని, శిష్యులకుగాని యే ఇంటిదగ్గర భిక్ష దొరకలేదు.

వ్యాసుడు శిష్యులతో "మనకు నిన్న, ఈనాడు భిక్ష దొరకకపోవడానికి హేతువు ఏమై వుంటుంది? మిగిలినవారికి లభిస్తోంది కదా! మనకు మాత్రమే ఎందుకు లభించుట లేదు? ఎవరైనా అడ్డు పడ్డారా? విచారించి రండి" అని పంపగా... వారు వెళ్లి వచ్చి "గురుదేవా! అందరూ క్షేమంగానే వున్నారు. ఎవరికీ దారిద్ర్యం లేదు. ఎవరూ అడ్డుపడలేదు. అందరూ శ్రీ విశ్వేశ్వరారాధకులే. మనకు భిక్ష లభించకపోవడానికి కారణమేంటో తెలియడం లేదు?" అని విన్నవిస్తారు.

వ్యాసుడు "కాశి సర్వవిద్యలకు నిలయమం, లక్ష్మీ నివాసం, ముక్తి క్షేత్రం. అందువల్ల ఇక్కడ వుండేవారు గర్వించి మనకు భిక్ష పెట్టేవారు కారు" అని క్రోధంతో

"మా భూ త్రైపూరుషీ విద్యా మా భూ త్రైపూరుషం ధనం,
మా భూ త్రైపూరుషీ ముక్తి: కాశ్యాం నివసతాం నృణామ్"

(కాశిలో నివసించేవారికి మూడుతరాల వరకు విద్య, సంపద, ముక్తి లేకుండుగాక) అని శపిస్తాడు. శాపమిచ్చిన తరువాత కూడా మళ్లీ భిక్షకై వీధివీధి తిరుగుతారు. కాని భిక్ష లభించదు. కోపంతో చేతిలో భిక్షపాత్రను నేలమీద పగులగొట్టి ఆశ్రమానికి పోతుండగా.. ఒక ఇల్లాలు వ్యాసునిని పిలిచి "మునీంద్రా! నా భర్త వృద్ధుడు. ప్రతిదినం అతిథులకు పెట్టకుండా ఏమీ తినడు. ఈరోజు అతిథులు ఎవరు రాలేదు. ఆయన భుజించకుండా కూర్చున్నాడు. మీరు అతిథులుగా దయచేయండి" అని పిలుస్తుంది.

వ్యాసుడు ఆమెను చూసి, ఆశ్చర్యపడి... "అమ్మా! నిన్న, ఈరోజు కాశిలో మా మొహం చూసినవారు లేరు. నువ్వు భోజనానికి పిలిచావు. సంతోషము. నేను ఒక్కడినే కాదు. నాకు పదివేలమంది శిష్యులున్నారు. వారు కూడా నాలాగే ఆకలిని తట్టుకోలేక వున్నారు" అని అంటాడు. ఆ ముత్తైదువు "అలా అయితే మీరందరూ భోజనానికి రండి. ఆలస్యం చేయకూడదు" అనగా.. వారందరూ సంతోషడి వస్తారు. పాదప్రక్షాళన చేసుకొని అందరూ కూర్చుంటారు. వడ్డించిన పధార్థాలను చూడగానే వ్యాసుడు, శిష్యులు భుజిస్తారు. కాళ్ళు, చేతులు కడుక్కొని యాచమించి, ఆ ఇల్లాలిని దీవించి బయలుదేరడానికి సిద్ధపడతారు.

అప్పుడు ఆ ఇల్లాలు వ్యాసునితో... "తీర్థవాసులకు ముఖ్య ధర్మం ఏది అని మా భర్త అడుగుతున్నాడు" అని ప్రశ్నిస్తుంది. వ్యాసుడు, "తల్లీ! అల్పజ్ఞుడిని, నేనేమి చెప్పగలను. అన్నీ నీకు తెలుసు. అడుగుతున్నావు గనుక చెబుతున్నాను. ఆకలిగా వున్నవారికి అన్నం పెట్టటం, తిన్నవారు అన్నదాతకు సంతోషం కలిగించడం కన్నా ఉత్తమ ధర్మం లేదు" అని అంటాడు. ఆమె "అదే ధర్మమైతే యథాశక్తిగా చేస్తున్నాను. నీవు సామాన్యధర్మాలను చెప్పు" అని అడుగుతుంది.

అప్పుడు వ్యాసుడు.. "ఎవరినీ నొప్పించకుండా మాటలాడటం, తానున్న స్థానం వృద్ధినొంద గోరుట నేవి ప్రతి మానవునికి సామాన్య ధర్మాలు" అని చెబుతాడు. అది విన్న వృద్ధ గృహస్థుడు.. "మునీంద్రా! ఈ ధర్మాలలో నీ దగ్గరున్న వెన్ని?" అని ప్రశ్నించగా వ్యాసుడు నిశ్చష్టుడై చూస్తాడు.

మళ్లీ ఆయన ఇలా అంటాడు.. "ఈ ధర్మాల గురించి చెప్పడానికి నీవే అర్హుడివి. నీకన్న మృదువైన మాటతీరు, ఆలోచించి పనిచేయగల స్వభావం, వున్నఇంటికి మేలుగోరుతత్త్వం, ఇతరుల ఔన్నత్యాన్ని సహించే శాంతస్వభావములు మరెవ్వరికి వుండవు? మహానుభావుడివి గనుక నువ్వు చెప్పగలవు. చెప్పినవి ఆచరించగలవు కూడా" అని వ్యంగ్యంగా మాట్లాడుతాడు.

అంతటితో ఆగకా.. "నీకు నీ అభాగ్యం వల్ల భిక్ష దొరకలేదు. దానికి పురవాసుల దోషం ఏమున్నది? ఎందుకు వారిని అనవసరంగా శపించావు? ఇది నా రాజధాని. దీనిపై నీవంటివారి శాపాలు పనిచేయవు. నీవంటి క్రోధుడు మహాపుణ్యక్షేత్రమైన కాశిలో నివసించడానికి అర్హుడు కాడు. వెంటనే ముక్తి క్షేత్రమైన కాశిని వదిలి వెళ్లు. ఈ కాశిపై ఎవ్వరైనా దుర్మార్గాన్ని చూపించినచో వాడు రుద్రపిశాచమవుతాడు" అని కఠినంగా మాట్లాడుతాడు.

అది విన్న వ్యాసుడు గడగడ వణుకుతూ, వారి పాదాలపై పడి జగన్మాతతో... "తల్లీ! నేను అనాథుడిని. అవివేకుడ్ని, నిన్నే శరణు పొందాను. రక్షించు. నీ కుమారుని వంటివాడిని. విశ్వనాథుని శాపము నుండి నన్ను కాపాడు. కాశిని విడిచి నేను బ్రతకలేను. ప్రతి అష్టమినాడు, ప్రతి మాసశివరాత్రినాడు నాకు కాశీప్రవేశానికి అనుమతి ఇవ్వు" అని దీనంగా ప్రార్థిస్తాడు.

ఆ జగన్మాత కరుణామూర్తియై, తన భర్తవైపు చూస్తుంది. తరువాత వ్యాసునితో "నీ కోరిక తీరుతుంది" అని పలుకుతుంది. ఆ దంపతలంతర్ధాన మొందిరి. వ్యాసుడు వెంటనే కాశిని విడిచి, గంగకు తీర్పుతీరంలో నివసిస్తూ, నిత్యం కాశినగరంవైపు చూస్తూ, నిట్టూర్చుతూ, తన దురదృష్టాన్ని నిందించుకొంటుంటాడు. అప్పుడు అతను నివసించిన ప్రాంతమే "వ్యాసకాశి". యాత్రలకు వెళ్లినవారు, వ్యాసేశ్వరునిని దర్శించుకొని వెంటనే తిరిగి వచ్చేస్తారు. వ్యాసకాశిలో నివసించరు. అగస్త్యునకు స్కందుడి కథ చెప్పి, "మునీశ్వరా! కాశికి శుభం కోరేవారికి ఎల్లప్పుడూ శుభమే కలగాలి" అని చెబుతాడు.

ఇంద్రద్యుమ్ముడు :

పూర్వం ఇంద్రద్యుమ్ముడనే ఒక మహారాజు అనేక యజ్ఞాలు చేశారు. ఆయన చేసిన యజ్ఞముల దర్భలతో భూమి రెండంగుళాల ఎత్తు పెరిగింది. యజ్ఞాగ్నిహోత్రముల వేడికి భూమి ఉడికిపోయి, లోపలినుండి జలం ఆధారంగా పైకి పొంగివచ్చింది. అదే మహీనది అని పేరు పొందింది.

ఇంద్రద్యుమ్నుడు దేహము చాలించి, స్వర్గానికి పోయి భోగాలను అనుభవిస్తుంటాడు. కొన్ని కల్పములు గడుస్తాయి. ఒకనాడు బ్రహ్మ ఇంద్రద్యుమ్నుడ్ని పిలిచి, "నువ్వు స్వర్గ సుఖాన్ని అనుభవించినందుకు పుణ్యం చెల్లిపోయింది. పుణ్యహీనులు స్వర్గాన్ని అనుభవించే వీలులేదు. నీ పుణ్యాలను సంపాదించుకొని రా" అని చెప్పాడు.

అతడు "నేను పుణ్యం ఎలా సంపాదించాలి?" అని అడగగా.. "భూలోకంలో నీ గురించి ప్రశంసించేవారు వుంటే... ఆ కీర్తి వల్ల నువ్వు పుణ్యాలను పొందినట్లే. వెళ్లి విచారించి రా" అని పంపిస్తాడు.

పూర్వము తాను పరిపాలించిన కాంపిల్య నగరానికి వస్తాడు. అంత అతనికి కొత్తగా అనిపిస్తుంటుంది. "ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పూర్వం ఈ నగరాన్ని పాలించాడు. అతని గురించి మీకు తెలుసా?" అని అందరిని అడిగాడు. వారు "తెలియదు.. కానీ సప్తకల్పముల ఆయుర్దాయముగల మార్కండేయుడిని అడుగు" అని చెప్పారు.

రాజు ఆ మార్కెండేయున్ని వెతుక్కుంటూ వెళ్లి, అతనికి నమస్కరించి.. "ఇంద్రద్రుమ్యుని గురించి మీరైమైనా చెప్పగలరా?" అని అడుగుతాడు. ఆయన "నాకు తెలియదు కానీ, నాకు మిత్రమైన ఒక బకం గలదు. అది నాకంటే చాలా పెద్దది. అది చెప్పగలదు రా" అని తీసుకొని వెళ్తాడు.

నాడీజంఘుడను ఆ బకము వారికి మర్యాదలు చేసి "నాకు పద్నాలుగు కల్పములు గుర్తున్నాయి. కానీ ఇంద్రద్యుమ్నుని గురించి వినలేదు" అనగా.. రాజు, మార్కెండేయుడు నిరుత్సాహపడతారు. రాజు.. "నేను పుణ్యహీనుడై బ్రహ్మ దగ్గరికి వెళ్లి మళ్లీ అతనిచే పొమ్మనిపించుకోలేను. అగ్నిప్రవేశం చేసెద"ననగా బకము.. "రాజా నాకంటే వృద్ధమైన ప్రాకారకర్ణుడనే గుడ్లగూబ కలదు. దానిని అడుగుదాం" అని ముగ్గురు వెళ్లి అతడిని చూసి ఇంద్రద్యుమ్నుని గురించి అడిగారు.

ఆ గూడ "మిత్రులారా! నేను పుట్టి ఇరవైఎనిమిది కల్పముల అయింది. ఆ రాజు గురించి వినలేదు. కాని నాకన్నా వృద్ధమైన గ్రద్ధ ఒకటి గంధమాదనపర్వం మీద వుంది. దానిని అడుగుదాం" అని వారితోకూడా బయలుదేరి గ్రద్దవద్దకు వచ్చి ఆ రాజు గురించి అడిగారు.

అప్పుడా గ్రద్ద "నేను ఆ రాజు గురించి వినలేదు. కానీ, నాకన్నా పెద్దదైన మంథరకుడనే తాబేలుంది. దానిని అడుగుదాం" అని చెబుతూ తాను కూడా వారితో మంథరకుని వద్దకు వెళ్లెను.

మంథరకుడు వీరిలో వున్న రాజును చూసి నీటిలోనికి పారిపోగా.. వారు అతనిని పిలిచి, "మిత్రులకు మర్యాద చేయకుండా పోతున్నావేమీ?" అని అడగగా.. అతడు "నేను ఈ రాజును చూసి భయపడి పారిపోతున్నాను. విశాలమైన బొరుసు కలిగివున్నందున నన్ను ఇతడు అనేక యజ్ఞాలలో వేదికగా ఉపయోగించుకున్నాడు. ఇప్పటికీ ఆ కాలిన పుండు మానలేదు. మళ్లీ నన్ను యజ్ఞవేదికగా వాడుకోవడానికి వచ్చాడేమోనన్న భయంతో వెళ్లడానికి ప్రయత్నించాను. అంతేకాని అతిథి మర్యాద తెలియక కాదు" అనగానే.. ఇంద్రద్యుమ్నును కోసం దేవలోకం నుండి విమానం వస్తుంది.

దేవదూతలు ఆ రాజును ఆహ్వానించారు. రాజు "నా మిత్రులైన వీరందరినీ కూడా రానిస్తే.. స్వర్గానికి వస్తాను" అని అంటాడు. వారు "రాజా! వీరందరూ శివారాధనం చేసి ప్రమథగణములో చేరిపోయారు. కర్మవశమున శాపగ్రస్తులై ఇలా వున్నారు. శాపములు తీరగానే వీరు శివసన్నిధికి చేరుకుంటారు. నువ్వు రా.. వెళదాం" అని అంటారు.

రాజు ఆ మాటలు విని.. "అవునా! వీరు శివారాధనం చేసి శాశ్వత స్థానాన్ని పొందారా? నేను అటువంటి శాశ్వత స్థానాన్ని ఎందుకు సంపాదించకూడదు? స్వర్గానికి పోయిన కొంతకాలానికే నీ పుణ్యం క్షీణించింది. అందుకే పొమ్మంటారు. అలా అనిపించుకోవడం ఎందుకు? మిత్రులారా! నాకు కూడా శివారాధనం చేసి మోక్షం పొందే మార్గాన్ని ఉపదేశించండి" అని పలికి.. వచ్చిన దేవ విమానాన్ని వెనక్కి పంపివేస్తాడు.

తరువాత మంథరకుని మాటపై వారందరూ కలిసి మాళవదేశంలో వున్న సంవర్తుడనే మహాముని దగ్గరకు వెళ్లారు. శ్రమపడి ఆయన దయ సంపాదిస్తారు. ఆయన "ఈ ఇంద్రద్యుమ్నుని యాగాల వల్ల ఉడికిన భూమినుండి పొంగిన మహానది ఇదే. ఇది తీర్థములకెల్లా ఎంతో మహిమ కలది. నేను ఏబదియారు కల్పములనుండి ఈ నదీతీరంలో తపము చేసుకుంటున్నాను. మీరు ఈ నదిలో స్నానమాడి శివునిని సేవించండి. మీకు ఉత్తమగతులు కలుగుతాయి" అని బోధిస్తాడు.

అప్పుడు వారు అతనిని గురువుగా భావించి, శివునిని ఆ నదీ జలంతో అభిషేకించి, శివుని అనుగ్రహం సంపాదిస్తారు. ఇంద్రద్యుమ్నుడక్కడ మహాకాళేశ్వరుడు అనే ఒక శివలింగాన్ని ప్రతిష్టించి పూజిస్తాడు. ఈ రీతిగా వారు చేసిన శివార్చనం వల్ల శాశ్వతంగా శివలోకాన్ని పొందారు. నాడీ సంఘాదులకు శాపములు తొలగిపోతాయి. వారు కూడా ప్రమథగణములో వారివారి స్థానాలను పొందుతారు. శివార్చనం సకల శ్నేయోదాయకం.
అందేకాదు.. స్వర్గాది భోగాలు తాత్కాలికం. "క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి" (పుణ్యం తరిగిపోగానే స్వర్గంనుండి జారి భూమిలో పుడతారు) అని గీతావచనం అట్టి స్వర్గసుఖాలకంటే శాశ్వతమైన మోక్షాన్ని బుద్ధిమంతుడు కోరుకోవాలి.

Source: teluguwishesh


ప్రాచీన కాలంలో వున్న అస్పరసల పాత్ర ఎంతో అద్వితీయమైనది. సౌందర్యానికే ప్రతీకగా వర్ణిస్తూ ఎన్నో రకాల కథలు ప్రచురించబడ్డాయి. కేవలం అందగత్తెలే కాకుండా మంచితనం కలిగినటువంటివారి జీవిత చరిత్రలు.. మట్టిబొమ్మలు ప్రాణం పోసుకున్నట్టు అపురూపంగా వుంటాయి. ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ స్త్రీలకు ముగ్ధులయిపోయేవారు. అటువంటి మహోన్నత పాత్రలను కలిగిన స్త్రీలలో అహల్య ఒకటి. ఆమె మంచిగుణాల గురించి ఒకసారి మనం కూడా తెలుసుకుందాం...

పూర్వం చతుర్ముఖుడు, గౌతమ మహర్షికి నిత్యం సేవలను అందించేందుకు, ఆయన ఆశ్రమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు ఒక అప్సరసను ఏర్పాటు చేశాడు. ఆమె పేరు అహల్య. ఈమె సుగుణాలతో కూడిన సౌందర్యవంతమైన ఒక అందాల రాశి. ఈమె ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎంతో నిస్వార్థతతో, నిజాయితీగా నిత్యం గౌతమ మహిర్షికి సేవలను అందిస్తూ... ఎంతో అందంగా, సక్రమంగా నిర్వహించుకునేది. దాంతో ఈమె నిజాయితీని గమనించిన బ్రహ్మదేవుడు.. గౌతమునికి అహల్యే తగిన భార్య అని భావిస్తాడు.

అలా ఆలోచించిన మరుక్షణమే బ్రహ్మదేవుడు, ధ్యానం చేసుకుంటున్న గౌతమ మహర్షి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంటాడు... "ఓ గౌతమా! నేను నీకు పెట్టిన అన్ని పరీక్షలలోనూ నువ్వు గెలిచావు. ప్రసవిస్తున్న గోవుకి ప్రదక్షిణ చేస్తూ నమస్కరిస్తే.. భూప్రదక్షిణతో సమానమైన పుణ్యం లభిస్తుంది. అటువంటి పుణ్యంతోపాటు ఎన్నో పుణ్యకారాలను సంపాదించుకున్నావు. అందుకు ప్రతిఫలంగా నేను నీకు అహల్యను భార్యగా ప్రసాదిస్తున్నాను. అహల్యను మనస్సుతో స్వీకరించి, ధన్యుడివి అవు" అని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా.. బ్రహ్మదేవుడే దగ్గరుండి వనదేవతల సమక్షంలో వీరిద్దరి వివాహాన్ని (గౌతమ మహర్షి, అహల్య) జరిపిస్తాడు.

ఇలా జరిగిన వీరి వివాహనంతరం కొంతకాలానికి వీరిద్దరికి శతానందుకు అనే ఒక కొడుకు పుడతాడు. ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కొన్నాళ్ల తరువాత గౌతమ మహర్షి తపో దీక్షను చేపడతాడు. ఆ దీక్ష ప్రభావం ఎంతగా వుంటుందంటే.. ఏకంగా స్వర్గాన్నే కదిలించేలా వుంటుంది. దాంతో స్వర్గలోకానికి అధిపతి అయిన ఇంద్రుడు ఒక్కసారిగా భయానికి గురవుతాడు. ఎక్కడ తన పదవి పోతుందేమోనన్న భయంతో.. అతని దీక్షను భంగం కలిగించాలని ఒక పన్నాగం పన్నుతాడు. దానికి దేవతలందరి సహాయాన్ని కూడా కోరుకుంటాడు.

అయితే అహల్య అందానికి ముగ్ధుడైన దేవేంద్రుడు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు. ఒకవైపు తన స్వర్గలోకాన్ని - దేవతలను కాపాడుకునేందుకు, మరోవైపు అహల్యను పొందాలనుకునేందుకు దేవేంద్రుడు ఒక తనదైన ఒక పన్నాగం పన్నుతాడు. దానిప్రకారం ఒకరోజు దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమానికి చేరుకుంటాడు. ఇంకా తెల్లవారుజాము కాకముందే కోడిరూపంలో వచ్చిన దేవేంద్రుడు గట్టిగా కూస్తాడు. దాంతో గౌతముడు ఒక్కసారిగా ఉలిక్కపడి లేచి, బ్రహ్మముహూర్తం సమీక్షించిందని అనుకుని, సూర్యభగవానుని అర్ఘ్యం ఇచ్చేందుకు బయటకు వెళతాడు. పవిత్ర నదీజలాన్ని తెచ్చుకునేందుకు నదివైపుగా వెళుతుండగా చుట్టుపక్కల  కారు చీకటి కమ్మకుని వుంటుంది. అప్పుడు గౌతముడు తన మనసులో.. "కోడి కూసినప్పటికీ ఎక్కడా వెళుతురు జాడ కనిపించడం లేదు. ఇంకా తెల్లవారలేదులే" అని అర్థం చేసుకుని తిరిగి వెనక్కి ఆశ్రమానికి వెళతాడు.

గౌతముడు ఆశ్రమానికి చేరుకోగానే.. తన రూపంలో వున్న దేవేంద్రునిని అహల్యతో కలిసి వుండడాన్ని చూస్తాడు. దాంతో గౌతమ మహర్షికి ఎనలేని కోపం పొంగుకొని వస్తుంది. అవమానంతో కుంగిపోతున్న దేవేంద్రుడు, కోపంతో రగిలిపోతున్న మహర్షిని చూసి భయంతో తన అమరలోకానికి పరుగులు తీస్తాడు. అయితే ఇందులో అహల్య ఏ తప్పు లేకపోయినా.. ఇంద్రుని పక్కన వున్నందువల్ల గౌతమ మహర్షి కోపంతో ఆమెను శపిస్తాడు. "నువ్వు రాయిగా మారిపో" అంటూ క్షణికావేశంతో అంటాడు. అప్పుడు కూడా అహల్య తన భర్త మాటను శిరసావహిస్తూ ఏమీ అనుకోకుండా.. అతను విధించిన శాపాన్ని గౌరవంగా అంగీకరిస్తుంది.


ఇదంతా జరిగిపోయిన కొద్దిసేపటి తరువాత గౌతమ మహర్షి తన దివ్యదృష్టితో ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటాడు. అహల్య తప్పు ఏమీలేదని గ్రహిస్తాడు. దానికి ఎంతో పశ్చాత్తాపపడుతూ.. "రాయిగా వున్న నువ్వు రాముడి పాదాలు తాకినప్పుడు తిరిగి స్త్రీ రూపాన్ని పొందుతావు" అని శాపవిమోచనాన్ని ప్రసాదిస్తాడు. అలా రాయిగా మారిపోయిన అహల్య శాప విమోచన పొందేందుకు రాముని రాక కోసం ఎదురుచూస్తూ తన కాలాన్ని గడిపింది. చివరికి చాన్నాళ్ల తరువాత రాముని పాదాలతో పునీతురాలై.. మళ్లీ స్త్రీ రూపాన్ని పొందుతుంది.

అదీ అహల్య గాధ. అహల్య ఎంతో సాత్వికురాలు కాబట్టి.. తన భర్త రూపంలో వచ్చిన ఇంద్రుడు సల్లాపాలు ఆడినప్పుడు కూడా.. తన భర్తేనని అనుకుని మురిసిపోయింది. అంతేకాని.. ఆమెకు ఇతర పురుషుల మీద వ్యామోహం అనేది అస్సలు వుండేది కాదు. తొందరపాటుతో భర్త శాపించినప్పటికీ దానిని అంగీకరిస్తూ తన భర్త మాటను దాటేయకుండా శిరసావహించింది. ఇదే అహల్య గొప్పతనం.


పూర్వం మహా శివుడు, పరాక్రమవంతుడైన అర్జునుని విలువిద్యలను పరీక్షించాలని ఒక చిన్న పరీక్ష పెడతాడు. ఆ నేపథ్యంలో శివుడు మహా కిరాతుకుని రూపంలో అర్జునుని మీద దాడి చేస్తాడు. అర్జునుడు అతనిని చూసి భయపడకుండా తన శక్తితో యుద్ధానికి దిగుతాడు. దీంతో శివుడు అర్జునుని శక్తియుక్తులను చూసి ఎంతో సంతోషిస్తాడు. అతనికి బహుమతిగా పాశుపతాస్త్రాన్ని కూడా ప్రసాదిస్తాడు శివుడు. అలాగే అర్జునుని లీలలను ప్రశంసిస్తూ ఇంద్రుడు, వరుణుడు, ముడు, కుబేరుడు కూడా అతనికి దివ్య అస్త్రాలను ఇస్తారు. ఆ శుభసందర్భంలోనే అర్జునుడు స్వర్గలోకానికి వెళతాడు.

అర్జునుడు స్వర్గలోకానికి వెళ్లగానే అక్కడ దేవతలందరూ ఇతనికి ఘనస్వాగతం పలుకుతారు. అతిధి మర్యాదలు నిర్వహించి ఇతనికోసం నృత్య ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ నృత్య ప్రదర్శనలో స్వర్గలోకంలోనే అపురూప సౌందర్యవతి అయిన ఊర్వశి ఎంతో అద్భుతంగా నాత్యం చేసి అందరినీ మెప్పిస్తుంది. ఆమె నాట్యాన్ని చూసిన అర్జునుడు కూడా కనురెప్పలను ఆర్పకుండా నిర్ఘాంతమయిపోయి, అలాగే చూస్తూ వుండిపోతాడు. అర్జునుడిని ఆ విధంగా గమనించిన ఊర్వశి కూడా సంతోషంతో ముగ్ధురాలయిపోతుంది. తన మోహంలో అర్జునుడు కూడా ముగ్ధుడయిపోయాడని ఆమె భావిస్తుంది.

ఇలా నృత్య ప్రదర్శన అయిపోయిన తరువాత అర్జునుడు సేద తీర్చుకోవడానికి తన గదిలో తూగుట ఊయలో విశ్రాంతి తీసుకుంటుంటాడు. అదే సమయంలో ఊర్వశి అక్కడికి చేరుకుంటుంది. ఆమెను చూడగానే అర్జునుడు విధేయతతో లేచి, ఆమె ముందు నిలబడతాడు. అర్జునుని మోహంలో పూర్తిగా మునిగిపోయిన ఊర్వశి సిగ్గుపడుతూ.. "అర్జునా! నీ చూపులు చూస్తుంటే నువ్వు నన్ను ఎంతగా ఇష్టపడుతున్నావో అర్థమవుతోంది. నేను కూడా నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాను. నీ గురించి, నీ ధైర్యపరాక్రమల గురించి అందరి ద్వారా ఎంతగానో విన్నాను. అలాంటి నిన్ను ప్రత్యక్షంగా చూడగానే తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాను. నిన్ను ఎలాగైనా సంతోష పెట్టాలని ఇక్కడికి వచ్చాను" అని అంటుంది.



ఊర్వశి చెప్పిన మాటలకు అర్జునుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యి... కొద్దిసేపటివరకు ఆలోచనలో పడిపోతాడు. ఆమెకు సమాధానంగా... "తల్లీ! నీ మాటలు నన్ను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. అసలు నువ్వు ఇలా ఎలా ఆలోచించగలిగావు. నువ్వు మా వంశస్థుడైన పురూరడివి భార్యవి.. అంతేకాకుండా ఇంద్రునికి ఇష్టసఖివి.. అలా చూస్తే నువ్వు నాకు తల్లితో సమానురాలివి. అటువంటిది నువ్వు నన్ను, నేను నిన్ను మోహించడం అనైతికం. దయచేసి నీ మనసులో వున్న ఆలోచనలను తొలగించేసుకుని, ఇక్కడి నుంచి వెళ్లిపో" అని చెబుతాడు.

అర్జునుడు ఇన్నేసి మాటలన్నా ఊర్వశి వాటిని పట్టించుకోకుండా తనను నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నిస్తుంది. "దేవలోకంలో ఇటువంటి నీతులు, బంధాలు వుండవని... అప్సరసలు వుండేదే అందరినీ ఆనందింపచేయడానికి" అని చెబుతుంది. అయితే అర్జునుడు మాత్రం ఆమె మాటలకు, సౌందర్యానికి లొంగకుండా.. "నువ్వు ఎంత ప్రయత్నించినా నా మనసు నీ సౌందర్యం మీద మోహించదు. నేను నిన్ను అంగీకరించలేను. నువ్వు నాకు తల్లితో సమానం" అని పేర్కొంటాడు.

అర్జునుడి మాటలతో ఊర్వశి కోపం అవధులు లేకుండా దాటిపోతుంది. ఆవేశంతో రగిలిపోతూ.. "ఓరీ అర్జునా! ఈ దైవలోకంలో నన్ను ప్రతిఒక్కరు మోహించినవారే వున్నారు కానీ... ఎవ్వరూ నన్ను ఇంతవరకు తిరస్కరించలేదు. నాకు నేనుగా నిన్ను మోహించడానికి కోరుకుంటే.. నువ్వు నాతో ఇలా మాట్లాడుతావా..! ఈ పరాభవాన్ని నేను ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఇంతగా అవమానించిన నీకు ఏదో ఒక శిక్ష అనుభవించక తప్పదు. నువ్వు నన్ను మోహించలేదు కాబట్టి కొన్నాళ్లవరకు నపుంసకుడిగా జీవిస్తావు. నీ ధైర్యసాహసాలకు భిన్నంగా ఆడవాళ్లతో కలిసి జీవించాల్సి వస్తుంది. ఇదే నేను నీకు విధించే శాపం" అని చెబుతుంది.



అలా ఆ విధంగా అప్సరస ఊర్వశి, అర్జునునికి శాపం ఇచ్చిన కారణంగా ఒక ఏడాదిపాటు నాట్యాచారుడు బృహన్నల అవతారం ఎత్తవలసి వచ్చింది. మహిళలతో కలిసి జీవించాల్సి వచ్చింది. అయితే ఈ శాపమే అతనికి ఒక విధంగా కొన్ని సందర్భాలలో వరంగా కూడా మారింది.
భవిష్య పురాణము - కల్కి చరిత్ర



శౌనకాది మహామునులను చూసి ఈ విధంగా వర్ణిస్తాడు... ‘‘మహా మునులారా! ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడై దుష్టశిక్షణము శిష్టపరిపాలనము చేసిన శ్రీమన్నారాయణుడు మళ్లీ కలియుగంలో జన్మించి, ధర్మరక్షణ చేస్తాడు’’! అది విన్న మహామనులు.. ‘‘మహాత్మా! ఆ కలియుగం ఎలా వుండును? ఆ యుగంలో ధర్మముల స్థితి ఏ విధంగా వుండును? ధర్మమును పునరుద్ధరింపవలసినంత అవసరం ఎందుకు వచ్చింది? ఆ కలియుగ లక్షణం ఎలా వుండును? అప్పటి మానవుల స్వభావములు ఎలా వుండును? అన్నీ మాకు వివరంగా తెలియజెప్పు’’ అని అడగగా... సూతుడు ఈ విధంగా ఆరంభిస్తాడు. ‘‘అధర్ము, అసత్యము అను దంపతులకు కంభుడు, మాయ అను వారు పుడతారు. వారు దంపతులై దంభుడు, వికృతి అనువారిని కంటారు. వారికి క్రోధుడు, హింస అనే ఇద్దరు కొడుకు, కూతుళ్లు పుడతారు. ఆ దంపతులకే కలిపురుషుడు జన్మిస్తాడు. కలిపురుషుడు భయంకరమైన ఆకారాన్ని కలిగి వుంటాడు. ఎర్రని కళ్లు, బానవంటి కడుపుతో వికారంగా వుంటాడు. స్త్రీవ్యామోహము, సురాపానము, జూదము వంటి చెడుఅలవాట్లకు కలిగి వుంటాడు. అతడే ఈ కలియుగానికి అధిపతి.

అతని పాలనలో ధర్మమన్నది అస్సలు కనిపించదు. మానవులు తమ తల్లిదండ్రులను సరిగా చూడరు సరిగదా.. వారిని తిడుతూ వుంటారు. పెద్దలు మంచి అలవాట్లు అని చెప్పిన సూక్తుల్ని పట్టించుకోరు. వేదాలను నిందించి, వేద పండితులను నిరసనగా చూస్తారు. చదువుకొన్నవాడికి తగిన గౌరవముండదు. వేషభాషలతో, ఆడంబరంగా వున్నవారిని అందరూ భయభక్తలతో పూజిస్తారు. బ్రాహ్మణులు మంచిచెడ్డలు ఆలోచించకుండా అందరి ఇళ్లల్లోనూ పౌరోహిత్యము చేస్తారు. వితంతువులు మళ్లీ పెళ్లిళ్లు చేసుకుని గృహిణులు అవుతారు. తక్కువ జ్ఞానం గలవారు, అల్పమైన ఆయుర్దాయము గలవారు వుంటారు. దొంగతనాలు పెచ్చుమీరిపోతాయి. క్రూరత్వము పెరిగిపోతుంది. మాటలలో సత్యమన్నది, అసత్యమన్నది తేడా వుండదు. ఆవులను చంపి ఆ మాంసమునే తింటారు. స్త్రీలను అన్యాయంగా వరకట్నం కోసం హింసిస్తారు. స్త్రీలను వ్యభిచారములు చేసి, పుట్టిన శిశువులను చంపేస్తారు. పరుల ధనముల మీద మక్కువ చూపిస్తారు. వేదాధ్యయమనుములు, యజ్ఞగాదులు వారిలో క్షీణిస్తూ వస్తుంది. ఉత్తమ వంశాలలో పుట్టినవారు కూడా తక్కువ కులస్తులను సేవించి జీవిస్తారు. ఎవరికైతే అధిక బలం, ధనం వుంటుందో అతడే గౌరవనీయుడు. సభలలో ఏమైనా మాట్లాడి నేర్పినవాడే పూజ్యుడవుతాడు.




ఎవడికైతే బలముంటుందో అతడు చెప్పిందే ధర్మము, చెప్పింది శాస్త్రము.. మిగతాది అధర్మము. కులమత భేదాలు లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటారు. భోగాలను అనుభవించడానికి స్త్రీ దొరికితే చాలు.. వారి వయస్సులతో పని వుండదు. ఎవడైతే అన్యాయ వృత్తిలో వుంటాడో.. అతడు ఇంకా పైకి ఎదుగుతూనే వుంటాడు. ఎదురించి నిలబడని వాడు పేదబ్రతుకులకంటే హీనంగా జీవిస్తాడు. ఎన్ని దారుణాలు చేసిన.. అతడు చేసిన ఒక చిన్న దానము కూడా అతడ్ని ధర్మాత్ముడని భావిస్తారు. జీవనోపాధి లేనివారు కాషాయములు కట్టుకొని, గురువులై ధనాన్ని సంపాదించుకుంటారు. ఎవరు పడితే వారి(స్త్రీ)తో సంసారసుఖాలు కూడా అనుభవిస్తారు. ధనము దొరుకుతుందన్న ఆశతో దొంగసాక్ష్యాలు చెప్పడానికి కూడా సిద్ధమవుతారు. క్షుద్రదేవతలన ఆరాధించి స్వల్పఫలమును గోరి దానితో తృప్తి చెందుతారు. తద్దినములు పెట్టుట, చనిపోయిన వారికి కర్మకాండలు చేయడం అనవసరం అనుకుంటారు. పంటలలో రాబడి తక్కువవుతుంది. సంతానములు కూడా అధికమవుతాయి. దేహాలు పొట్టిగా వుండి బలహీనులు అవుతారు.




యజ్ఞగాదలు లేక పోవటం వల్ల దేవతలు బ్రహ్మ దగ్గరకు బోయి మొరపెట్టుకుంటారు. ఆయన వారిని శ్రీమన్నారాయణుని దగ్గరకు తీసుకుపోయి వారి అవస్థలు వినిపిస్తారు. దయామయుడైన శ్రీమహావిష్ణువు వారి మొరలు ఆలకించి, వారిని ఓదార్చి ఈ విధంగా అభయమిస్తాడు... ‘‘దేవతలారా! నేను కలియుగంలో అధర్మంను నాశనం చేసి ధర్మమును ప్రతిష్ఠించడానికి భూమిమీద అవతారమెత్తుతాను. శంబళ అనే పేరుగల గ్రామంలో విష్ణుశర్మ అను బ్రాహ్మణునికి సుమతి అను భార్యయందు కలికి అనే పేరుతో పుడతాను. అధర్మపరులైన రాజులను సంహరించి, దేవాపి, మరత్తు అనువారులకు రాజ్యాభిషేకం చేస్తాను. అప్పటికి మీరు మీ అంశములతో పుట్టి నా పరివారముగా వుంటారు’’. శ్రీహరి దేవతలకు చెప్పిన విధంగా విష్ణుశర్మ దంపతులకు కుమారుడుగా జన్మిస్తాడు. మహాత్ములయిన మునీంద్రులు వచ్చి ఆ బాలుడిని దీవిస్తారు. ఉపనయనము చేసే వయసు రాగానే విష్ణుశర్మ ఆ బాలుడికి ఉపనయనము చేస్తాడు. ఆ తరువాత కలికి పరశురాముని వద్ద అనేక విద్యలు, వేదాంతములు, వేదాంగములు, ధనుర్విద్యలు నేర్చుకుంటాడు. లక్ష్మీదేవి శ్రీహరిని విడిచి వుండజాలదు. కనుక సింహళ దేశములో పద్మావతిగా జన్మిస్తుంది. ఆమెను కలికి వివాహమాడుతాడు. ధర్మసంస్థాపనార్థము శంకరుడు అతడికి వాయువేగ, మనోవేగములు గల అశ్వమును బహూకరిస్తాడు. అతడా యశ్వమునెక్కి దుష్ట స్వభావం గల రాజులందరినీ తుదముట్టించి ధర్మాన్ని స్థాపిస్తాడు. విశ్వకర్మ దివ్యమైన నగరాన్ని నిర్మించి ఇస్తాడు. కలికి మూర్తి పద్మావతితో ఆ నగరంలో నివసిస్తుండగా, అతని తండ్రియైన విష్ణుశర్మ కుమారుడ్ని చూడడానికి వస్తాడు.

‘‘తండ్రీ! నీవు అనుమతిస్తే దుష్టులైన సకల రాజులను జయించి.. నీచేత అశ్వమేధయాగము చేయిస్తాను’’ అని తండ్రికి చెప్పి అతని దీవెనలందుకొని విశాఖయూపుడును వానితో కలిసి బౌద్ధ ధర్మావలంబులను, వేదధర్మమును పాటించనివారిని జయించెను. తరువాత జైనులు కూడా అటువంటివారే అవటం చేత వారికి కూడా యుద్ధంలో ఓడిస్తాడు. ఆ వెనుక మాయాదేవి అను ఆమెతో యుద్ధం చేసి విజయుడై తిరిగి వస్తాడు. ఆ తర్వాత యుద్ధములో ఇంతమందిని వధించిన పాపము పోవడానికి కలికిమూర్తి చక్రతీర్థమునస్నాన మాడటానికి వెళతాడు. వాలఖిల్యాదిమునలు అక్కడికి వచ్చి ‘‘కుంభకర్ణుని మనుమరా లోకతే యున్నది. దానిభర్త కాలకుంజుడు, వాని కొడుకు వికుంజుడు, ప్రశాంతముగా తపము చేసికొనుచున్న మమ్మల్ని పట్టి వారు బాధించుచున్నారు. వారి బాధలు పడలేకపోతున్నాము. మాకు రక్షణ కలిగించు’’ అని కోరుతారు. కలికిమూర్తి వారిపై దండెత్తి వెళ్లి ఘోర యుద్ధముంలో వారిని సంహరించి మునులకు ప్రశాంతి స్థితిని కల్పిస్తాడు. తరువాత కలికిమూర్తి హరిద్వారానికి వెళ్లి, గంగాస్నానము చేసి, అక్కడి మహామునులను సందర్శించి నమస్కరించి వారి దీవెనలు తీసుకొని.. వారందరు పూర్వధర్మమార్గాన్ని అనుసరించి నడిచిన క్షత్రియులేనని తెలుసుకొని వారి వృత్తాంతముల గురించి అడుగుతాడు. అపుడు మరుత్తు అను రాజు తన వంశచరిత్ర ఇలా కలికిమూర్తి వివరిస్తాడు. ‘‘నేను సూర్యవంశములో జన్మించాను. నా పూర్వులు రఘువు దశరథుడుమున్నగు మహానుభావులు. ఈ సూర్యవంశమనందే శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీరాముడు పుట్టి రావణుడిని రాక్షససంహారము చేసెను’’ అని చెప్పెను. కలికిమూర్తి ఆ శ్రీరామచంద్రుని కథ సర్వ పాపహారము కావున ఆ కథ వినవలెనని కుతూహలపడుచున్నాను. దయచేసి వినిపించమని అడగగా మరుత్తు తన వంశపూర్వుడైన శ్రీరాముని కథను ఈ విధంగా వివరిస్తాడు...


శ్రీరామ చరిత్ర :
దశరథుడు అయోద్యనగరానికి రాజు. అతనికి కౌశల్య, సుమిత్ర, కైకేయి అని ముగ్గురు భార్యలు. వీళ్లకు ఎన్నాళ్లకుగాను సంతానం కలుగలేదు. పుత్రకామేష్టిచేసెను. అలా యజ్ఞపురుషుడు వచ్చి వారికి పాయసమిచ్చెను. దశరథుడు తన ముగ్గురు భార్యలకు ఆ పాయసమును త్రాగించాడు. కౌశస్యలకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని ఇద్దరు, కైకేయికి భరతుడు పుట్టారు. దీంతో సంతోషించిన రాజు వారికి చదువులు చెప్పించాడు. విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని కాపాడుకునేందుకు శ్రీరామలక్ష్మణులను తీసుకుపోయి సకలశాస్త్రములను నేర్పించాడు. రాముడు మార్గమధ్యంలో వచ్చిన తాటకను కూడా హతమార్చాడు. వారి యాగమును పాడుచేయకుండా రక్షించెను. మిథిలకు వెళ్లి జనకుని ఇంట్లో శివధనస్సును విరిచి సీతను పెండ్లాడుతాడు. రాముడు అక్కడి నుంచి తిరిగి వస్తుండగా.. పరశురాముని గర్వమునణచెను. రాముడు పట్టాభిషేకం చేద్దామనుకొంటుండగా.. కైకేయి దశరథునికి వరములు కోరుతుంది. ఒకటి రాముడిని అరణ్యములకు పంపుట.. రెండవది భరతునికి పట్టాభిషిక్తుడు చేయడం. రాముడు తండ్రిమాటకు అనుగ్రహించి అడవులకు వెళ్తుండా సీతాలక్ష్మణులు కూడా అతని వెంటే వెళ్తారు. అప్పుడు భరతుడు చిత్రకూటమునకు వచ్చి రాముడిని తిరిగి అయోధ్యకు రమ్మని కోరగా... రాముడు తన పాదుకలనిచ్చి పంపిస్తాడు. జనస్థానమున 14వేల మంది రక్కసులను చంపుతాడు.



రావణుడు శూర్పణఖ ప్రోత్సాహము మీద సీతను అపహరించడానికి నిశ్చయించుకొని, మారీచుని మాయలేడీ రూపంలో పంపుతాడు. రాముడు మాయలేడి వెంటబడిపోగా.. రావణుడు సీతను అపహరించుకుని లంకకు తీసుకెళ్తాడు. రామలక్ష్మణులు సీతను వెదకటానికి కిష్కింధర ప్రాంతానికి వెళ్తారు. హనుమంతుని ద్వారా రాముడు సుగ్రీవునితో స్నేహం సంపాదిస్తాడు. వాలిని సంహరించి సుగ్రీవుని కిష్కింధకు రాజును చేస్తాడు. హనుమంతుడు లంకకు వెళ్లి సీత జాడను తెలుసుకొని రామసుగ్రీవులకు తెలియజేస్తాడు. రాముడు వానర సేనలతో బయలుదేరి సముద్రము మీద సేతువును నిర్మించి లంకకు వెళ్లి రావణ, కుంభకర్ణలను వధించి, తనను ఆశ్రయించిన విభీషణునిలంకారాజ్యమునకు రాజుగా చేసెను. అగ్నిశుద్ధయైన సీతతోపుష్పక విమానముపై అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడై పదకొండువేల యేండ్లు ప్రజారంజకుడై రాజ్యమేలాడు. అతనికి కుశలవులను ఇద్దరు కుమారులు పుట్టారు. కుశునకు అతిథి పుట్టెను. వానికి నిషధుడును, వానికి నభునుడు, నభునకు పుండరీకుడు, పుండరీకునకు క్షేమధన్వుడు, అతనికి నృపశేఖరుడు, అతనికి దేవానీకుడు ఇట్లు ఆ శంశములో ప్రండ్రెండుగురు రాజుల తరువాత శీఘ్రడను రాజు పుట్టాడు. ఆ శీఘ్రుని వలన నేను జన్మించితిని’’ అని  తమ సూర్యవంశ చరిత్రమును కలికిమూర్తికి వినిపిస్తాడు. మరుత్తు ఇంకా కలికితో, ‘‘నేను, నా కొడుకు బుధుడును, మనుమడు సుమిత్రుడునుమ్లేచ్చలను ఎదిరించి బలము లేనివారై అవతార పురుషుడైన నీవు వచ్చి మమ్మల్ని ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాము. వ్యాసభగవానుడు నీ గురించి మాకు చెప్పాడు. అందుకే నీ దర్శనానికి వచ్చాము అని మరుత్తు విన్నవిస్తాడు.

చంద్రవంశరాజుల క్రమము : 
తరువాత దేవాపి కలికిమూర్తికి తన వంశచరిత్ర గురించి ఈ విధంగా వివరిస్తాడు... ‘‘చతుర్ముఖ బ్రహ్మకు మానసపుత్రుడుగా తన వంశచరిత్రను వివరిస్తాడు. అత్రికి చంద్రుడు కుమారుడై జన్మిస్తాడు. చంద్రుని కొడుకు బుధుడు. అతనికి ఇలయందు పురూరవుడు జన్మిస్తాడు. పురూరవునకు యయాతి నహుషుడును ఇద్దరు కొడుకులు జన్మిస్తారు. సహుషునికి ఇంద్రపదవి రాగా మదాంధకారముతో నిలబెట్టుకోలేక ఆ పదవిని సమర్పించుకుంటాడు. యయాతికి పూరుడు, అతనికి జనమేజయుడు పుట్టారు. తరువాత కొన్ని తరాలకు హస్తియనువాడు పుట్టి తన పేరుమీద హస్తినాపురమును నిర్మించుకుంటాడు. అతనికి అజామీఢఢు పుడతాడు. ఆ వంశములోనే జరాసంధుడును, వానికి సహదేవుడును జన్మించిరి. ఆ తరువాత ఋక్షుడు పుట్టెను. వానికి దిలీపుడు, దిలీపునికి ప్రదీపుడు పుట్టిరి. ఆ ప్రదీపుడే నా తండ్రి. నన్ను దేవాపి యందురు. నేను నా కొడుకైన హూతునకు రాజ్యాభిషేకము చేసి, వ్యాసమహాముని ఆదేశము మీద కలాపిగ్రామంలో నీకోసం ఎదురుచూస్తున్నాను.



అంతట కలికిమూర్తి వారిద్దరిని చూసి.. ‘‘యెచ్చట ధర్మముండునో అక్కడ జయము కలుగుతుంది. మీరు ధర్మము తప్పక ప్రవర్తించి భగవానుని అనుగ్రహాన్ని పొందారు. కావున నేను మీకు ఇంకొక జన్మను ప్రసాదిస్తున్నానని కలికి చెబుతాడు. కలియుగ దోషాలు అంటకుండా కృతయుగమన్నట్లు రాజ్యపాలన చేయండి’’ అని అయోధ్యకు మరుత్తును, హస్తినాపురానికి దేవాపిని రాజులుగా చేస్తాడు. మరుత్తునకు విశాఖయూపుని పుత్రికను, దేవాపికి రుచిరాశ్వుని పుత్రికను ఇచ్చి వివాహములు చేసి, కాలగమనము గలిగిన రెండు దివ్య విమానాలను వారికి ఇచ్చాడు. ఆ సమయంలో కృతయుగము పురుష రూపము ధరించి కలికిమూర్తి దగ్గరకు వచ్చాడు. కలిగి అతనిని కలిసి నీవెవ్వరు అని అడగగా.. ‘‘నేను కృతయుగ పురుషుడిని. కలిపురుషుని బాధలు తట్టుకోలేక బాధలు పడుతూ, శ్రీమన్నారాయణుని అవతారమైన నీవు భూమిపై అవతరించావని తెలుసుకొని చూడడానికి వచ్చాని అని చెప్పి, అతనిచే సమ్మానము పొందుతాడు. ఈ విధంగా సూతుడు శౌనకాదులకు చెబుతాడు. శౌనకాదిమునుల కోరికపై కలియుగంలో మ్లేచ్చ పరిపాలనలను, రాజుల స్థితిగతులనను, మతసాంఘిక స్థితులను వివరింపసాగాడు.

కలిలో దేశకాల రాజకీయ స్థితిగతులు : 
కలియుగంలో రెండు సంవత్సరాలు గడిచిన తరువాత కలిపురుషుని ప్రభావం ఎక్కువ అవుతుంది. సూర్యవంశపు, చంద్రవంశపు రాజులు దేశాలను పరిపాలిస్తారు. దేవత్తు అనే రాజు రాజ్యాన్ని పాలిస్తూ.. ఒకనాడు తన పురోహితుని పిలిచి.. ‘‘గురుదేవా! కలియుగం ప్రారంభమై రెండువేల సంవత్సరాలుపైగా అయింది. పురాణాలలో చెప్పిన విధంగా ఈ దేశంలో జరిగితే.. కొంతకాలంలో మ్లేచ్చులచే ఈ దేశం ఆక్రమణము చేయబడుతుంది గదా! అది ఎప్పుడు జరుగుతుందో సెలవియ్యండి’’ అని అడుగుతాడు. అతడు పురాణాలను శ్రద్ధగా చదివి, జ్యోతిశాస్త్రముల ప్రకారం లెక్కలు గట్టి.. ‘‘రాజా! ఈరోజు నుండి నలువదవ రోజున మధ్యాహ్నము మ్లేచ్ఛులు ఈ దేశాన్ని ఆక్రమిస్తారు. అయినాగాని వారి అధర్మ పరిపాలన చేతగాని, నీ ధర్మప్రవర్తన చేతగానీ మరలా నీ రాజ్యాన్ని నీకే స్వాధీనమవుతుందని’’ అని చెబుతాడు. దానిని రాజు ‘‘మహాత్మా! సూర్యచంద్రులు గతులు తప్పని తప్పవచ్చునుగాని.. శాస్త్రములు, పురాణములు ఎప్పుడూ అసత్యములు కావు. ఎందుకంటే.. ఐహిక భోగాలను త్యాగం చేసి మహా తపస్సులు చేసి.. దానివల్ల దివ్యజ్ఞానాలను సంపాదించిన ఋషులు చెప్పిన శాస్త్రాలు ఎలా అసత్యము అవుతాయి? మహాత్ముడు, నారాయణాంశ సంభవుడును అయిన వ్యాసమహాముని వేదరాశిని ఋక్, యజుస్, సామ, అధర్వణ వేదాలు అని నాలుగుగా విభజించి, తన అమోఘమైన బుద్ధితో భూత, భవిష్య, వర్తమానములను గ్రహించి, దేశంలో ధర్మము నశింపకుండా పురాణాలను రచించాడు. అతని వాక్కులందు అసత్యములుండవు’’ అని చెప్పాడు. ‘‘అయినచో శాంతిపౌష్టిక కర్మలు చేయించి రాగల ఆపదలను వీలయినంతలో తొలగించుకుందాం. ఆయా ఏర్పాట్లను చూడు’’ అని గురువుతో రాజు చెబుతాడు. అప్పుడా రాజగురువు భవిష్య పురాణంలోని చెప్పబడిన రీతిగా కార్తికశుద్ధ పాడ్యమినుండి ఏకాదశి వరకు పదకొండురోజులు పత్నీసహితుడైన రాజుచే దీక్ష వహింపజేసి మిత్రాది ద్వాదశాతత్మకుడై, పద్మినీచ్చాయోషాసమేతుడైన శ్రీ సూర్యదేవునికి మహాసౌర మంత్రాలతో, అరుణపారాయణముతో నమస్కారములు చేయిస్తాడు. రామాయణ, భారతాదులు పారాయణ చేయించియు, శ్రీమహా రుద్రాభిషేకములు, విష్ణు సహస్రనామార్చనలును, లక్ష్మగణపతి ఆరాధనమును చండీ పారాయణములను ఒక మహాయాగరూపముగా చేయించి శాంతిపౌష్టిక క్రియలు జరుపును. రాజు కూడా తనవంతు ప్రయాత్నాలు చేసి మిగిలిన కార్యభారాన్ని భగవంతునిపై వుంచి, మంత్రులతో రాజకార్యాలను నిర్వర్తిస్తాడు. క్రొత్తవారు ఎవ్వరును అనుమతి లేకుండా నగరములో ప్రవేశించుటకు వీలులేదని కట్టడి చేసి, వేగుల వారిని నియమించి, ఎప్పటి వార్తలు అప్పుడు తెలిసికొనుచు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.

మ్లేచ్ఛుల దురాక్రమణం : 
అయినా దైవ నిర్ణయాలను ఎవరు తప్పించగలరు? నలువపదవరోజు మధ్యాహ్నము కొందరు వర్తకులను, వ్యాపారాలు చేసుకొనడానికి అనుమతిని ఇమ్మని రాజుని కోరగా.. రాజు మంత్రులతో ఆలోచించి వ్యాపారానికే కదా అని అనుమతినిస్తాడు. వారందరు మ్లేచ్ఛులు. ముత్యాలు, బంగారు వస్తువులు, అమ్ముకొంటున్నట్లుగా నాటకం చేసి.. వారు రహస్యంగా దాచుకున్న ఆయుధాలతో కావలివారిని చంపి, కోటలోనికి ప్రవేశిస్తారు. వెంటనే అక్కడున్న రాజును, మంత్రిపురోహితులను బంధించి, సేవలకును సంహరించి, స్మశానమంలో పాతివేస్తారు. రాజును, మంత్రిని, పురోహితునిని స్మశానంలో కంఠమువరకు భూమిలో పాతిపెట్టించి.. ఏనుగులతో వారిని తొక్కించిండని ఆజ్ఞాపిస్తారు. మ్లేచ్ఛభటులు రాజును, మంత్రిని, గురువులను స్మశానానికి తీసుకొని పోయి కంఠముదాక పూడ్చిపెట్టి, ఉదయ సమయంలో ఏనుగులతో తొక్కించాలని వెళ్లిపోతారు. ఆ రాత్రి కొన్ని నక్కలు శవాలను పీక్కు తినడానికి వచ్చి, అక్కడ చచ్చిపడి వున్న సేవకుల శవాల దగ్గరకు వెళ్లకుండా రాజు దగ్గరకు వచ్చి, అతనిని చుట్టు ముట్టి మట్టిని పెల్లగిస్తాయి. రాజుకు కొంత వీలు కలగగానే గోతిలో కదలగా.. నక్కలు భయపడి అక్కడినుండి పారిపోతాయి. వెంటనే రాజు తన మంత్రి, పురోహితులను పైకి తీసి, వారితో కలిసి రహస్యంగా నగరంలో ప్రవేశిస్తాడు. ఆ అర్థరాత్రి సమయంలో మ్లేచ్ఛులందరు తమకు కష్టంలేకుండానే దొరికిన విజయాన్ని ఆనందంగా తిన్నంత తిని, త్రాగినంత త్రాగి మైమరిచిపోయి పడివుంటారు. అదే సమయంలో నగరంలో ప్రవేశించిన రాజు, మంత్రిపురోహితులు.. మంత్రి ఇంటికి వెళ్లి స్నానభోజనాదులు చేసి, సేనాధిపతులను, సైన్యాలను సిద్ధం చేసుకుని రాజభవనంలోకి ప్రవేశిస్తారు. అక్కడ మ్లేచ్ఛనాయకుడ్ని, అతని భటులను సమూలంగా నాశనం చేసి మరలా రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకొని తెల్లవారుజామున విజయభేరి మ్రోగిస్తాడు. ఆ విజయభేరిరి విన్న ప్రజలు తమ రాజు మ్లేచ్ఛులపై విజయం సాధించినందుకు పరమానందంతో ఆరోజు విజయోత్సవాలను జరుపుకొంటారు. మరునాడు రోజు, మంత్రిసామంత పురోహిత నాగర జానపదాలతో మహాసభ చేసి, మ్లేచ్ఛులలో ఇంకా బతికివున్న వారిని మరణదండన విధించి ప్రజలందరికి అభయప్రదానము చేయిస్తాడు. కలియుగంలో దైవారాధన చేయుటయే సకలశుభములకు కారణమగును. ‘‘కలౌ సంస్మరణాన్ముక్తి:’’ (కలియుగంలో భగవంతుని నామము కీర్తించినచో ముక్తి కలుగును). అని పెద్దల సూక్తి ప్రకారం ఆ రాజు కేవలం భగవంతుని నామసంకీర్తన చేయుటయే గాక దీక్షపూని ఏకాదశి దినములు యాగరూపముగా, శ్రీహరిని ఆరాధించినవాడు. ‘‘యజ్ఞో వై విష్ణు:’’ అని పేద వచనము. యజ్ఞమే విష్ణుస్వరూపము. ఆ విధంగా శ్రీమన్నారాయణుని ఆరాధించినవారిని అపజయ మేల కలుగుతుంది? అని సూతుడు చెప్పగా.. మునులు అతడు చెప్పిన కథలు విని, ఆనందించి, ఆ తరువాత కలియుగంలో జరుగు సంఘటనలను, విషయాలను వివరించమని కోరారు. అంతట సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు. ‘‘ఆ దేవదత్తుడు ధర్మపరుడై చిరకాలము రాజ్యపాలన చేసి, తన కుమారుడైన దేవహూతికి రాజ్యము నిచ్చును. అతడును తండ్రి వలనే ధర్మబద్ధముగా రాజ్యపాలనమం చేయును. అతని వంశమువారు సమారు ఆరవందల సంవత్సరాలు పరిపాలిస్తారు. ఆపైన ప్రజలలో దైవభక్తి, ధర్మములు, వేదముల మీ భక్తి తగ్గతూ వస్తుంది. అప్పుడే శ్రావస్తినగరంలో బుద్ధుడు జన్మించిన యౌవనంలో వుండగానే సంసారాన్ని విడిచి, సత్యాన్వేషణ కోసం బయలుదేరి ఒక చోట తపస్సు చేసి జ్ఞానవంతుడు అవుతాడు. అతడొక ధర్మమును ప్రబోధిస్తాడు. ఆ వేదములను ప్రమాణముగా గ్రహించదు. కేవలం సత్యం, అహింస, జీవుడు స్వధర్మము ఆచరించుట, అష్టాంగ యోగాలను పాటించుట అను సిద్ధాంతాలతో కూడి వుంటుంది. అసలే ప్రజలలో వైదిక ధర్మాల మీద నిర్లక్ష్యము ప్రబలుతుండడం వల్ల ఆ రోజుల్లో ఈ బుద్ధుని బోధనలు ప్రజలను ఆకర్షిస్తాయి. అప్పుడు అందరు బౌద్ధులే అవుతుండగా.. వైదిక ధర్మము చెట్లు పుట్టలుగా పోతుంది. అది ఎంతగా వ్యాపిస్తుందంటే.. రాజులు కూడా బౌద్ధమతాలంబులై అదివరకు తాము ఆచరించుచున్న వైదికధర్మములను విడిచిపెట్టివేస్తారు. మౌర్యుడైన బింబిసారుడను రాజు వైదిక ధర్మము ప్రకారం యజ్ఞం చేయుచుండగా.. బుద్ధుడు జంతుహింస చేయనీయకుండా అడ్డు పడతాడు. అతడు బుద్ధుని బోధనలతో బౌద్ధుడవుతాడు. అతని కొడుకు అశోకుడు కూడా బౌద్ధసన్యాసి బోదనాల వల్ల తాను కూడా బౌద్ధుడు అవ్వడమే గాక బౌద్ధ ధర్మాలను దేశ దేశములకు వ్యాపింపచేస్తాడు. ఆ మతం ప్రజలపై చాలాకాలం ప్రభావం చూపి, క్రమంగా క్షీణిస్తుంది. కొంతకాలానికి మౌర్యుడైన బృహద్రదుని, శుంగవంవీయుడైన పుష్యమిత్రుడు వధించి రాజ్యాం చేయును. మౌర్యుల రాజ్యపాలనా కాలము సుమారు నూటనలువది సంవత్సరాలు. పుష్యమిత్రుని వంశీయులు నూటపన్నెండేళ్లు రాజ్యపాలను చేస్తారు. ఈ శుంగవంశమువారిలో చివరివాడైన దేవహూతుని అతని మంత్రి వసుదేవడనువాడు వధించి రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. వీరు కణ్వవంశస్థులు. వీరు మూడువందల సంవత్సరాల వరకు రాజ్యాన్ని పాలిస్తారు. ఆ కాణ్వులలో చివరివాడైన సుశర్మడును వానిని ఆంధ్రజాతీయుడైన వృషలుడు సంహరించి రాజ్యమేలుతాడు. వీరే శాతవాహనులు. అతని కొడుకు కృష్ణుడు, అతని కొడుకు శాతకర్ణుడు. అతని వంశములోనే హాలుడు జన్మిస్తాడు. ఇతడు ప్రాకృతభాష యందు గాథాసప్తశతి రచిస్తాడు. (చరిత్రలో వున్న పేర్లకు, పురాణాలలో వున్న పేర్లకు చాలా తేడా వుంటాయి). ఈ శాతవాహనులు నాలుగువందల యాభైయారు సంవత్సరాలు భూమిని పాలిస్తారు. ఆ తరువాత ఆభీరులు, గర్దభులు, కంకవంశస్థులు, యవనులు, బర్బరులు, మురుండులు మొదలైనవారు పాలిస్తారు. యవనులో బాబరు ముఖ్యుడు. అతని వంశమువారు కొంతరు మతసామరస్యము కలిగి, కొంతరు లేకుండా వుంటారు. ఔరంగజేబు అనే యువరాజు పాలనలో మహారాష్ట్ర దేశమున శివప్రసాదు అనేవాడు జన్మించి, ప్రజలను ధర్మమార్గమున పాలించును. కలిలో మూడువేల సంవత్సరాలు దాటిన తర్వాత శాక్తేయము, గాణాపత్యము, చార్వాకము మొదలైన మతాలవారు (ఇవి వైదిక మతమునకు విరుద్ధములు) పుట్టి ప్రజలలో వ్యాపించును. అప్పడు శంకరాచార్యుడు, రామానుజచార్యుడు, మధ్వాచార్యుడు అనువారు జన్మించి వైదికమతమును తిరిగి ప్రజలలో ప్రబోధిస్తారు. వంగదేశంలో శ్రీకృష్ణ చైతన్యుడైన మహానుభావుడు జన్మించి.. ప్రజలలో శ్రీకృష్ణ భక్తితత్త్వమును ప్రబోధిస్తాడు. యవనరాజుల పరిపాలనలో చిన్నచిన్న రాజుల పోరాటాలు ఎక్కువవుతాయి. అప్పుడు మరుండులు (గరుండలు) వర్తకమునకై ఈ దేశానికి వచ్చి క్రమంగా భారతదేశ పాలకులు అవుతారు.

ము(గ)రుండులు - భారతదేశ పాలన : 

మనులు అడగగా.. మురుండులు గురించి సూతిడు ఇలా చెబుతాడు. ‘‘లంకలో రామరావణులకు మహాయుద్ధమైంది. వానరుల సహాయంతో రాముడు గెలుపొంది, విభీషునికి పట్టాభిషేకం చేసి.. తాను సీతాలక్ష్మణ సుగ్రీవులతోను, వానరులతోను, విభీషునితోను పుష్పక విమానంపై అయోధ్యకు బయలుదేరుతాడు. వానరులు కొందరు శ్రీరాముని చూసి, ‘‘రామచంద్రా! మేము ఈ లంకానగర సౌందర్యానికి ముగ్దులమయ్యాము. ఇందులో కొన్నాళ్లు నివసించాలని కోరికగా వున్నది’’ అని చెప్పారు. రాముడు విభూషినివైపు చూసి.. అతడు ‘‘దానికేమున్నది? వీరికి ఇష్టమున్నంత కాలం లంకలో వుండచ్చునని అనుమతిస్తాడు. ఆ వానరులు సంతోషించి, లంకలో వుండిపోయి రాక్షసకన్యలను వివాహమాడి, వారితో కాపురాలు చేసి బిడ్డలను కంటారు.



అయితే వారు అటు వానరులు కాక ఇటు రాక్షసులు కూడా కాకపోయిరి. వారికి వేరే నివాసప్రదేశము కావలసి వచ్చింది. ఆ వానరులు తమ బిడ్డలను వెంటబెట్టుకుని శ్రీరాముని సన్నిధికి వచ్చి వినయంతో ఈ విధంగా చెబుతారు. ‘‘శ్రీరామచంద్రా! మేము ఇలా లంకలో వుండిపయి, రాక్షస కన్యలను వివాహమాడి సంతానమును పొందితిమి. ఇప్పడు వారికి నివాసములు కావలసి వచ్చింది. వీరందరు ఎక్కడో నివసింపవలెనో మీరే నిర్ణయించి చెప్పండి’’. రాముడు వారిని చూసి.. ‘‘వానరులారా! మీరందరు భూమియందు పశ్చిమముగానున్న ద్వీపములు ఆక్రమించి రాజ్యపాలన చేస్తూ సుఖంగా జీవించండి. వారే మురుండులు లేక గరుండులు అని పిలువబడుతూ చాలా కాలం రాజ్యపాలన చేశారు. కలియుగంలో 4500 సంవత్సరాలు దాటిన తరువాత వర్తకము పేరుతో భారతదేశానికి వచ్చి పరస్పరము కలహాలతో చీకాకు పడుతున్న చిన్నచిన్న రాజులను లొంగదీసుకుని ఆ మురుండులు మొత్తం భారతదేశాన్ని స్వాధీనం చేసుకుని పరిపాలిస్తారు. ఈ మురుండులే ఆంగ్లేయులు.

వినాయక వ్రతకల్పం-పూజావిధానం



ఆచమ్య:
ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: - వామనాయ నమ: - శ్రీధరాయ నమ: - హృషీకేశాయ నమ: - పద్మనాభాయ నమ: - దామోదరాయ నమ: - సంకర్షణాయ నమ: - వాసుదేవాయ నమ: - ప్రద్యుమ్నాయ నమ: - అనిరుద్ధాయ నమ: - పురుషోత్తమాయ నమ: - అధోక్ష జాయ నమ: - నారసింహాయ నమ: - అచ్యుతాయ నమ: - జనార్దనాయ నమ: - ఉపేంద్రాయ నమ: - హరమే నమ: - శ్రీ కృష్ణాయ నమ:.
శ్లో!! శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే !!

వినాయక ప్రార్ధన:
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక:
లంబోధరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప:
ధూమకేతు ర్గణాధ్యక్ష:, ఫాలచంద్రో గజానన:
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరమ్బ: స్కన్ద పూరజ:
షోడశైతాని నామాని య: పఠే చ్చ్రుణుయా దపి,
విద్యారమ్బే విహహే చ ప్రవేశే నిర్గమే తథా,
సజ్గ్రామే సర కార్యేషు విఘ్నస్తస్య నజాయతే.
అభీప్సితార్ధసిద్ధ్యర్ధం పూజితో యస్సు రైరపి,
సరవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమ: !!

కలశపూజ :
కలశం గంధపుష్పాక్షతై రాభ్యర్చ్య ( కలశానికి గంధపు బొట్లు పెట్టి, అక్షతలు అద్ది, లోపల ఒఖ పుష్పాన్ని వుంచి.. తదుపరి ఆ పాత్రను కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రాలను చదవాలి.)
కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యేమాత్రుగణా: స్మృతా: !!
కుక్షౌతు సాగరా: సరే సప్తదీపా వసుంధరా !
ఋగ్వేదో విథ యజుర్వేద: సామవేదో అథర్వణ: !
అంగైశ్చ సహితా: సరే కలశాంబు సమాశ్రితా: !!
ఆయాన్తు దేవ పూజార్ధం దురితక్షయకారకా: !
గంగే చ యమునే చైవ గోదావరి సరసతి !
నర్మదే సింధూకావేరి జలేవిస్మిన్ సన్నిధిం కురు !!
కలశోదకేన పూజాద్రవ్యాణి దేవమండప మాత్మానం చ సంప్రోక్ష్య.
(కలశమందలి జలమును చేతిలో పోసికొని, పూజకోఱకై, వస్తువులమీదను దేవుని మండపమునందును తన నెత్తిమీదను చల్లుకొనవలసినది.)
తదంగతేన వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే.

ప్రాణ ప్రతిష్ట :
మం !! అసునీతే పునరస్మాసు చక్షు:
పున: ప్రాణ మిహనో ధేహి భోగమ్,
జ్యోక్సశ్యేమ సూర్య ముచ్చరంత
మనుమతే మృడయాన సస్తి.
అమృతం వై ప్రాణా అమృత మాప: ప్రాణానేవ యథాస్థాన ముపహయతే.
సామిన్ సరజగన్నాథ యావత్పూజావసానకమ్ !
తావత్తం ప్రీతిభావేన బింబే విస్మిన్ సన్నిధిం కురు !!
ఆవాహితో భవ, స్థాపితో భవ , సుప్రసన్నో భవ , వరదో భవ, అవకుంఠితో భవ ,
స్థిరాసనం కురు, ప్రసీద, ప్రసీద, ప్రసీద.

పూజా విధానమ్ :
శ్లోకం: భవసంచితపాఫౌఘవిధంసనవిచక్షం !
విఘ్నాంధకార భాసంతం విఘ్నరాజ మహం భజే !!
ఏకదన్తం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్బుజం !
పాశాంకుశధరం దేవం ధాయే త్సిద్ధివినాయకమ్ !!
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం !
భక్తాభీష్టప్రదం తస్మా ద్ధ్యాయే త్తం విఘ్ననాయకమ్ !!
శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి.
శ్లోకం: అత్రా విగాచ్ఛ జగదంద్య సురరాజార్చితేశర
అనాధనాధ సరజ్ఞ గౌరీగర్బసముద్భవ !!
శ్రీ వరసిద్ధి వినాయకం ఆవాహయామి.
శ్లోకం: మౌక్తికై: పుష్పరాగైశ్చ నానారత్నే రిరాజితం !
రత్నసింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్ !!
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆసనం సమర్పయామి.
శ్లోకం: గౌరీపుత్ర! నమస్తే విస్తు శంకర ప్రియనందన !
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్ష తైర్యుతం !
శ్రీ వరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయామి.
శ్లోకం: గజవక్త్ర నమస్తేవిస్తు సరాభీష్టప్రదాయక !
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ దిరదానన !
శ్రీ వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి.
శ్లోకం: అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత !
గృహాణ విచమనం దేవ !తుభ్యం దత్తం మయా ప్రభో
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆచమనీయం సమర్పయామి.
శ్లోకం: దధిక్షీర సమాయుక్తం మాధా హ్హ్యేన సమనితం
మధుపర్కం గృహాణేదం గజవక్త్య నమోవిస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి.
శ్లోకం: స్నానం పంచామృతై ర్దేవ గృహాణ గణనాయక
అనాధనాధ సరజ్ఞ గీరాణవరపూజిత !
శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృతస్నానం సమర్పయామి.
శ్లోకం: యా ఫలిని ర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణి:
బృహస్పతి ప్రసూతా స్తానో ముంచన్తగ్ హస:
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఫలోధకేన సమర్పయామి.
శ్లోకం: గంగాది సరతీర్దేభ్య ఆహ్రుతై రమలైర్జలై :
స్నానం కురుష భగవ న్నుమాపుత్త్ర నమోవిస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ శుద్దోదక స్నానం సమర్పయామి.
శ్లోకం: రక్తవస్త్రదయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణ తం
లంబోదర హరాత్మజ శ్రీ వరసిద్ధి వినాయకాయ వస్త్రయుగ్మం సమర్పయామి.
శ్లోకం: రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయం గృహాణ దేవ సరజ్ఞ భక్తానా
మిష్టదాయక శ్రీ వరసిద్ధి వినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి.
శ్లోకం: చందనాగురుకర్పూరకస్తూరీ కుంకుమానితం విలేపనం సురశ్రేష్ఠ !
ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్ శ్రీ వరసిద్ధి వినాయకం గంధాన్ సమర్పయామి.
శ్లోకం: అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద
శంభుపుత్ర నమోవిస్తుతే శ్రీ వరసిద్ధి వినాయకాయ అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి.
శ్లోకం: సుగన్ధాని చ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోవిస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ పుష్పై సమర్పయామి.

అథాంగ పూజా:
గణేశాయ నమ: పాదౌపూజయామి !!
ఏకదంతాయ నమ: గుల్పౌ పూజయామి !!
శూర్పకర్ణాయ నమ: జానునీ పూజయామి !!
విఘ్నరాజాయ నమ: జంఘే పూజయామి !!
అఖువాహనాయా నమ: ఊరూ పూజయామి !!
హేరంబాయ నమ: కటిం పూజయామి !!
లంబోదరాయ నమ: ఉదరం పూజయామి !!
గణనాథాయ నమ: హృదయం పూజయామి !!
స్థూలకంఠాయ నమ: కంఠం పూజయామి !!
స్కందాగ్రజాయ నమ: స్కంధౌ పూజయామి !!
పాశహస్తాయ నమ: హస్తౌ పూజయామి !!
గజవక్త్రాయ నమ: వక్త్రం పూజయామి !!
శూర్పకర్ణాయ నమ: కర్ణౌ పూజయామి !!
ఫాలచంద్రాయ నమ: లలాటం పూజయామి !!
సరేశరాయ నమ: శిర: పూజయామి !!
విఘ్నరాజాయ నమ: సరాణి అంగాని పూజయామి !!

From Telugu Wishesh
జగన్నాథ క్షేత్రం స్థలపురాణం


స్థలపురాణం :
కృష్ణుడి అవతారం అయిన జగన్నాథుడు.. ఒకనాడు ఒక అత్తిచెట్టు కింద ఇంద్రనీలం రూపంలో మెరుస్తూ ధర్మరాజుకు కనిపించాడు. అది చూసిన అతను... ఒక విలువైన రాయి అని భావించి.. నేలమాళిగలో ఎవరికంటా పడకుండా నిక్షిప్తం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆశతో వెదకడం మొదలుపెడతాడు. అయితే అది ఎక్కడుందో కనిపెట్టలేక భూమంతా తవ్వి వెదికాడు. అయినా అధి లభించకపోవడంతో నిరాశతో నీరసించిపోతాడు. అక్కడే కొద్దిసేపటివరకు సేద తీర్చుకోవాలని నిద్రపోతాడు.

ఇంద్రద్యుమ్నుడు నిద్రిస్తున్న సమయంలో అతని కలలోకి విష్ణువు కనిపించి.. పూరి సముద్ర తీరానికి వెళ్తే అక్కడ ఒక కొయ్యదుంగ కొట్టుకు వస్తుందనీ.. దానిని దారుశిల్పంగా చెక్కమని ఆదేశించాడు. దాంతో ఆ రాజు నిద్రనుంచి మేలుకుని అప్పటికప్పుడే అక్కడకు బయలుదేరుతాడు. విష్ణువు చెప్పినట్లుగానే నీటి అలలపై తేలియాడుతున్న ఒక కొయ్యదుంగ ఆ రాజుకు కనిపిస్తుంది. అదే సమయంలో విష్ణువు, విశ్వకర్మ ఇద్దరూ వృద్ధశిల్పకళాకారుల వేషంలో అతని దగ్గరకు చేరుకుంటారు.

వారిముగ్గురి మధ్య కొద్దిసేపటివరకు సంభాషణలు జరిగిన అనంతరం... వారిద్దరూ ఆ కొయ్యదుంగను విగ్రహాలుగా చెక్కేపని తామే చేస్తామని ఒప్పుకుంటారు. అయితే ఆ పని పూర్తయ్యేంతవరకు వాటివంక చూడకూడదని రాజుకు ఆజ్ఞాపిస్తారు. ఒకవేళ విగ్రహాలు చెక్కేటప్పుడు రాజుగానీ, ఇతరులు ఎవరైనాగానీ చూస్తే.. వారు తమ పనిని అర్థాంతరంగా ముగించేస్తామని హెచ్చరించారు. అందుకు ఇంద్రద్యుమ్నుడు ఒప్పుకుంటాడు. కొన్నాళ్లు ఇలాగే గడిచాక.. రాజు భార్య అయిన గుండిచాదేవి ప్రోద్బలంతో ఆ విగ్రహాలు ఎంతవరకు పూర్తయ్యాయోనని తెలుసుకోవడానికి ఇంద్రద్యుమ్నుడు విగ్రహాలు తయారుచేస్తున్న చోటుకు చేరుకుంటాడు.

అయితే ఆ శిల్పాలు కాస్త మాయమై, సగం మాత్రమే చెక్కి వున్నట్లు కనిపించాయి. దాంతో ఆ రాజు తాను చేసిన పొరపాటుకి బాధపడుతూ, కుంగిపోతాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు అతని ముందు ప్రత్యక్షమై, అతడిని ఓదార్చి, వాటిని అలాగే ప్రతిష్టింపజేశారు. నాటినుంచి అవి అలాగే పూజలు అందుకుంటున్నాయి. అందువల్లే కృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలకు చేతులు వుండవు. జగన్నాథ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా పురాణాలలో ప్రచురించబడి వుంది. అందులో జగన్నాథుడు సవరల దేవుడనీ.. నీలమ్దవుడు అనే పేరుతో గిరిజనుల నుంచి పూజలు అందుకునేవాడని స్థలపురాణం చెబుతోంది.

ఆలయ చరిత్ర :
12వ శతాబ్దంలో అప్పటి కళింగరాజు అయిన అనంత వర్మన్ చోడరంగ దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రకారులు ఇక్కడ లభించిన కొన్ని శాసనాలు, ఆధారాల ద్వారా వెల్లడించారు. అయితే అతని మరణం తరువాత ఈ ఆలయం ఆఫ్గన్ల దండయాత్రల్లో ధ్వంసం కావడంతో ఆయన మనవడు అయిన అనంగ భీమదేవుడు తిరిగి దీనిని పునర్మించి, విగ్రహాలను పున:ప్రతిష్టించాడని వారు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడున్న ఆలయం ఆకారం కూడా ఆయన కాలందేనని వారు పేర్కొంటున్నారు.

జగన్నాథుని కన్నుల పండువగా రథయాత్రను నిర్వహిస్తారు. ఈ యాత్రను ఆషాడశుక్ల విదియనాడు ప్రారంభం అవుతుంది. అంటే జూన్ లేదా జూలై నెలల్లో జరుగుతుంది. ఈ యాత్రకు సంబంధించిన సన్నాహాలను 60రోజుల ముందునుంచే అంటే బహుళ విదియనాటి నుంచే ఇక్కడి పూజారులు ప్రారంభిస్తారు.


బ్రహ్మ పురాణం



సూర్యుని వృత్తాంతం : 

శౌనకాది మహామునులు నైమిశారణ్యమున పన్నెండు సంవత్సరముల దీక్షతో ఒక మహాయాగం చేస్తున్నారు. అక్కడికి సూతుని తండ్రి అయిన రోమహర్షణుడు వచ్చాడు. మునులందరు అతనికి మర్యాదలు చేసి... ‘‘నువ్వు పురాణాలను చక్కగా తెలుసుకున్నవాడివి. నీకంటే బాగా తెలిసినవారు ఎవరున్నారు? కాబట్టి నువ్వు సృష్టరహస్యం మొదలు దేవరాక్షస మానవచరిత్రలు, భగవద్విషయాల గురించి తెలియజెప్పు’’ అని అడిగారు. అప్పుడు సూతుడు (ఇతడు కూడు సూతుడుగా పిలవబడతాడు) బ్రహ్మాండపురాణాన్ని ప్రారంభించాడు. 



బ్రహ్మ మానస పుత్రుడైన కశ్యప్రజాపతికి, దక్షుని కూతురైన అదితికి వివస్వంతుడు అనే కుమారుడు కలిగాడు. అతడే సూర్యుడు. అతనికి త్వష్ట తన కుమార్తె అయిన సంజ్ఞనిచ్చి వివాహం చేశాడు. అయితే ఆమె సూర్యుని ఉగ్రతేజాన్ని సహించలేకపోతుంది. ఆమె ఒకరోజు సూర్యునితో... ‘‘స్వామీ! నీ తేజం భరించరానిదిగా వుంది. గర్భపిండం కూడా మృతిచెందినట్లు కలుగుతుంది’’ అని అంటుంది. ఆమె భావాన్ని గమనించలేని సూర్యుడు ‘‘అవునా? అలా అయితే, మృతినొందినట్లు చేసే అండాలు గలవాడ్ని కనుక నా పేరు ఇంకా మార్తండుడు అవుతుంది’’ అని నవ్వుతూఅంటాడు. ఈ మాటకు ఆమె ఏ సమాధనం చెప్పలేక కూర్చుంటుంది. 

సూర్యునికి, ఆమెకు మొదట వైవస్వతడు (మనువు), తరువాత శ్రాద్ధదేవుడు, ఆ పిమ్మట యముడు-యమున అనే కవలపిల్లలు జన్మిస్తారు. ఇంతమంది పిల్లలు పుట్టినా కూడా సూర్యునికి అతని భార్యమీద మోహం తగ్గలేదు. ఆ విషయాన్ని గమనించిన సంజ్ఞాదేవి.. తననుండి ఛాయ అనే దానిని సృజించి, ‘‘నేను నా పుట్టింటికి వెళుతున్నాను. నువ్వు కూడా నా రూపమే కనుక నా స్థానంలో వుండి నా భర్తను సంతోషపెట్టు. నువ్వు ఛాయవని తెలియకుండా చూసుకో’’ అని చెబితే.. ఆమె ‘‘తప్పనిసరి పరిస్థితులలోగాని చెప్పను’’ అని మాటిస్తుంది. 

సంజ్ఞ తన తండ్రి ఇంటికి చేరుకోగా.. తండ్రి ఆమె మందలిస్తాడు. ‘‘ఎలాంటివాడైనా భర్తను వదిలి సాధ్వియైన ఇల్లాలు వుండకూడదు’’ అని బుద్ధిచెప్పి తిరిగి వెనక్కు పంపిస్తాడు. అయితే ఆమె భర్తఇంటికి వెళ్లకుండా... ఒక ఆడగుర్రమైన కురుభూముతో పచ్చియబయళ్లలో మేస్తూ కాలాన్ని గడుపుతుంటుంది. 

ఛాయను సూర్యుడు తన భార్యే అనుకుని తనతో కాపురం చేస్తాడు. దాంతో వీరిద్దరికి సావర్ణుడు, శనైశ్వచరుడు అనే ఇద్దరు కుమారులు పుడతారు. ఛాయకు క్రమక్రమంగా సవతి బిడ్డలపై ప్రేమ తగ్గిపోతుంటుంది. ఒకరోజు ఛాయ, తనతో ప్రవర్తించిన తీరుకు యముడు కోపగించుకుని ఆమెను తన్నడానికి కాలెత్తుతాడు. ఛాయ కూడా కోపంతో ‘‘నీ కాలు విరిగిపోవుగాక’’ అని శపిస్తుంది. 

అప్పుడు యముడు తండ్రి అయిన సూర్యుడు దగ్గరకు వెళ్లి, సవతి తల్లి తనకిచ్చిన శాపం గురించి వివరిస్తాడు. సూర్యుడు అతనిని ఓదార్చి ‘‘నాయనా! నువ్వు సత్యవంతుడివి, ధర్మమార్గనుడవు. అటువంటి నీకే కోపమొచ్చే విధంగా చేసిందంటే.. ఆమె ఎంత అనుచితంగా ప్రవర్తించిందో నేను గ్రహించగలను. తల్లి శాపాన్ని తిప్పటం నా వశం కాదు. కాని నీ ధర్మప్రవర్తన వల్ల నువ్వు ఆ శాపం నువ్వు విముక్తి పొందుతావు’’ అని అంటాడు. 
తరువాత ఛాయను చూసిన సూర్యుడు.. ‘‘నువ్వు నీ పిల్లల మీద ఇంత బేధబుద్ధి చూపడానికి కారణమేంటి?’’ అని ప్రశ్నిస్తాడు. అయితే ఆమె సమాధానం చెప్పకుండా వుంటుంది. సూర్యుడు తన దివ్యదృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకుని శపించడానికి సిద్ధమవుతుండగా.. ఛాయ అప్పుడు నోరు విప్పుతుంది. సంజ్ఞకు తాను ఛాయ అని తప్పు ఒప్పుకుని, మన్నించమని వేడుకుంటుంది. 

సూర్యుడు ఆమె వదిలి ఆవేశంతో తన మామగారి ఇంటికి వెళతాడు. త్వష్ట అతనిని శాంతపరిచి, తన కుమార్తెను అప్పుడే బుద్ధిచెప్పి పంపించివేశానని చెబుతాడు. ఇంకా కోపంతో మండుతున్న సూర్యుడిని మామ ఈ విధంగా చెబుతాడు... ‘‘అల్లుడా! ఒక మాట చెబుతాను విను. నీ తేజస్సు మాలాంటి వారికే ఎంతో దుర్భరంగా వుంది కదా... ఒక స్త్రీ, అందులో సుకుమారి ఎలా భరిస్తుంది? అందుకే నీ తేజాన్ని తగ్గించుకో.. దీనిని అంగీకరించు’’ అని అనగా.. సూర్యుడు దానిని ఆమోదిస్తాడు. 

అప్పుడు త్వష్ట సూర్యుని తిరిగెడు సానరాతి మీ అరుగదీస్తాడు. అలా అరుగుతీయడం వల్ల సూర్యుని తగ్గడం తగ్గడమేమోగానీ ఆ మెరుపుతో ఇంకా ప్రకాశవంతుడయ్యాడు. త్వష్ట, సూర్యుడిని అరుగుతీసినప్పుడు రాలిన తేజ కణాలతో విష్ణుదేవుడికి చక్రం చేసి ఇచ్చాడు. 

ఆ తరువాత సూర్యుడు సంజ్ఞను వెదకడానికి అరణ్యానికి బయలుదేరుతాడు. అక్కడ పచ్చికమేస్తున్న ఆడ గుర్ర రూపంలో తన భార్యే అని గుర్తుపట్టి... తను కూడా మగగుర్రమై ఆమెతో రతిక్రీడకు సిద్ధపడతాడు. అయితే ఆమె, తనను బలాత్కరించడానికి వచ్చిన మగగుర్రం అని భావించి, సూర్యుని తేజస్సును ముక్కనుండి బయటకు విసర్జిస్తుంది. అది రెండుచోట్ల పడగా.. దాని నుండి అశ్వనీదేవతలు పుట్టారు. వారే నాసత్యులని పిలువబడ్డారు. సూర్యుడు తన నిజస్వరూపాన్ని సంజ్ఞకు చూపించి, ఆమెను సంతోషపరిచాడు. 

సూర్యుని సంతానమైన వైవస్వతుడు మనువయ్యెను. శ్రాద్ధదేవుడు పితృలోకాధిపతి అయ్యాడు. యముడు దక్షిణ దిక్పాలకుడయ్యాడు. సూర్యసావర్ణుడు కూడా మనువయ్యాడు. శనైశ్చరుడు గ్రహాలలో ఒక్కడయ్యాడు. యమున భూలోకంలో నదిగా ప్రవహిస్తున్నది. 

ఎవరైనా ఈ సూర్యచరిత్రను విన్నా, పఠించినా వారు ఆపదలనుండి విముక్తడై ఆరోగ్య సంపదలను పొందుతాడు అని సూతుడు వారికి వివరించాడు. 

కోణార్క సూర్యుడు
సూర్యుని ఆరాధించే విధానం : 
ఉత్కళ దేశంలోని సముద్రతీరంలో సూర్యుడు ‘‘కోణార్కుడు అనే పేరుతో పిలవబడతాడు. మాసాలలోనే ఎంతో ఉత్తమమైంది ‘మాఘమాసం’. అందులో శుక్లపక్షంనాడు సూర్యునికి ఎంతో ఇష్టమైన రోజు రథసప్తమి వస్తుంది. ఇతనిని పూజించడానికి బ్రాహ్మణాది సకలవర్ణాలవారు భుక్తిముక్తులను కోరుకుని ఆరాధిస్తారు. 

రథసప్తిమినాడు సముద్రస్నానం చేసి, అనుష్టానం తీర్చుకొని, భాస్కరుణికి అర్ఘ్యమిచ్చి బ్రహ్మయజ్ఞం, పితృతర్పణం చేసుకోవాలి. ఆ తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించి, ఆ సముద్రతీరంలోనే తూర్పముఖంగా కూర్చుని, అష్టదళాల పద్మమైన ఎర్రచందనం కలిసిన నీటితో రాయాలి. 

తరువాత ఒక రాగి పాత్రను తీసుకుని అందులో తిలలు, బియ్యం, ఎర్రచందనం కలిపిన నీటిని పోసి, ఎర్రని పూలు వుంచి, వానిపై దర్భలు కూడా వేయాలి. దానిమీద ఒక జిల్లేడు ఆకును వుంచి, దానిలో కూడా తిలతండులాదివస్తువులను వుంచి, ఆపైన ఇంకొక రాగి చెంబును నీళ్లతో నింపుకోవాలి. 

ఇలా పూర్తయిన తరువాత కరన్యాసమును, అంగన్యాసమును యథావిధిగా చేసుకోవాలి. ఆగ్నేయనైరృతి, వాయు, ఈశానకోణాలలో భాస్కరునే ప్రధానదైవంగా భావించి, భాస్కరుని ఆవాహనచేసి కర్ణికాభాగాములో స్థాపించి, ముద్రాప్రదర్శన చేసి, పరమాత్ముని ధ్యానించుకోవాలి. 

ఆపైన ఆరాధకుడు మోకాళ్లమీద కూర్చొని ఆ పాత్రను శిరస్సుపై వుంచుకొని, మళ్లీ పద్మంపై వుంచాలి. ఆపై మూడక్షరాల మంత్రంతో అర్ఘ్యమివ్వాలి. దీక్షితుడు కానివాడు కూడా ఈ విధంగా సూర్యుడిని ఆరాధించవచ్చు.

యంత్రంలోని ఆగ్నేయంలో వున్న మూలాలన్ని మధ్యకర్ణికయందు, తూర్పు మొదలగు దిక్కులు అంటారు... ఊర్థ్వ అధోదిక్కులు అంటారు. కరన్యాసాదికమును, హృదయాదిన్యాసము చేసినట్లు భావించి, చివరికి ‘అస్త్రాయఫట్’ అని అస్త్రాన్ని పూజించి, ఆ తరువాత గంధధూపదీప నైవేద్యంతో సూర్యభగవానుడిని పూజించుకోవాలి. 

వేదాలలో చెప్పినప్రకారం సౌరాష్టాక్షరీ మంత్రాన్ని యథాశక్తిగా జపించాలి. తరువాత భూమిపై శిరము వుంచి నమస్కారాలు చేసుకోవాలి. భానువారం సప్తమి, మాఘమాసం కలిసివచ్చిననాడు ఈవిధంగా సూర్యారాధనం చేసి, నమస్కారం చేసుకోవడం వల్ల ఎటువంటి దారిద్ర్యం ఇళ్లలో వుండదు. ఆరాధకుడు సూర్యారాధనం చేసేరోజు ఉపవాసం వుండాలి. 

సూర్యుని ద్వాదశమూర్తులు : 

‘సుష్ఠు ఈరణం గతి: యస్యాసౌ సూర్య:’
కాలానికి అనుగుణంగా చక్కని గమనం కలవాడు కాబట్టి సూర్యుడు... అని, 

‘సుష్ఠు ఈరణం ప్రేరణం యేనాసౌ సూర్య:’
సకల జీవరాసులకు మంచి చైతన్యం ఎవరిచేతో అయితే కలుగుతుందో అతడే సూర్యుడు, 
అని సూర్యశబ్దాలు రచించబడ్డాయి. అంటే.. ఆ సూర్యుడే పరబ్రహ్మ స్వరూపుడని దీనికి అర్థం. అతని వల్లే ఈ సృష్టి జరిగి, పోషించబడుతోంది. 

‘‘యాభిరాదిత్యస్తపతి రశ్మిభిస్తాభి: పర్జన్యోవర్షతి, పర్జన్యే నౌషది వన స్పతయ: 
ప్రజాయంతే, ఓషది వనస్పతిభి రన్నంభవతి, అన్నేన ప్రాణా: అన్నాత్ పురుష:’’
అంటే... సూర్యుడు తన కిరణాలవల్ల తపింపచేస్తూ భూమ్మీద నీటిని ఆకర్షించి, నీటి మేఘాలలో నిలుపుతాడు. అప్పుడా మేఘాలు వర్షిస్తాయి. వర్షంచేత సస్యములు, వృక్షాలు మొలుస్తాయి, వాటివల్ల ఆహారం ఏర్పడుతుంది. ఆహారం నుంచే సమస్తప్రాణులు పుడతారు. కాబట్టి ప్రాణసృష్టికి మూలమైనవాడు సూర్యుడే .. అతడే పరతత్త్వము. 

సూర్యుని రూపాలు :
1. ఇంద్రుడు : స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు. 
2. ధాత : ప్రజాపతియై భూతములను సృష్టించాడు. 
3. పర్జన్యుడు : తన కిరణాలతో నీటిని ద్రవించి, తిరిగి మేఘరూపంలో వర్షించును. 
4. త్వష్ట : ఓషదాలలో, వృక్షాలలో ఫలించే శక్తి. 
5. పూష : ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు. 
6. అర్యముడు : దేవతారూపంలో వుంటాడు. 
7. భగుడు : ప్రాణుల శరీరంలో వుండి, వారిని పోషిస్తాడు. 
8. వివస్వంతుడు : ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్నం చేస్తాడు. 
9. విష్ణువు : శత్రువులను నాశనం చేస్తాడు. 
10. అంశుమంతుడు : గాలిలో నిలిచి, ప్రాణాల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు. 
11. వరుణుడు : జీవులు తాగే నీటిలో వుండి, వారిని రక్షిస్తాడు. 
12. మిత్రుడు : లోకాలలో మేలుచేస్తూ... చైతన్యాన్ని కలిగిస్తాడు. 

ఈ సూర్యుడికి ఇంకా పన్నెండు పేర్లు వున్నాయి. వాటిని స్మరించుకుంటే.. మహాపాతకాలు నశిస్తాయి. 
1. ఆదిత్యుడు; 2. సవిత; 3. సూర్యుడు; 4. మిహిరుడు; 5. అర్కుడు; 6. ప్రభాకరుడు; 7. మార్తండుడు; 8. భాస్కరుడు; 9. భానుడు; 10. చిత్రభానుడు; 11. దివాకరుడు; 12. రవి. 

ఈ విధంగా సూర్యుడు పన్నెండు నామాలతో వుంటూ.. పన్నెండు మాసములలో ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ.. కాలచక్రాన్ని నడుపుతుంటాడు. 
1. చైత్రమాసంలో ‘విష్ణువు’గాను
2. వైశాఖములో ‘అర్యముడు’గాను
3. జ్యేష్ఠములో ‘వివస్వంతుడు’గాను 
4. ఆషాఢములో ‘అంశుమంతుడు’గాను 
5. శ్రావణములో ‘పర్జన్యుడు’గాను 
6. భాద్రపదంలో ‘వరుణుడు’గాను 
7. ఆశ్వయుజంలో ‘ఇంద్రుడు’గాను 
8. కార్తికంలో ‘ధాత’గాను 
9. మార్గశిరంలో ‘మిత్రుడు’గాను
10. పౌష మాసంలో ‘పూష’గాను
11. మాఘమాసంలో ‘భగుడు’గాను 
12. ఫాల్గుణమాసంలో ‘త్వష్ట’గాను సంచరిస్తూ.. లోకాలకు శుభాలను కలిగిస్తూ వుంటాడు. 

మార్తండుడు :
సూర్యుడికి మార్తండుడు అనే పేరు రావడానికి ఒక కారణం వుంది. పూర్వం అదితి సంతానం కోసం కశ్యపునితో సంసారం చేస్తుంది. ఆమెకు రెండు అండాలు పుడతాడు. అందులో ఒక అండం పుట్టుకతోనే జీవం లేనిదిగా కనబడుతుంది. దాంతో ఆమె దానిని విసర్జింపచేస్తుంది. అయితే స్వప్రకాశంగల సూర్యుడు దానినుండి వెలువడుతాడు. మృతమైన అండంనుంచి వెలువడినవాడు కాబట్టి మార్తండుడు అని పిలవబడ్డాడు. ఇది ఒక కథ. 

రెండవ కథ :
అదితి తన గర్భంలో సూర్యభగవానుడు జన్మించవలసిందిగా కోరి సూర్యారాధనం చేస్తుంది. కశ్యపుడు కూడా అనుగ్రహించడం వల్ల అదితికి గర్భం కలుగుతుంది. అదితి ఉపవాసం, వ్రతాలతో చిక్కిపోవడం చూసి ఒకరోజు కశ్యపుడు కోపగించుకుని ‘‘ఇంత తపంచేసి చివరికి గర్భం పోగొట్టుకున్నావ్ ఎందుకు?’? అని ప్రశ్నిస్తాడు.

అప్పుడు అదితి భర్త తనను పరిహానం చేస్తున్నాడని కోపంతో ‘‘ఈ గర్భం జారిపోతే లోకాలను సంరక్షించేలా వుండు’’ అని గర్భానుండి అండాన్ని జారవిడుస్తుంది. అది మహాతేజస్సుతో భూమిమీద పడుతుంది. మొదట అది మృతప్రాయమైనట్లు కనబడుతుంది. తరువాత వేయి సువర్ణకాంతులతో ఒక బాలుడు దాని నుంచి ఉదయిస్తాడు. అప్పుడు అదితి ‘‘నాథా! నువ్వు అండాన్ని మారణం చేసేస్తావా అని అడిగావు. అతడే ఇప్పుడు కొడుకుగా పుట్టాడు. కాని ఇతడు ‘మార్తండుడు’గా పిలవబడతాడు’ అని చెబుతుంది. 

భూగోళం - వివరాలు :
మహామునులందరూ భూగోళం, దానిలోని వర్షద్వీపాదుల గురించి వివరించి చెప్పు అని కోరగా.. సూతుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. 

‘‘జంబూ ప్లక్షశాల్మలీ కుశక్రౌంచశాక పుష్కరములు అని ఏడు ద్వీపాలున్నాయి. ఇవి ఏడు సముద్రాలతో ఆవరించబడివున్నాయి. జంబూ ద్వీపం అన్ని ద్వీపాల మధ్యలో వుంటుంది. ఇందులోనే మేరు పర్వతం వుంది. అది సుమారుగా 12.18 కిలోమీటర్ల ఎత్తును కలిగి వుంటుంది. అది ఆకాశానికి 32 చదరపుమైళ్ల మేర విస్తరించి వుంటుంది. భూమికి అది నడిబొడ్డున వుంటుంది. దాని దక్షిణంవైపు హిమవంతం, హేమకూడమం, నిషధము అనే మూడు పర్వతాలు వున్నాయి. ఉత్తరాన నీల, శ్వేత, శృంగములు గల గిరులు వున్నాయి. ఆ పర్వతాలన్ని ఎంతో విశాలంగా, ఉత్తమమైనవిగా పేరు పొందాయి. 

భారతము మొదటి వర్షం. హరికింపురుష వర్షాలు మేరువునకు దక్షిణాన వుంటాయి. దానికి ఉత్తరంగా రమ్యక హిరణ్మయవర్షాలు వున్నాయి. వీని మధ్య ఇలావృత వర్షం వున్నది. దీనిని మేరువు చుట్టివుంటుంది. దానికి తూర్పున మందరపర్వతము, దక్షిణాన కైలాస గంధమాదనములు, పశ్చిమాన విపులము, ఉత్తరాన సుపార్శ్వము అనే పర్వతాలు వుంటాయి. ఆ పర్వాతాలలో కదంబ, జంబూ, పిప్పల, వట వృక్షాలు పదకొండువేల యోజనాల (యోజన అంటే మైళ్లు) దాకా వ్యాపించి వుంటాయి. జంబూ వృక్షాలు వుండటం వల్ల దీనికి జంబూ పర్వతం అనే పేరు వచ్చింది. ఆ వృక్షాలు ఏనుగులు వున్నంత ఆకారంలో ఫలాలను కలిగి వుంటుంది. అవి రాలినప్పుడు వాని రసాలతో జంబూనది పుట్టి ప్రవహిస్తుంది. ఆ నదిలో మట్టి గాలికి ఆరి జంబూనదమని పిలువబడుతూ... స్వచ్ఛమైన సువర్ణంగా ప్రసిద్ధికెక్కింది. భద్రాశ్వ, కేతుమాలములు అనే వర్షాలు, మరవకములు, హరివర్షములు, జంబూనది మధ్యభాగంలో వెలిసి వున్నాయి. 

మేరువు శిరస్సులో బ్రహ్మనిర్మితమైన ఒక మహానగరం వుంది. ఆ నగరానికి అష్టదిక్కులలో అష్టదిక్పాలకుల నగరాలు వున్నాయి. శ్రీహరి, భద్రాశ్వమంలో హయగ్రీవుడై.. కేతుమూలంలో వరాహమూర్తియై... జంబూ ద్వీపంలో కూర్మమూర్తియై... మేరు (కురవక) వర్షంలో మత్య్సమూర్తియై.. ఇతర వర్షాలలోను అనేక రూపాలను ధరించి విశ్వరూపుడై ప్రకాశించాడు. 

ఒక జంబూ ద్వీపం తప్ప.. మిగిలిన ద్వీపాలన్ని దేవతానివాస యోగ్యములై వుండేవారు. అక్కడివారు ఆకలిగాని, వార్థకముగాని, రోగాలుగాని లేక పన్నెండు వేల సంవత్సరాల ఆయుర్దాయం కలిగి భోజభాగ్యాలతో తూగుతుండేవారు. కృత త్రేతాది యుగాల కాలప్రమాణాలు అక్కడ వుండవు. 
భారత వర్షమునకు ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన సముద్రాలు వుంటాయి. తొమ్మిదివేల చదరపు యోజనాల వరకు దాని వైశాల్యం వుంటుంది. స్వర్గం, మోక్షం కోరుకునే వారికి ఇది కర్మభూమి వంటిది. మిగిలిన భోగభూములు అయిన మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమత్, ఋక్ష, వింధ్య, పారియాత్రములు ఏడు కులపర్వతాలు ఇక్కడ వున్నాయి. స్వర్గం, నరకం, మోక్షం అనేవి ఇక్కడున్నవారి కర్మాచరణం కాబట్టి ఇవన్నీ కలుగుతుంటాయి. ఇక్కడ తప్ప మరేచోట కర్మాచరణం అనేది లేనేలేదు. 

ఇంద్ర, కశేరు, తామ్ర, గభస్తిమత్, నాగ, సౌమ్య, గంధర్వ, వారుణ అనే భారతములు నవఖండాలుగా ఈ భరతవర్షం విభజించబడింది. మన భారతఖండం ఇందులో తొమ్మిదవది. దీని మూడువైపులా సాగరములు వుంటాయి. ఇది వేయి చదరపు యోజనాల వరకు వైశాల్యాన్ని కలిగి వుంటుంది. దీనిలో తూర్పుభాగాన కిరాతులు, పశ్చిమాన యవనులు వుంటారు. మధ్యభాగాన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది వర్ణాలవారు నివసిస్తారు. వేదాలు, ధర్మశాస్త్రాలు, ఇతర శాస్త్రాలు ఇక్కడ వృద్ధిచెంది వ్యాపిస్తాయి.

గంగ, యమున, సరస్వతి, సింధు, గోదావరి, నర్మద, కృష్ణవేణి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి మొదలైన నదులు, వాటి ఉపనదులతో కలిసి ప్రవహించి, సాగరంలోకి కలిసిపోతాయి. తూర్పుదేశ నివాసులు, కామరూప దేశస్థులు, పౌండ్ర, కళింగ, మగధ, దాక్షిణాత్యులును, సౌవీర, సైంధవాది దేశవాసులు, మంద్ర, ఆరామ, అంబష్ఠ, పారశీక నివాసులు, ఈ మహానదులనుంచి ప్రవహించే జలాన్ని త్రాగుతూ... వాటి వల్ల నాలుగు పాడిపంటలతో సంపన్నులు అవుతూ సంతోషంగా కాలాన్ని గడుపుతారు. 

భారతవర్ష ప్రశస్తి : 
ఈ భారతవర్షంలోనే... కృత, త్రేతా, ద్వాపర, కలియుగమనే నాలుగు యుగాలు నడుస్తాయి. ఇక్కడ నివసించేవారిలో కొందరు సన్యాసులై తపము చేసుకుంటారు. మరికొందరు యజ్ఞగాదులతో దేవతలకు సంతృప్తి కలిగిస్తారు. కొందరు పరలోక సుఖాలను పొందడం కోసం ధర్మాలు చేస్తారు. పరలోకంలో ఉత్తమగతులు పొందడానికి కూడా దానధర్మాలు చేస్తారు. యాచకులైనవారు ఏమీ లేదనకుండా దానాలు చేస్తారు. వేదాలను చదువుతారు. వారి శిష్యులకు పాఠాలు చెబుతారు. చెరువులు త్రవ్వించడం, గుళ్లుగోపురాలు కట్టించడం, బావులు తవ్వించడం మొదలైన లోక ఉపకార ధర్మకార్యాలను చేస్తారు. ఇటువంటివన్ని ఇతర వర్షములలో జరగవు. 

అక్కడ వుండేవారికి ఆచరణీయములగు సిద్ధలు వేరే వున్నాయి. వారికి, వీరికి ఎటువంటి సంబంధం వుండదు. జంబూ ద్వీపంలో కొన్ని వేల జన్మలలో చేసిన పుణ్యఫలాలకుగాను మానవజన్మ దొరుకుతుంది. భారతఖండవాసులు ఎంతో ధర్మాత్ములని, స్వర్గమోక్షాలకు కారణమైన కర్మలను ఆచరించదగిన జన్మమెత్తినవారని.. దేవతలు వీరిని చూసి అభినందిస్తారు. ఈ కర్మభూమిని మించి మరొకటి లేదని చెబుతారు. 

ప్లక్షాది ద్వీపాలు : 
ప్లక్షద్వీపం కూడా జంబూ ద్వీపంలానే ఉప్పు సముద్రం చేత ఆవరించబడి వుంటుంది. జంబూ ద్వీపంకంటే రెట్టింపు వైశాల్యం కలిగి వుంటుంది. దీనికి మొదటిరాజు మేధాతిధి. అతనికి శాంతిమయుడు, శశిరుడు, సుఖోదయుడు, ఆనందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు అనే ఏడుగురు కొడుకులు వుండేవారు. వీరి పేర్లమీదే ఇక్కడ ఏడు వర్షములు ఏర్పడ్డాయి. ఇక్కడ గోమేద, చంద్ర, నారద, దుందుభి, సోమక, సుమనస్, వైభ్రాజములనే కులపర్వతాలు కలవు. దేవగంధర్వులనే ప్రజలు ఇక్కడ నివసిస్తారు. వారికి మనస్తాపాలు, రోగాలు వుండక... సౌఖ్యానుభవమే వారికి సహజం. 

అనుతప్త, శిఖి, విపాశ, త్రిదివ, క్రమునామక, అమృత, సుకృత అనే ఏడు నదులు ఈ ద్వీపంలో ప్రవహిస్తాయి. ఈ నదులపేర్లు స్మరించుకోవడం వల్ల సకలపాపాలు నశించిపోతాయి. ఇక్కడ యుగావస్థలు లేవు. ఎల్లప్పుడూ త్రేతాయుగంలో వుండే ధర్మాలే నడుస్తుంటాయి. ప్రజలు 5వేల సంవత్సరాల వరకు జీవిస్తారు. ఆర్యక, కురు, వివిశ్వ, భావి నామాలతో నాలుగు వర్ణాల వారు ఇక్కడ వుంటారు. ప్లక్షవృక్షాలు (జువ్విచెట్లు) వుండటం వల్ల ఈ దీవికి ప్లక్షద్వీపమని పేరు వచ్చింది. 

 శాల్మలద్వీపం : 
దీనికి పాలకుడు వీరుడు. ఇందులో కూడా శ్వేతము, హరితము, జీమూతము, రోహితము, వైద్యుతము, మానసము, సుప్రభము అనే ఏడు వర్ణాలు వున్నాయి. శాల్మల (బూరుగు) వృక్షాలుండటం వల్ల ఈ ద్వీపానికి శాల్మలద్వీపం అనే పేరు వచ్చింది. చెరుకురస సముద్రం ఈ ద్వీపం చుట్టు ప్రవహిస్తుంది. ఉన్నతము, మూహకము, ఓషధీ నిలయమైన ద్రోణము, కంకము, మహిషము, కుకుద్మంతము అనే పేరుగల కులపర్వతాలు ఇక్కడ వున్నాయి. 

శ్రేణి, తోయ, వితృష్ణ, చక్ర, శుక్ర, విమోచని, నివృత్తి అనే ఏడునదులు ఇక్కడ ప్రవహిస్తాయి. కపిలులు, అరుణులు, పీతవర్ణులు, కృష్ణవర్ణాలు అనే పేరులతో బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అను చతుర్వర్ణాలవారు వుంటారు. వారు విష్ణువును పూజించుకుంటారు. యజ్ఞయాగాలు చేసే ఉద్దేశ్యం కలిగినవారు, వాయుభూతునిగా భగవంతుడిని ఆరాధించి.. అతనికి ప్రీతిగా యజ్ఞాలు చేస్తారు. ఇక్కడ వుండేవారు 5వేల సంవత్సరాలవరకు జీవిస్తారు.

కుశద్వీపము : 
ఈ ద్వీపం సురా సముద్రంతో ఆవరింపబడి వుంటుంది. శాల్మల ద్వీపం కంటే ఇది రెట్టింపు వైశాల్యాన్ని కలిగి వుంటుంది. ఇందులో కూడా ఏడు వర్షములు వున్నాయి. ఉద్భిదము, వేణుమంతయు, వితతము, రంధనము, ధృతి మొదలైన పర్వతాలు ఇక్కడ వున్నాయి. దేవదానవులతో పాటు కొందరు పుణ్యాత్ములైన మనుష్యులు, గంధర్వలు కూడా వుంటారు. 

దమి, శుష్మి, స్నేహ, మందేహ నామములతో బ్రహ్మన, క్షత్రియ, వైశ్య, శూద్రులు వుంటారు. వీరు బ్రహ్మరూపుడైన జనార్ధనుడిని పూజిస్తారు. ధృతపాప, శివ, పవిత్ర, సమ్మతి, విద్యుత్తు, అంభస్తు, మహి అనే ఏడు నదులు ఇక్కడ ప్రవహిస్తాయి. కుశస్తంభాలు (దర్భకాడలు) ఎక్కువగా వుండటం వల్ల దీనికి కుశద్వీపం అనే పేరు వచ్చింది. 

క్రౌంచద్వీపము : 
ఇది కుశద్వీపం కంటే రెట్టింపు వైశాల్యం కలిగి వుంటుంది. దీని చుట్టూ నేతి సముద్రం వుంటుంది. కుశగము, రుందము, గోష్ఠము, పీవరము, అంధకారకము, భూరిరూపము, దుందుభి అనే ఏడు వర్షములు వుంటాయి. క్రౌంచము, వామనము, అంధకారకము, దేవవ్రతము, ధమము, పుండరీకవంతము అనే ఏడు కులపర్వతాలు ఇక్కడ వున్నాయి. 

ఒక ద్వీపం, వర్ష పర్వతాలు, సముద్రాలు, ఆవలనింకొక ద్వీపంగా.. ఈ ద్వీపాలన్ని భూమండలమున అమరి వుంటాయి. అక్కడ దేవగణములు ప్రజలుగా వుంటారు. గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి, పుండరీకము అనే పేర్లు గల నదులు ప్రవహిస్తూ వుంటాయి. ఆ నదీ జలాలను త్రాగినవారు ఆరోగ్యభాగ్యాలు పొందుతారు. 

శాకద్వీపము : 
శాకద్వీపాధిపతికి ఏడుగురు పుత్రులు వుండేవారు. వారిపేర్లు.. జలదుడు, కుమారుడు, సుకుమారుడు,మనీరకుడు, కుసుమయోదుడు, మోదకి, మహాద్రముడు. వీరి పేర్లతో ఆ శాకద్వీపంలోవున్న వర్షములు ప్రఖ్యాతి పొందాయి. ఏడు కులపర్వతాలు వున్నాయి. అవి... ఉభయగిరి, జలధారము, రైవతకము, శ్యామము, దంభోగిరి, ఆస్తికోయము, కేసరి మొదలైనవి. శాకవృక్షాలు అధికంగా వుండటంవల్ల దీనికి శాకద్వీపము అనే పేరు వచ్చింది. ఇక్కడకూడా నాలుగు వర్ణాలవారు వుంటారు. వారికి బద్ధకముగాని, జఢత్వంగాని అస్సలు వుండదు... వ్యాధులుండవు. మంచి స్వభావంతో, కాంతిగల దేహాలతో అక్కడి ప్రజలు మైత్రితో కలిసిమెలసి వుంటారు. 

అక్కడ సమస్తపాపాహారములు, పుణ్యప్రదమైన నదులు ఏడు వున్నాయి. అవి.. సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, ధేనుక, గభస్తి మొదలైనవి. అక్కడున్న ప్రజలకు అధర్మం, దు:ఖము, అనారోగ్యము అంటే ఏమిటో తెలియదు. వారు నిత్యం సుఖసంతోషాలతో జీవిస్తూ వుంటారు. మగములు, మగధములు, మానసములు, మంగములు అనే నాలుగు వర్ణాలవారు ఈ ద్వీపంలో వుంటారు. 

పుష్కరద్వీపము : 
ఈ ద్వీపం శాకద్వీపం కంటే రెట్టింపు ప్రమాణం కలిగి వుంటుంది. దీనికి అధిపతి సవనుడు. అతనికి మహావీతుడు, ధాతకి అనే ఇద్దరు కొడుకులు వుండేవారు. వారిద్దరి పేర్లమీద ఇక్కడ రెండు వర్షములు వెలిశాయి. అక్కడ మానసోత్తరమనే మహాపర్వతం వుంది. అది మహావీ, ధాతకీ వర్షములను రెండు భాగాలుగా విభజించేందుకు మహాపర్వతము గలదు. అక్కడి ప్రజలు పదివేల వర్షములు వరకు జీవిస్తారు. వారికి రోగాలుండవు.. శోకముండదు.. రాగద్వేషాలు వుండవు... వీరు అధములు వారు ఉత్తమములు అనే వర్గభేదాలుండవు. ఇక్కడ సురులు, అసురులు, యక్షులు పరస్పరం మైత్రితో మెలుగుతుంటారు. అసత్యంగాని, అనృతముగాని అక్కడ లేదు. అక్కడ కులపర్వతాలు, నదులు కూడా లేవు. 

పుణ్యపురుషులు దేవతల వేషాలు ధరించి వారితో సమానంగా వుంటారు. అక్కడ వర్ణాశ్రమాచారములు లేవు. వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం అనే భేదాలుండవు. ముసలితనం వుండదు. అదే స్వర్గమని పిలువబడుతుంది. అక్కడ ఒక పెద్ద మర్రి వృక్షం గలదు. ఆ చెట్టు మొదట బ్రహ్మ తన నివాసాన్ని ఏర్పరుచుకున్నాడు. దీని చుట్టూ మంచినీళ్ల సముద్రం ఆవరించి వుంది. 

ప్రజలు వారు కోరనంత భోజనమే లభ్యమవుతుంది. అక్కడి నేలంతా బంగారం రూపంలోనే వుంటుంది. జంతువులు ప్రజలను బాధింపవు. దాని తరువాత చక్రవాళశైలము వుంది. అది పదివేల యోజనముల పొడవు గలది. అది అంధకారములో వుంటుంది. అందువల్ల అది జనకులకు కనిపించదు. క్రౌంచద్వీపంగాక, ఇతర ద్వీపంలో వున్న సముద్రాలకు ఆటుపోట్లుంటాయి. శుక్లపక్షకృష్ణ వృక్షములో చంద్రుని వృద్ధి క్షయములను బట్టి ఇవి వృద్ధిక్షయములను పొందుతాయి. క్రౌంచ ద్వీపాన్ని చుట్టియున్న సముద్రానికి అటువంటి ఆటుపొట్లు వుండవు. 

ఈ విధంగా సప్తద్వీపాలతో కూడిన భూమండలం కొలత ఏబదికోట్ల యోజనాలు వుంటుంది. ఆ భూమియే సర్వప్రజలకు, జంతుజాలమునకు, నదీనదారణ్య సముద్రాదులకు ఆధారమని గ్రహించాలి’’ అని సూతుడు చెప్పగా.. అక్కడున్న మునులందరు విని ఎంతో సంతోషించారు. 


రుద్ర మహాత్యము - గౌరీ శంకరులు :
ఈశ్వరుని మహిమ గురించి వివరిస్తూ.. సూతుడు ఈ విధంగా అంటాడు.. ‘‘ఓ మునులారా! ఈశ్వరుని మహిమ ఇంత అని చెప్పలేము. ఆయన గురించి చెబుతాను వినండి’’...



‘‘దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవిని పరమేశ్వరుడు వివాహమాడాడు. అయితే దక్షునికున్న అల్లుళ్లలాగా ఈశ్వరుడు సంపన్నుడు కాదని చిన్నచూపుతో చూస్తుంటాడు. ఒకరోజు దక్షడు యజ్ఞం చేయడానికి సతీదేవిని తప్ప తన కుమార్తెలందరిని పిలిచి.. వారికి వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి సంతోషపరిచాడు. ఈ విషయం తెలిసుకున్న సతీదేవి.. వెంటనే తన తండ్రి ఇంటికి వెళుతుంది. అక్కడికి చేరుకున్న సతీదేవిని చూసి ఆమె తండ్రి అయిన దక్షుడు పలకరించకుండా వుంటాడు. 

అప్పుడు సతీదేవి రోషంతో.. ‘‘తండ్రీ! నేను కుమార్తెలోకెల్లా పెద్దదానిని. ఇంతమంది ముందు నువ్వు నన్ను చులకన చేయడం యుక్తం కాదు’’ అని అంటుంది. దక్షుడు కూడా కోపంతో.. ‘‘నా పుత్రికలందరూ గుణవంతులు.. నా అల్లుళ్లు కొందరు తపోనిష్టులు, మరికొందరు మహైశ్వర్య సంపన్నులు. నాతో వీరందరూ గౌరవభావంతో వుంటారు. కానీ నీ భర్త అయోగ్యుడు.. నన్ను అస్సలు గౌరవించడు.. నమస్కరించడు కూడా! మిగతావారితో కూడా సఖ్యతగా ప్రవర్తించడు. అటువంటి శివునితో సంబంధం వుండటం వల్ల నువ్వు కూడా అనిష్టురాలివే’’ అని అంటాడు. 

అది విన్న సతీదేవి.. ‘‘నువ్వు మహోన్నతమైన - పరమపురుషుడైన నా భర్తను, నన్ను దూషించావు. కాబట్టి నీవల్ల జన్మించిన ఈ దేహాన్ని ఇప్పుడే విడుస్తున్నాను’’ అని తన తండ్రితో అంటూ.. మనసులో..‘‘నేనుప్పుడైన సతీత్వధర్మాన్ని ఆశ్రయించివుంటే మళ్లీ నన్ను శంకరుడే పతి అవుగాక’’ అని ధ్యానిస్తూ.. తన శరీరాన్ని అక్కడున్న యోగాగ్నిలో భస్మం చేస్తుంది. 

సతీదేవి భర్త అయిన శంకరుడు ఈ వృత్తాంతం గురించి తెలుసుకుని... ‘‘ఈ మునులందరూ వైవస్తవమన్వంతరంలో మానవులై అయోనిజులుగా పుడతారు. నీ యజ్ఞసమయంలో వచ్చి, ఋత్విజులై సభముందే శివపత్ని అవమానంతో దేహత్యాగం చేస్తుండగా.. మీరందరూ ఊరికే వుంటూ చూసినందుకు ఈ శాపాన్ని భరించాల్సి వుంటుంది. ఇంకా దక్షుడు ఆ మన్వంతరంలో వున్న ప్రాచీనబర్హికి పుత్రుడైన ప్రచేతసుడు అనే రాజుకు పుత్రుడుగా జన్మిస్తాడు. అప్పుడు అతను చేసే యజ్ఞాలను నేను ధ్వంసం చేస్తాను. ఏ ధర్మకార్యం చేయబోయినా.. దానికి అడ్డుపడి నాశనం చేస్తాను’’ అని శపిస్తాడు. 

దక్షుడు దీని గురించి తెలుసుకుని.. ‘‘ప్రజలు యజ్ఞయాగాదులు చేస్తూ.. హవిర్భాగాలు ఇచ్చినప్పుడు నిన్ను విడుస్తారు. ఒకవేళ నీకు ఆహుతి ఇయ్యక తప్పనిసరి అయితే.. ఇచ్చిన వెంటనే చేతులు అపవిత్రులైనట్లు భావించి నీళ్లతో కడుక్కుంటారు’’ అని శపిస్తాడు. అప్పుడు రుద్రుడు.. ‘‘దేవతలతోబాటు హవిర్భాగములు పుచ్చుకోవడం నేనిష్టపడను. నాకు చెందవలసింది నేను వేరుగా తీసుకుంటాను. లోకాలలోకెల్లా భూలోకం ఎంతో ఉత్తమమం. నేను భూలోకంలో వుంటే దానికి స్థిరత్వం కలుగుతుంది. నేను అక్కడే వుంటాను.. కానీ నీకు భయపడి మాత్రం కాదు’’ అని అంటాడు. 
శివుని శాపంవల్ల దక్షుడు భూమిలో పుడతాడు. దక్షశంకరులకు ఈ శాపాలు శాశ్వతంగా మారిపోతాయి. దక్షుని జన్మం మారినా.. వైరం వాసనారూపంగా అతనిని విడకుండా వుండేది’’ అని సూతుడు మునులకు చెబుతాడు.

సతీశంకరుల వృత్తాంతం : 
మునులు, సూతుడిని సతీశంకరుల వృత్తాంతం గురించి వివరించుము అని అడగగా.. ‘‘ఈ కథ ఇంతకుముందు బ్రహ్మ.. మహర్షులకు చెప్పాడు.. అదే మీకు వివరిస్తాను వినండి’’.. అని సమాధానం ఇస్తాడు. 

హిమవంతుడు అనే ఒక పర్వతరాజు వుండేవాడు. అతని భార్య మేన. అతనికి ఎంత ప్రయత్నించినా సంతానం కలుగలేదు. ఒకరోజు కశ్యప్రజాపతి వీరికి ఇంటికి చేరుకుంటాడు. రాజు అతనికి మర్యాదలు చేసి ఇలా అంటాడు.. ‘‘ఓ మునీంద్రా! దేనివల్ల అక్షయపుణ్యలోకాలు కలుగుతాయి? దేనివల్ల కీర్తి ప్రాభవాలు కలుగుతాయి? దానికి సంబంధించిన విషయాలుఏంటో వివరించండి...’’ అంటూ కోరుకుంటాడు. 

అప్పుడు ఆ కశ్యపుడు.. ‘‘నాకు ఉత్తమ కుమారులు (దేవతలు) జన్మించడం వల్ల నాకు ప్రజాపతిత్వం, గౌరవం కలిగింది. నువ్వు కూడా తపంచేసి సంతానభాగ్యాన్ని పొందు’’ అని చెప్పి వెళ్లిపోతాడు.

అప్పుడు హిమవంతుడు బ్రహ్మకోసం తపం చేయగా.. బ్రహ్మ అతని ముందు ప్రత్యక్షమవుతాడు. ‘‘నీకు ఒక కొడుకు, కుమార్తెలు జన్మిస్తారు. ఆ కూతురివల్ల నువ్వు కీర్తిమంతుడివి అవుతాయి. ఆమె దేవలతో కూడా నమస్కరింపబడుతుంది’’ అని వరమిస్తాడు. 

ఆనాడు యోగాగ్నిలో తన శరీరాన్ని దహించజేసుకున్న శివుడి భార్య అయిన సతీదేవి హిమవంతుడికి కుమార్తెగా జన్మిస్తుంది. ఆమె ‘ఉమ’ అనే పేరుతో పిలువబడుతుండేది. ఆమె మహానుభావురాలు. ఆమె ఆత్మ కూడా మూడు విధాలుగా రూపొందించబడింది. అపర్ణ, ఏకపర్ణి, ఏకపాటలు అని ఆ ఆత్మల పేర్లు. అందులో అపర్ణయే ఉమ. 

ఉమ శంకరుని విడిచివుండలేక మహాతపస్సు చేయడానికి బయలుదేరుతుండగా.. తల్లి ఆమెను నివారించి ‘తపము వద్దు’ అని అంటుంది. కాని ఆమె నిశ్చయంగా చేయాల్సిందేనని చెప్పి.. తల్లి అనుమతి తీసుకుని వెళుతుంది. ఆమెతోపాటు ఏకపర్ణి, ఏకపాటలు కూడా తపస్సు చేయడానికి బయలుదేరారు. ఆ ముగ్గురే లోకమాతలు. 

ఉమ మహాదేవుడిని ఆశ్రయిస్తుంది. ఆమె తపస్సుకు లోకాలు కూడా హాహాకారం చేశాయి. అప్పుడు బ్రహ్మ ఆమె తపస్సుకు ప్రసన్నుడై.. ‘అమ్మా! నువ్వు జగజ్జననివి. నీవల్ల ఈ లోకాలు నశింపరాదు. దయచేసి నీ తపమును చాలించు’ అనగా... ఆమె ‘‘పితామహా! నేను ఏమికోరి తపము చేస్తున్నానో నీకు తెలియదా?’’ అని సమాధానం ఇస్తుంది. 

అప్పుడు బ్రహ్మ...‘అమ్మా! నువ్వు కోరినవాడు వెదుక్కుంటూవచ్చి నిన్ను వరిస్తాడు. ఏ రూపంలో వచ్చి అనుగ్రహిస్తాడో తెలియదు. మేము శివుని చరణసేవలం’’ అని అంటాడు. మునులు ఆమె దగ్గరకు వెళ్లి.. ‘‘నువ్వు కోరుకున్న శంకరుడే నీకు పతిగా వస్తాడు. ఇంక నీ తపమును చాలించు’’ అని కోరుకుంటారు. 

ఒకనాడు ఒక వామనుడు అక్కడికి చేరుకుంటాడు. అతని కాళ్లు, చేతులు చాలా పొట్టివి. తల కూడా తుప్ప లాగా వుండేది. ముక్కు వంకరగా తిరిగివుంటుంది. ఏవైపు నుంచి చూసినా.. చాలా అసహ్యంగా వుండేవాడు. అతడు మెల్లగా పార్వతి దగ్గరకు వచ్చి.. ‘ఉమా! నిన్ను వరించడానికి నేను వచ్చాను’’ అని పలుకుతాడు. పార్వతి అతనిని తన యోగమహిమవల్ల పరమశివునిగా గుర్తిస్తుంది. 

పార్వతి అతనిని అర్ఘ్యపాద్యాదులతో పూజించి.. ‘‘స్వామీ! నేను స్వతంత్రురాలిని కాను. నన్ను ఇవ్వడానికి నా తండ్రి వున్నాడు. నా తండ్రి ఆమోదిస్తే.. నేను నీతో వివాహమాడుతాను’’ అని పలుకుతుంది. ఆమె పలికిన మాటలకు సంతోషించి ఆ కపట వేషధారి.. ‘‘అయితే నేను హిమాచలాధీశునే అడుగుతాను’ అని వెళ్లి.. హిమవంతునిచేత పూజితుడై.. తనకు అపర్ణను ఇవ్వమని అడుగుతాడు. 

హిమవంతుడు ఆలోచనలో పడతాడు. ‘‘ఇతని రూపం పరమవికారంగా వుంది. ఇతనికి నా కుమార్తెను ఎలా ఇవ్వగలను? కాదన్నా ఇతడు శపించి వెళతాడేమో’ అని తలచుకుని.. ఆ వామనునితో ఇలా అంటాడు.. ‘‘అయ్యా! నువ్వు నా కుమార్తెను ఇవ్వమని అడుగుతున్నావు. నేను నా కుమార్తెకు స్వయంవరం చాటింతమని కోరుతున్నాను. నువ్వు ఆ స్వయంవరానికి రా... అక్కడ నీ అదృష్టాన్ని పరీక్షించుకో’’ అని అంటాడు. 

ఈ మాటలు విన్న ఆ కుబ్జుడు, పార్వతీ దగ్గరకు వెళ్లి.. ‘‘అపర్ణా! నీ తండ్రి నీకు స్వయంవరం చాటిస్తున్నాడు. అందులో నువ్వు ఎవరినైతే వరిస్తావో అతడే నీ భర్త అవుతాడట. ఈ సంగతి చెప్పి వెళదామని నీ దగ్గరకు వచ్చాను. మన్మథునిలాంటి వాడినే నువ్వు వరిస్తావుగాని.. నాలాంటి వికృతరూపంగల వాడిని ఎలా వరిస్తావు? సెలవిస్తే నేను బయలుదేరుతాను’’ అని అంటాడు. 

ఉమ అతడు చెప్పింది విని.. ‘‘ఓ స్వామీ! నిన్ను నేను శంకరునిగా గుర్తించాను. నాపై నీకున్న అనురాగానికి సంతోషించాను. నేను ఎవ్వరినో ఎందుకు కోరుకుంటాను? నువ్వే నా భర్తవు. నీకు విశ్వాసం కలగాలంటే.. ఇప్పుడే నేను నిన్ను వరించుకుంటాను’’ అంటూ.. ఒక పుష్ఫహారాన్ని ఆ నీలకంఠుని మెడలో వేస్తుంది. 

అప్పుడు అతడు.. ‘‘నువ్వు నన్ను ప్రీతితో వరించావు కాబట్టి నీకు ముసలితనం, మరణం లేకుండా వరాన్నిస్తున్నాను. నువ్వు తపస్సు చేసిన ఈ వనం ఇకనుంచి చిత్రకూటమని పిలువబడుతుంది. ఈ వనానికి వచ్చి దేవపూజకోసం ఎవరైతే పుష్పాలను కోస్తాడో.. అతడు అశ్వమేధఫలాలను పొందుతాడు. ఎవడు ఈ గిరిశిఖరమున తపము చేసి ప్రాణాలు విడుస్తాడో.. అతడు ప్రమథగణంలో ముఖ్యుడవుతాడు’’ అని అంటాడు. 
పార్వతి ఆ పర్వతశికరం దగ్గరే కూర్చుని పరమేశ్వరుని ధ్యానిస్తుంటుంది. ఆ పర్వత శిఖరానికి సమీపంలో ఒక తామర చెరువు గలదు. ఒకరోజు శివుడు ఒక బాలకుని రూపంలో ఆ చెరువులోదిగి బాలక్రీడలు ఆడుతుండగా.. అందులో వున్న మొసలొకటి అతనిని పట్టుకుంటుంది. ఆ బాలుడు పెద్దగా అరుపులు పెడుతూ ఏడుస్తుంటాడు. అదివిన్న పార్వతి ఆ కొలను దగ్గరకు వెళ్లి చూస్తుంది. ‘‘అయ్యో! ఈ మొసలి నన్ను పట్టుకుంది. ఎవరైనా పుణ్యాత్ములు వచ్చి నన్ను కాపాడండి? నేను నా తల్లిదండ్రుల గురించి విచారిస్తున్నాను. వారికి నేనొక్కడినే పుత్రుడ్ని. నా మరణవార్త విని వాళ్లు కూడా మృతిచెందుతారు. దైవనిర్ణయాన్ని కాదని చెప్పేవాళ్లు ఎవరు? అని విచారిస్తుంటాడు. 

అక్కడకు చేరుకున్న పార్వతి ఆ మొసలితో.. ‘‘ఓ నక్రమా! నీవెందుకు ఈ బ్రాహ్మణవటువును మింగుతున్నావు? కనికరించి అతనిని వదిలిపెట్టు’’ అనగా.. మొసలి ‘‘తల్లీ! ఇక్కడికి వచ్చే ఏ ప్రాణినైనా భక్షించి జీవనాన్ని గడుపుమని బ్రహ్మ నాకు చెప్పాడు. ఈరోజు నాకు ఈ బాలుడు దొరికాడు. ఎలా వదలగలను?’’ అని అంటాడు. అప్పుడు పార్వతి.. ‘‘ఓ జలచరమా! నేను హిమవంతుని పుత్రికను. నేను ఇన్నాళ్లూ చేసిన తపము నీకిస్తాను. ఆ బాలుడిని వదిలిపెట్టు’’ అని అంటుంది. 

ఆ మాటలు విన్న మొసలి.. ‘‘నువ్వు ఉత్తమంగా భావించే తపము కొంచెమైనా నాకివ్వు’’ అనగా.. పార్వతి ‘‘నేను పుట్టినప్పటినుండి ఏ పుణ్యాలు చేశానో.. ఆ పుణ్యాలు వాటి ఫలాలు నీకిచ్చేస్తున్నాను. ఆ బాలుడిని వదిలిపెట్టు’’ అని కోరుకుంటుంది. అందుకు మొసలి.. ‘‘ఉమాదేవీ! ఇంత కష్టపడి చేసిన తపమును వదులుకుంటున్నావా? పెద్దలు వింటే నిన్ను మెచ్చుకోరు’’ అని అంటాడు. 

పార్వతి తిరిగి ఘోరతపస్సు చేయడం ప్రారంభిస్తుంది.  పరమేశ్వరుడు అక్కడకు ప్రత్యక్షమై.. ‘‘అపర్ణా! నువ్వు చేసిన తప: ఫలమును ధారపోయగా.. దానిని నేను గ్రహించాను. అది నీకు అక్షయమైన ఫలితాలనిస్తుంది. ఇక ఈ తపము చాలించు’’ అని పలుకగా.. పార్వతి తన తపము ఫలించినందుకు చాలా ఆనందిస్తుంది. 

పర్ణమనగా.. ఆకులు. తపముచేసేవారు ఆకులు, ఆలములు తింటారు. ఈమె తపము చేసేటప్పుడు ఆకులు కూడా తినకుండా ఉపవాసముండేవి. మునులు ఈమెను అపర్ణ అని పిలిచారు.


పార్వతీ స్వయంవరం :
ఆనాడు హిమవత్ పర్వత రాజు రాజధాని అయిన ఓషధిప్రస్థము చాలా సందగిడా వుండేది. ప్రతిఒక్కరు పార్వతీ స్వయంవర మహోత్సవ గురించే మాట్లాడుకునేవారు. రాజుగారి ఇంట్లో శుభకార్యం జరుగుతున్నదని తెలుసుకుని... అక్కడి ప్రజలు కూడా విచ్చేశారు. 

పార్వతి కైలాసవాసునిని వరించిందన్న విషయం హిమవంతునికి తెలుసు. తన వద్దకు వికారరూపంలో వచ్చి, పార్వతిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరినవాడు కూడా ఈశ్వరుడేనన్న అనుమానం కూడా లేకపోలేదు. అయినా.. తాను మొదట ఉద్దేశించుకున్న ప్రకారమే స్వయంవరం కార్యక్రమం పూర్తి చేయాలని నిశ్చయించుకొన్నాడు. 

పార్వతీ స్వయంవరాన్ని భూలోకంలోని స్వర్గాది సర్వలోకాలలో నిర్వహించుకున్న హిమవంతుడు... బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, ఇంద్రాది దిక్పాలకులను, వసువులు, ఆదిత్యులు మొదలైనవారందరినీ ఆహ్వానించాడు. 

స్వయంవరంరోజు ఇంద్రుడు మహావైభవంతో ఐరావతమెక్కి వచ్చాడు. నీలశరీరకాంతితో మహిషమెక్కి యమధర్మరాజు వచ్చాడు. వరుణుడు, కుబేరుడు తగిన పరివారములతో హాజరయ్యారు. గరుత్మంతునిపై ఎక్కి పీతాంబరంతో, శంఖచక్కాది లాంఛనాలతో శ్రీ మహావిష్ణువు, హంసవాహనంపై బ్రహ్మలు అక్కడికి చేరుకున్నారు. గంధర్వరాజైన చిత్రరథుడు విమానమెక్కి చేరుకున్నాడు. 

స్వయంవరానికి సమయం ఆసన్నమైంది. ఇంతమంది వచ్చినా... కైలాసగిరి నుంచి పరమేశ్వరుడు ఇంకా హాజరు కాలేదు. పార్వతి సభాభవనంలోకి పుష్పమాలిని చేతిలో పట్టుకొని వచ్చి... ఒక ఆసన్నంపై కూర్చుంది. 

ఇంతలో ఒక శిశువు పార్వతీ ఒడిలో వాలిపోతాడు. అప్పుడు పార్వతి తన యోగశక్తి వల్ల ఆ శిశువే పరమేశ్వరుడు అని తెలుసుకొని.. అతని మెడలో హారమువేసి వరిస్తుంది. అయితే అక్కడున్న ఇంద్రాదిదేవతలు ఆ బాలుడే పరమేశ్వరుడని తెలియక క్రోధావిష్టులవుతారు. 

అప్పులో మొదటివాడైన దేవేంద్రుడు... ఆ బాలుడిని వజ్రాయుధంతో కొట్టబోతాడు. కానీ.. అతని సర్వాంగములు స్తంభించి.. శిలాప్రతిమలాగా మారిపోతాడు. భగవానుడు కూడా అలాగే మారిపోతాడు. 

అదిచూసిన విష్ణుమూర్తి.. ఆ బాలుడే శంకరుడు అని గ్రహిస్తాడు. బ్రహ్మదేవుడు కూడా... దేవతల యోగబలాన్ని స్తంభింపచేసే ఇతడెవరోనని కొద్దిసేపు చింతించి.. ఆ తరువాత ఆ కుమారుని పరమశివునిగా తెలుసుకుని స్తోత్రాలు చేస్తాడు. 

‘‘పరమపురుషుడైన నువ్వు.. కీడుతలపెట్టిన మూర్ఖులకు తగిన శిక్షయే లభించింది’’ అని పలుకుతూ... ఇంద్రాది దేవతలను ‘‘మీరు మహాదేవునికి అపకారం తలపెట్టారు. అది మీకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ఆ మహేశ్వరుని భక్తితో సేవించండి’’ అని హితం పలుకుతాడు. 

అప్పుడు ఆ ఇంద్రాది దేవతలు ఈశ్వరుడిని మనసులో ధ్యానించుకుంటారు. శంకరుడు దయామయుడు కాబట్టి.. వారి దురవస్థను మాన్పించి.. బాలడి రూపాన్ని వదిలేసి, మనోహరమైన రూపాన్ని ధరిస్తాడు. హిమవంతునితో సహా అందరూ దేవతలు ఆయనకు ప్రణామములు ఆచరించారు. 

అక్కడున్న సభ్యులందరూ హిమవంతునితో... ‘‘ఇటువంటి మహానుభావుడు నీకు అల్లుడు అయినందుకు నీ జన్మం ధన్యమైంది. ఇక పెళ్లి ఏర్పాటు త్వరగా చేయండి’’ అని అంటారు. 

పర్వతరాజు బ్రహ్మను చూసి... ‘‘అన్నింటికీ నీవే ముఖ్యుడివి. కాబట్టి బ్రహ్మత్వం వహించి.. నువ్వే ఈ వివాహ మంగళకార్యాన్ని నడిపించు’’ అని కోరుకోగా... బ్రహ్మదేవుడు అందుకు అంగీకరిస్తాడు. నగరమంతా అలంకరించారు. 

సూర్యచంద్రులు తమ కాంతులచేత ఆ నగరాన్ని అహోరాత్రులు ప్రకాశించేలా చేశారు. కళ్యాణమండపం వద్ద దేవతలు, మునులు అందరూ ఆసీనులై వేదమంత్రాలను ముక్తకంఠంతో చదివారు. మేనాహిమవంతులు కన్యాదానం చేశారు. బ్రహ్మదేవుడు వధూవరులకు పాణిగ్రహణం చేసి, అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణం చేయించారు. 

మహామునీంద్రులు వేదాశిస్సులు పలికారు. దేవతలందరు నూతన వధూవరులకు వస్త్రమణిభూషణాదులు కానుకలుగా ఇచ్చారు. 

మన్మథ దహనం : 
పూర్వం ఒకరోజు పార్వతీపరమేశ్వరులు కలిసి ఒక మేడమీద కూర్చుని వుండగా... కొందరు మహామునులు అక్కడికి చేరుకున్నారు. శంకరుడు వారితో సత్ప్రసంగములు చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలోనే మన్మథుడు కూడా రతిదేవితో కలిసి అక్కడికి వచ్చాడు. 

సమయాసమయములు గుర్తించకుండా అక్కడికి చేరుకున్న మన్మథుడిని చూసి.. శంకరుడు తన మూడవకన్నుతో అతనిని కాల్చివేశాడు. అలా నిర్జీవుడైన తన భర్తను చూసి.. రతీదేవి, పార్వతీపరమేశ్వరులను దీనంగా ప్రార్థించి.. తన భర్తను సజీవంగా మార్చమని కోరుకుంటుంది. 

గౌరీశంకరులు ఆమెను ఓదార్చి.. ‘‘మన్మథుడు ఇంకా శరీరంతో బతికేవున్నాడు. కాని అనంగుడై కూడా అతడు తన పని చేస్తూనే వున్నాడు. శ్రీమన్నారాయణనుడు భూమిలో యదవంశంలో వాసుదేవుడై జన్మిస్తాడు. ఆ శ్రీకృష్ణునకు పట్టమహిషియైన రుక్మిణికి ప్రద్యమ్యుడు అనే పేరుతో నీ భర్త జన్మిస్తాడు. అప్పుడు నువ్వు అతనిని మానవకాంతవై పెళ్లాడతావు. విచారాన్ని మానుకో’’ అని ఆమెను అక్కడి నుంచి పంపివేస్తారు. 

పురుషోత్తమ క్షేత్రము :
మహామునులందరూ పురుషోత్తమ క్షేత్రం గురించి వివరించండి అంటూ సూతుడిని కోరుకున్నారు. అప్పుడు సూతుడు దాని చరిత్రను వివరిస్తూ... 
‘‘ఒకప్పుడు మేరుపర్వత శిఖరభాగంలో సకలదేవతలు, ముని గణములను సేవిస్తుండగా.. లక్ష్మీదేవితో శ్రీమన్నారాయణుడు కొలువయ్యారు. అప్పుడు లక్ష్మీదేవి తన భర్తను చూసి.. ‘‘భూలోకాన్ని కర్మభూమి అని అంటారు. అక్కడ జన్మ లభించడం పుణ్యవిశేషం అని కూడా అంటారు. మరి, అటువంటి భూమిలో జన్మించినవారు కామక్రోధంతో షడ్వర్గాలకు లోనయి వివాహకర్మం చేయడం మానుకుంటున్నారు. ఈ విచిత్రమేమిటో తెలుసుకోవాలని వుంది. దయచేసి చెప్పండి’’ అని కోరుకుంటుంది. 

అప్పుడు శ్రీమన్నారాయణుడు ఇలా చెప్పాడు.. ‘‘పురుషోత్తమ క్షేత్రం అనే ఒక పుణ్య క్షేత్రం సముద్రతీరంలో వుంది. అందులో పురుషోత్తముడు నివసించేవాడు. దానికి సమానమైన ఇంకొక క్షేత్రం భూమండలంలోనే లేదు. అక్కడ నా విగ్రహం ఇంద్రాదిదేవతలతో, ఎవ్వరికి కనబడకుండా దాచబడింది. అందువల్ల నదిక్షేత్రంరాజం అని చెప్పబడుతుంది. 

కల్పాంత ప్రళయంలో యోగనిద్రలో వెళ్లిపోయిన నేను.. ప్రళయం తరువాత నిద్రనుంచి లేచి, సృష్టిని నిర్మించాలని సంకల్పించాను. నాభికమలం నుంచి బ్రహ్మను సృజించాను. అతడు పంచభూతాలను, వాటినుండి స్థూల, సూక్ష్మ రూపాలైన వస్తుజాలమును సృష్టించాడు. అవి చరములని, అచరములని రెండు విధాలుగా వుండేవి. బ్రహ్మ మళ్లీ ప్రజాపతులను, మునివరులను తన సంకల్పంతో సృజించాడు. అలాగే అండజములు, జరాయుజములు, స్వేదజములు, ఉద్భేదజములుఅనే నాలుగు విధాలైన జవరాసులను సృష్టించాడు. 

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే నాలుగు వర్ణాలవారిని, అత్యంజులను, మ్లేచ్ఛులను కూడా సృష్టించాను. వారికి ఆహారంగా తృణగుల్మవృక్షలతాదాలను ఏర్పరిచాడు. తన శరీర దక్షిణభాగం నుంచి పురుషుని, వామభాగం నుంచి స్త్రీని సృష్టించి... వారిని దంపతులు చేసి, సంతానం వృద్ధి చేసుకోమ్మని చెప్పాడు. అప్పటినుంచి స్త్రీపురుష సంగమం వల్ల జీవరాసులు జన్మించే వ్యవస్థ మొదలైంది. నేను విరాడ్రూపుడై ఆయా జీవరాసులలో ఆత్మస్వరూపుడిగా నిలిచి వున్నాను. 

ఒకప్పుడు బ్రహ్మ నన్ను చూసి... ‘‘మహాత్మా! ఈ సృష్టిలో అనేకవిధాల స్వభావాలు గలవారు పుడుతున్నారు. కొందరికి పుణ్యకర్మలు చేసే బుద్ధి కలగడం లేదు. అటువంటివారికి స్వర్గాది పుణ్యలోకం ఎలా కలుగుతుందో చెప్పు’’ అని కోరాడు. 

నేను.. ‘‘దక్షిణదేశంలో సముద్రతీరాన ఒక వటవృక్షముంది. దాని నీడలో కూర్చున్నవారికి బ్రహ్మహత్యాది దోషాలు నశిస్తాయి. ఆ వృక్షానికి ఉత్తర భాగంలో ఒక మందిరముంది. అందులో ఒక అందమైన విగ్రహాన్ని పరమేశ్వరుడు స్థాపించాడు. దానిని దర్శించుకున్నవారికి మోహం తొలగిపోయి వైకుంఠప్రాప్తి కలుగుతుంది. 

ఒకప్పుడు యమధర్మరాజు పురుషోత్తమ క్షేత్రానికి వచ్చి, నాకు నమస్కరించి... ‘‘ఓ మహానుభావా! నీకు వందనములు’’ అని వినయంతో పలికాడు. ఆ సమయంలో నేను అతడిని ఇలా అడిగాను.. ‘‘యమధర్మరాజా! దేవతలలో ఉత్తముడవైన నువ్వు నా దగ్గరకు ఎందుకు వచ్చావు’’ అని ప్రశ్నించాను. 

అప్పుడు యమ.. ‘‘ఈ పురుషోత్తమ క్షేత్రంలో వున్న నీ రూపం, భక్తులకు కోరిన కోరికలు నెరవేర్చుతోంది. వారు నిన్ను దర్శించి, శ్వేతమనే పేరుగల ఆ దేవాలయాన్ని చూసి, తమ కామక్రోధాలు విడిచి వైకుంఠానికి నన్ను చూడకుండానే వెళ్లిపోతున్నారు. నాకసలు ఎటువంటి పని కూడా వుండటం లేదు. నేను జీవుల పాపపుణ్యాల గురించి విచారించడం తప్ప నేనేం చేయగలను. కాబట్టి నన్ను అనుగ్రహించి పాపులకు ఈ విగ్రహం కనబడకుండా చేయు’’ అని కోరాడు. 

అప్పుడు నేను ఆ విగ్రహాన్ని మునిజనులకు తప్ప ఇతరులకు కనబడకుండా ఇసుకలో విగ్రహాన్ని పూడ్చిపెట్టాను. యముడు దానికి సంతోషించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

జగన్నాథుని మీద ఇంద్రుద్యుమ్నుడు చూపిన భక్తి :
మాళవ దేశానికి అధిపతి అయిన ఇంద్రుద్యుమ్నుడు.. అవంతీనగరాన్ని రాజధాని చేసుకుని రాజ్యం చేసేవాడు. అతడు విష్ణుభక్తుడు. రాజ్యంలో వున్నవారందరిని కన్నబిడ్డలుగా చూసుకునేవాడు. వర్ణాశ్రమాచార ధర్మాలు అతని పాలనలో తూచాతప్పకుండా కనబడేవి. పాపాత్ములుగాని, మూర్ఖులుగాని ఆ ప్రాంతంలో కనిపించరు. ఉజ్జయినీ నగరాన్ని మహాకాళడనే పేరుతో పరమేశ్వరుడు ఆరాధించబడుతూ.. పాపాలను పోగొట్టేవాడు. 
ఒకనాడు ఇంద్రద్యుమ్నుడు పూర్వ సముద్రతీరంలో వున్న జగన్నాథుని చూడటానికి పురుషోత్తమ క్షేత్రానికి వచ్చాడు. అక్కడ జగన్నాథునికి ఆలయాన్ని నిర్మించాలని అనుకుంటాడు. ముందుగా వటవృక్షరూపంలో వున్న జగన్నాథునికి పూజలు చేసి.. కళింగదేశాధిపతిని, కోసలరాజును పలిపించి.. ‘‘మనం ఇఖ్కడ జగన్నాథుని విగ్రహాన్ని చేయించి, ఆపైన ఆలయాన్ని నిర్మిద్దాం’’ అని చెబుతాడు. 

అప్పుడు అక్కడికి ఆగమ శాస్త్ర పండితులను, శిల్పులను పిలిపించి.. ‘‘ఇక్కడ జగన్నాథుని ఆలయాన్ని నిర్మించాలి. మీరందరూ దేశమంతా తిరిగి మేలైన రాళ్లను ఎంచుకుని తీసుకుని రండి’’ అని వారిని పంపిస్తాడు. అలాగే వార్తాహరులను పిలిపించి.. ‘‘మీరు రాజులందరి దగ్గరకు వెళ్లి ఆలయ నిర్మాణం గురించి వివరించండి. ఈ కార్యానికి కావలసిన సహాయం చేయడానికి ఇక్కడికి రావలసిందిగా చెప్పండి’’ అని పంపిస్తాడు. 

రాజులందరూ ఈ వార్త వినగానే రాజలాంఛనాలతో, చతురంగబలాలతో పురుషోత్తమ క్షేత్రానికి చేరుకున్నారు. వారందరిని ఇంద్రద్యుమ్నుడు చూసి ఆనందించి.. ‘‘ఈ క్షేత్రం చాలా పుణ్యమైంది. అందువల్లే ఇక్కడ జగన్నాథుని ఆలయ నిర్మాణం చేయాలి. అంతకుముందే అశ్వమేధయాగం చేయాలని సంకల్పించాను. కాని కార్యభారముని నేనొక్కడినే చేయడం కష్టం కాబట్టి మీరందరు నాకు సహకరించి పనిని నిర్వహించండి’’ అని అంటాడు. 

చక్రవర్తి వారందరిని ఇలా అడగగా వారందరూ చాలా సంతోషించారు. అశ్వమేధ యాగానికి కావలసిన సంభారాలన్ని సమకూర్చారు. యజ్ఞానికి కావలసిన సమస్త ద్రవ్యాలను సమకూర్చారు. దూరదేశాల నుంచి వచ్చిన బ్రాహ్మణులకు, రాజులకు, ఇంకా ఇతర జాతులవారికి అన్ని ఏర్పాట్లు ఏర్పరిచారు. ఒక సుముహూర్తంలో ఇంద్రద్యుమ్నుడు యజ్ఞదీక్షితుడై, యశ్వాన్ని పూజించి దేశంమీదికి వదిలాడు. అతని కుమారుడు చాలా పరాక్రమవంతులు. వారు ఆ అశ్వానికి వెంటనంటి వెళ్లారు. 

అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ, ఋత్విజులు వేదమంత్రోచ్ఛారణంతో హోమాలు చేస్తున్నారు. పండితులు శాస్త్రచర్చలు చేస్తున్నారు. ఇలా మహావైభవంతో యజ్ఞం పూర్తి అయింది. చక్రవర్తి అవబృథ స్నానం చేసి, ఇతరదేశాల నుంచి వచ్చిన వారందరిని అపరిమిత ధనంతో సత్కరించాడు. రాజులను గౌరవించి, సంతోష పరిచాడు. యాగం సమాప్తం అయింది. 

ఇంద్రద్యుమ్నుడు ఒకనాడు ఏకాంతంగా కూర్చుని శ్రీజగన్నాథుడిని మనసులో తలుచుకుంటే ఇలా స్తుతించాడు.. ‘‘ఓ జగన్నాథా! సృష్టిలో వున్న ప్రతి అణువు నీ రూపమే. అజ్ఞానులైన మాలాంటి మానవులకు అనేకంగా కనిపిస్తున్నావు. నీ మహిమ గురించి దేవతలే తెలుసుకోలేకపోయారు. మాలాంటి వాళ్లకు ఎలా తెలుస్తుంది? నేను ఇదివరకు ఎన్నో జన్మలెత్తాను. పశుపక్షి, మానవ, క్రమికీటకాలలో ఎన్ని మాతృగర్భంలో పుట్టానో లెక్కలేదు. మానవజన్మం ఎత్తినప్పుడు ఎన్నో శాస్త్రాలను చదవివాను. ఎంతో ధనాన్ని ఆర్జించాను.

జలయంత్రంలా జీవితంలో ఎగుడుదిగుడులు చూశాను. ఇటువంటి సంపారంలో పడి దీనినంతటిని చూడలేక పరితపించాను. నన్ను కనికరించి ఈ సంసారబంధం నుంచి విముక్తిని చెయ్. నాకన్నా సమర్థులు ఇంకెవ్వరూ లేరు. నా జీవిత క్షేమం నీ చేతిలోనే వుంది. నన్ను సేవించని వారు అధములు. వారికి నీమీద భక్తి ఎలా కలుగుతుంది? అందువల్ల నేనెప్పుడు జన్మనెత్తినా నీ నామస్మరణం, నీమీద భక్తిని ప్రసాదించు. ఇలా అడగటం మా వెర్రితనం.. ఇవే నీకు అనంతకోటి ప్రణామములు’’. 

ఇంద్రద్యుమ్నుడు చేసిన స్తోత్రానికి జగన్నాథుడు మెచ్చుకుని, ఒకనాటి రాత్రికలలో సాక్షాత్కరించి.. ‘‘ఓ రాజా! నీ భక్తిని, యాగానికి నేను సంతుష్టించాను. నీకొక గొప్ప విషయం చెబుతాను. నువ్వు జగన్నాథుని ప్రతిమను జయించి ప్రతిష్టించదలచావు కదా! రేపు ఉదయాన్నే సముద్రతీరానికి వెళ్లు.. అక్కడ మహావైశాల్యం గల అశ్వత్థవృక్ష ఒకటి కనిపిస్తుంది. దానిని అనుమానించకుండా గొడ్డలితో నరికి పడగొట్టు. ఆ వృక్షాన్ని నరికి, దానునుంచి పెద్దకొమ్మను వేరుచేసి, దానితో జగన్నాథ ప్రతిమను చేయించు. నీ మనసులోవున్న రూపంతోనే ఈ ప్రతిమ తయారవుతుంది. విచారించకు’’ అనిచెప్పి అదృశ్యమయ్యాడు. 

రాజు ఉదయాన్నే లేచి, సముద్రస్నానాన్ని ఆచరించుకుని, సముద్రతీరానికి చేరుకున్నాడు. అక్కడున్న ఆ అశ్వత్థవృక్షాన్ని జగన్నాథుడు చెప్పిన విధంగా నరికాడు. దానిని ముక్కలు చేయబోతుండగా.. అక్కడికి దేవశిల్పి అయిన విశ్వకర్మ, విష్ణుమూర్తి బ్రాహ్మణ వేషములో వచ్చారు. వారు రాజుతో.. ‘‘సముద్రతీర అడవుల్లో పడివున్న ఈ వృక్షం, నీకేమి అడ్డు వచ్చింది?’’ అని అడిగారు. 

అప్పుడు రాజు వారితో.. ‘‘అయ్యా! ఇది జగన్నాథుని ఆజ్ఞ. నేను జగన్నాథుని ప్రతిమను చేయడానికి ప్రయత్నిస్తుండగా.. నిన్నరాత్రి నాకొక స్వప్నం వచ్చింది. ఈ వృక్షాన్ని ఛేదించి, దీని శాఖతో విగ్రహాన్ని చేయించు అని జగన్నాథుడు ఆజ్ఞాపించాడు. అందువల్లే దీనిని నరికాను. ఇంకొక కారణంతో కాదు’’ అని చెబుతాడు. 

దాంతో ఆ బ్రాహ్మణులు సంతోషించి... ‘‘రాజా! నీలాంటి ధర్మాత్ముని పాలకునిగా పొందినందుకు ప్రజలు చాలా ధన్యులు. శ్రీనాథుని ఆరాధించినవాడివి. ఇలా రా.. నాతో వచ్చిన ఈ బ్రాహ్మణుడు విశ్వకర్మయంతటి శిల్పి. నువ్వు చెప్పిన విధంగా ఇతడు విగ్రహాన్ని చెక్కుతాడు. నువ్వు ప్రస్తుతానికి ఈ సముద్రతీరాన్ని వదిలేసి దూరంగా వెళ్లు’’ అని వారు చెప్పగా.. రాజు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతాడు. 

అప్పుడు శ్రీనివాసుడు, విశ్వకర్మను చూసి.. ‘‘నువ్వు ఈ చెట్టుకొమ్మతో జగన్నాథుని ప్రతిమను నిర్మించు. దాంతోపాటు బలరామమూర్తి విగ్రహాన్ని కూడా నిర్మించు. హరికి సోదరి అయిన సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా తయారుచేయు’’ అని చెప్పగా.. విశ్వకర్మ అందుకు అంగీకరిస్తాడు. 

విశ్వకర్మ మొదటగా బలరామవిగ్రహాన్ని నిర్మించాడు. రెండవ శ్రీకృష్ణ భగవానుడిది ప్రకాశించేవిధంగా నిర్మించాడు. అలాగే సర్వాలంకారంతో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా చెక్కాడు. ఇంద్రద్యుమ్నుడిని పిలిచి, జగన్నాథుడు ఆ విగ్రహాలను చూపించాడు. సరిగ్గా అతను తలచుకున్నట్టే ఆ విగ్రహాలు చెక్కబడి వున్నాయి. ఎన్నో అలంకారాలతో, స్వల్ప కాలంలోనే విగ్రహాలను నిర్మించినవారికి చూసి పరమాశ్చర్యంతో... ‘‘మహానుభావులారా! అద్భుతమైన తేజస్సు రూపంలో వున్న మీరు ఎవరు? మాయారూపంలో వచ్చిన దేవతలా? మీ వృత్తాంతం గురించి వివరించండి?’’ అని అడిగాడు. 

అప్పుడు జగన్నాథుడు.. ‘‘సర్వ వేదాంత రహస్యాల జ్ఞానాన్ని కలిగినవాడిని నేను పరమేశ్వరుడిని. నువ్వు నా భక్తుడివి కనుక నీకు దర్శనమిచ్చాను. నీకొక వరాన్నిస్తాను కోరుకో’’ అని అంటాడు. రాజు ఆ మాటలు విని ఆనందంతో సమస్కారాలు చేసి.. ‘‘దేవా! ఆనందదస్వరూపమై పరమపదంతో నాకు అనుగ్రహించు’’’ అని రాజు కోరుకుంటాడు. 

అప్పుడు జగన్నాథుడు.. ‘‘ఇంద్రుద్యమ్నా.. నువ్వు అనేక యజ్ఞాలు, పుణ్యకర్మాలు చేస్తూ ఈ భూచక్రంలో 19వేల సంవత్సరాలు పరిపాలన చేస్తావు. నువ్వు చేసిన ధానదర్మాలతో ఒక మడుగు ఏర్పుడుతుంది. ఆ తరువావత నువ్వు దేవేంద్రాదులకు కూడా పొందని పరమపదాన్ని పొందుతావు.ఇఖ్కడ నైరుతిదిశగా ఒక మర్రిచెట్టుంది. దాని సమీపంలో ఒక దేవాలయం వుంది. రాబోయే ఆషాఢ శుద్దపంచమినాడు నన్ను అక్కడ ప్రతిష్ఠించి ఏడురోజులు పూజాపురస్కారాలు చేయు’’ అని చెప్పగా రాజు చాలా సంతోషించాడు. ఈ చర్మవృక్షులతోనే నేను జగన్నాథుని దర్శించాను. ఇంతకంటే ఏం కావాలి అని భావించి, సుభద్రబలరామకృష్ణ విగ్రహాలను పల్లకిలో పెట్టించి దేవాలయానికి తీసుకుని వెళ్లాడు.

భగవానుడు చెప్పిన సుముహూర్తంలో వేదమంత్రాలతో విగ్రహాలను ప్రతిష్టించి, కళాన్యాసం చేయించాడు. ఆ విగ్రహప్రతిష్టను యథాశాస్త్రంగా నడిపించిన గురువుకి, ఋత్వికులకు బంగారాభరణాలతో పూజించాడు.

పంచతీర్థ మహిమ :
ఇంద్రద్యుమ్నుని పేరుతో వెలిసిన తీర్థాన్ని పంచతీర్థంగా పిలువబడుతోంది. ఈ తీర్థంలో నారాయణనామ స్మరణం చేస్తూ.. అఘమర్షణ స్నానం చేసి, బ్రహ్మయజ్ఞం, దేవ పితృ తర్పణం చేయాలి. ఆ తరువాత జగన్నాథునిని పూజించుకోవాలి. అలా చేయడంతో అతని ఏడుతరాలవారిని, ఆ తరువాత వచ్చే ఏడు తరాలవారిని తరింపజేయాలి. తాను స్వయంగా విష్ణులోకానికి దేవవిమానంపై వెళతాడు.

ఏకాదశినాడు ఉపవాసం వుండి, పైన చెప్పిన కృత్యాలను ఆచరించినా.. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి తిథిలో ఆచరించినా విశేష ఫలితాలు లభిస్తాయి. జ్యేష్ఠ పూర్ణిమా తిథి.. దశవిధపాతకాలను హరిస్తుంది కనుక దానికి ‘‘దశహర’’ అనే పేరు వచ్చింది. సమస్థ తీర్థ జలాలు ఆ పంచతీర్థంలో నివసిస్తాయి కాబట్టి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమినాడు స్నాన, ధ్యాన, తర్పణాది కృత్యాలకు విశేస ఫలప్రదం లబిస్తుందని అందరూ విశ్వసిస్తారు.

కండు మహర్షి చరిత్ర :
సూతుడు.. పురుషోత్తమ క్షేత్ర మహత్యం గురించి చెబుతూ... ఒక ఇతిహాసాన్ని మునులకు ఈ విధంగా చెబుతాడు...
‘‘కండు అనే మహర్షి ఒక అరణ్యంలో తపము చేస్తుండేవాడు. ఆయన వేదవేదాంగ విశారదుడు. ఆయన శరీరం క్షణభంగురమని తెలిసిన వేదాంతి. అందువల్ల ఆయన పురుషోత్తముడైన జగన్నాథునిని మనసులో నిలిపి, ప్రపంచంలో వున్న సమస్త విషయాలను విడిచిపెట్టి, నిష్ఠతో తపము చేసేవాడు. 
అతని తప: ప్రభావానికి దేవేంద్రుడు భయపడి.. దానిని చెరిపించాలనే ఉద్దేశ్యంతో... ప్రమ్లోచన అనే ఒక అప్సరసను పిలుస్తాడు. ఆమెతో.. ‘‘నువ్వు వెళ్లి ఆ కండు ముని తపస్సును పాడుచేసి రా’’ అని చెబుతాడు. కానీ ముని ఎక్కడ శపిస్తాడేమోనన్న భయంతో ఆ అప్సరస దేవేంద్రుడితో.. ‘‘దేవేంద్రా! రంభాద్యప్సరసలు నాకంటే అందంగా వున్నారు. నేనెంత నా సౌందర్యమెంత? వారిని పంపించవచ్చు కదా!’’ అని చెబుతుంది. 

దానికి సమాధానంగా దేవేంద్రుడు.. ‘‘నీవల్లే ఈ కార్యం కొనసాగుతుంది. నీకు సహాయంగా మన్మథునిని, వసంతునిని పంపిస్తున్నాను. వెళ్లి పని సాధించు’’ అని పంపగా... ఆమె కండుముని తపము చేసే ప్రాంతానికి బయలుదేరుతుంది.

కండు మహర్షి తప: ప్రభావంతో ఆ వనంలో వున్న జంతువులు మైత్రితో జీవనాన్ని కొనసాగించేవి. వృక్షాలు, ఫలపుష్ప సంభరితమై కనులపండుగగా వుండేవి. అక్కడికి వచ్చిన ప్రమ్లోచన కూడా ఆ వనసౌందర్యానికి ముగ్దురాలయిపోతుంది. ప్రకృతి మనోహరంగా వుండే సమయంలో ఆమె ఒక పూలచెట్టు కింద కూర్చుని.. లోకాలు పరవశించేటట్లుగా గానం చేస్తుండేది. మదన, వసంతులు ఆమెకు తోడుగా అక్కడే వున్నారు.

కండుముని ప్రాతస్సంధ్యావందనం కోసం లేచాడు. గానం శ్రుతి మనోహరంగా వినిపించిన మునికి.. ప్రమ్లోచన వద్దకు వెళతాడు. అక్కడ అతను, ఆమెతో.. ‘‘నువ్వు ఎవరు? నువ్వు వచ్చిన పని ఏమి?’’ అని ప్రశ్నిస్తాడు. 

అందుకు ఆమె సమాధానంగా.. ‘‘ఓ మునివరా! నీ సేవ చేసి తరించడానికి వచ్చాను. నీకెప్పైడైనా, ఏమైనా కావాలంటే చెప్పినా.. అవన్ని సిద్ధంగా అమర్చి ఇస్తాను’’ అని అంటుంది. 

ఆ సమయంలో అక్కడే వున్న మన్మథుడు ముని హృదయంలో పూలబాణాలు నాటుతాడు. వసంతుడు అతనిపై పూలజల్లు కురిపిస్తాడు. దాంతో ముని మనసు అప్సరసపై లగ్నమైపోతుంది. ముని ఆమె చెయి పట్టుకుని, తన మనసులో వున్న భావాన్ని చెప్పి.. ఆశ్రమ కుటీరానికి తీసుకుని వెళతాడు. 
తాము వచ్చిన పని పూర్తయిందన్న సంతోషంతో మదన, వసంతులు స్వర్గలోకానికి తిరిగి వెళ్లిపోతారు. అక్కడికి వెళ్లి ఇంద్రునికి ఈ విషయం గురించి మొత్తం చెబుతారు. దాంతో ఇంద్రుడు చాలా సంతోషిస్తాడు. 

కండు ముని, ప్రమ్లోచనతో రాత్రి, పగలు అని తేడా లేకుండా నూరు సంవత్సరాలపాటు భోగసారాలు అనుభవించాడు. మునివేషంలో వుండటం వల్ల ఆమె ఇతనిని అసహ్యించుకుంటేదేమోనని.. యితపశ్శక్తిని ఖర్చచేసి యౌవనరూపాన్ని ధరించి.. ఆమెతో సుఖంగా వుండేవాడు.

వంద సంవత్సరాలు గడిచిన తరువాత ఆమె.. ‘‘ఇక నేను స్వర్గ పట్టణానికి వెళతాను. సెలవివ్వండి’’ అని అడుగుతుంది. దాంతో అతడు.. ‘‘ఇంకొంత కాలం ఇక్కడే వుండు’’ అని కోరుకుంటాడు. ముని మాటకు ఎదురు చెప్పలేక ఆమె అతనితోనే వుండిపోతుంది. దాంతో ముని తపస్సు చేయడం మరిచిపోయి... దేవతారాధనాలు, స్నానాలు, సంధ్యలు, జపములు, వేదాపారాలన్ని మూలబడతాయి. 

అలాగే ఇంకా వందేళ్లు గడిచిన తరువాత కూడా ఆమె వెళతానంటే.. ముని వద్దంటూ తన దగ్గరే వుండమంటాడు. ఒకనాడు సాయంకాలం కండుముని, ప్రమ్లోచనతో.. ‘‘ఓ వనితామణీ! సాయంకాలం అవుతోంది. సంధ్యవార్చి వస్తాను. ఉదయం నుంచి నీతోనే సరిపోయింది’’ అని అంటాడు. 

ముని చెప్పిన మాటలు విని ప్రమ్లోచన నవ్వుతుంది. అతనితో.. ‘‘ఇప్పుడు సంధ్య వార్చెదవా? ఇటువంటి సాయంకాలాలు ఎన్ని గడిచాయో తెలుసా?’’ అని అడుగుతుంది. అతడు.. ‘‘నువ్వు ఈ ఉదయమేగా వచ్చావు. ఇంతలో నన్ను ఎందుకు హాస్యమాడుతున్నావు? అని అంటాడు. 

అప్పుడు ఆమె అతనిని చూసి.. ‘‘మునీంద్రా! నిజం చెబుతున్నాను విను. నువ్వు నన్ను ప్రభావవేళ చూసింది నిజమే. అది ఎన్ని సంవత్సరాల కింద మాట తెలుసా? ఈ మధ్యలో తొమ్మిదివందల ఏడేళ్లు.. ఆపైన ఆరు మాసాలు.. ఆపైన మూడురోజులు కూడా అయిపోయాయి’’ అని చెప్పగానే.. కండు ముని ఒక్కసారిగా ఆశ్చర్యంగా వుండిపోతాడు. 

ముని ఆమెతో.. ‘‘నువ్వు హాస్యం పొందుటకోసం అసత్యం చెప్పడం లేదు కదా?’’ అని ప్రశ్నించాడు. ఆమె.. ‘‘నిజమే చెబుతున్నాను’’ అని, ముని ఏమంటాడోనన్న భయంతో గడగడ వణికిపోతుంది. కానీ కండుముని ఆమె చెప్పింది విని, సిగ్గుపడుతూ.. ‘‘ఎంతటి వారికైనా కామక్రోధాలను విడవడం సాధ్యం కాదు’’ అని అంటాడు. 

అలాగే ముని.. ‘‘ఓ తరుణీ! అతనిని జయించినవాడే భగవంతునిని చూడగలుగుతాడు. ఇదంతా నీ అవివేకంతో జరిగింది. తపము, స్వాధ్యాయము, నిత్య కర్మానుష్ఠానాలు అన్ని చెడిపోయాయి. ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వు ఇంద్రుడు చెప్పినట్టుగా నీ పనిని నెరవేర్చావు. ఇక నువ్వు నీ స్వర్గానికి వెళ్లు. నిన్ను శపించడం నాకు మనసొప్పదు. నువ్వు నాతో ఇంతకాలం కలిసి వున్నావు. అందులో నీవు దోషం ఏమీ లేదు. ఇదంతా నా దోషమే. వెళ్లు’’ అని అంటడు. 

దాంతో ఆమె తనలో వున్న భయాన్ని వదిలేసి, చెమటలతో కూడిన తన శరీరాన్ని వృక్షచిగుళ్లతో తుడుచుకొని, ఆకాశమార్గం ద్వారా అమరావతి చేరుకుంది. ముని ఆమె గర్భంలో వదిలిన తేజం.. చెమట రూపంలో వృక్షాలకు అంటుకుని.. వాటినుంచి మారిషయ అనే కన్య పుట్టింది. ఆ మారిష ప్రతేతసులనే వారిని పెళ్లి చేసుకుని, దక్షుడు అనే కుమారున్ని కనింది. 

పశ్చాత్తాపంతో వేగిపోతున్న కండుముని, తన తపశ్శక్తి తిరిగి సంపాదించుకోవడం కోసం పురుషోత్తమ క్షేత్రానికి వచ్చి, పురోషోత్తమునిని దర్శించికుంటాడు. ఆ సమీపంలోనే ఉర్థ్వబాహుడై, మహాతపము చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలం ఇలాగే తీవ్రంగా తపము చేయగా.. మనోహర నీలవర్ణ దేహంతో, దివ్యమైన శరీరకాంతితో జగన్నాథుడు ప్రత్యక్ష్యమయ్యాడు. 

తన ఎదుట సాక్షాత్కరించిన జగన్నాథుని చూసి కండుముని.. ‘‘ఓ పుండరీకాక్షా! నువ్వు నన్ను అనుగ్రహించడం వల్ల నా తపస్సు ఫలించింది. నా జన్మం సార్థకమైంది’’ అంటూ.. ఆ పరమేశ్వరుడిని స్తుతిస్తాడు. 

అప్పుడు ఆ జగదీశ్వరుడు.. ‘‘మునిరాజా! పరమభక్తిభావంతో నువ్వు చేసిన తపస్సుకు నేను మెచ్చుకున్నాను. నన్ను సేవించిన వారెవ్వరైనా నా పరమపదం పొందుతారు. అటువంటప్పుడు బ్రాహ్మణుడివి, వేదవేదాంగవేత్తవయిన నీకు ప్రసన్నం కావడం ఆశ్చర్యమేమి? నీకు ఏ వరం కావాలో కోరుకో’’ అని అంటాడు. 

దాంతో ముని.. ‘‘కరుణా! నేను ఈ అశాశ్వతమైన ప్రపంచంలో భోగాలు కోరి కాలం వ్యర్థం చేశాను. అదంతా స్వప్నంలాగా నశించింది. శాశ్వదమైన పరమపదం పొందాలని కోరుకుంటున్నాను. నన్ను అనుగ్రహించు’’ అని కోరగా.. జగన్నాథుడు కండుమునికి మోక్షం కలిగింగాడు.

శ్రీకృష్ణ చరిత్ర :
ద్వాపరయుగంలో కాలనేమి వంటి రాక్షసులు భూమిమీద రాజులుగా జన్మించారు. వారు ధర్మమనే పేరుతో అధర్మాన్ని ఆచరించి, ప్రజాపాలనకు పీడ చేస్తుండేవారు. ఇది భరించలేని భూదేవి ఒకప్పుడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి.. ‘‘నేను ఈ దుష్టులవల్ల కలిగే భారాన్ని భరించలేకపోతున్నాను. దీనికేదైనా ఉపాయం చెప్పండి’’ అని అడుగుతుంది.అప్పుడు బ్రహ్మ, భూదేవితో.. ‘‘దేవతా గణాలతో శ్రీహరి వద్దకు వెళ్లు. ఆయనే దీనికి పరిష్కారమార్గం చెప్పగలుగుతారు’’ అని చెబుతాడు. దీంతో భూదేవి, శ్రీమన్నారాయణుడి దగ్గరకు చేరుకుని తన కష్టాలను వివరిస్తుంది. శ్రీహరి ఆమెను ఓదార్చుతూ, తన తలలోని రెండు కేశాలను లాగి.. ‘‘ఈ రెండు బలరామ, కృష్ణులుగా అవతరించి నీ భూభారాన్ని తగ్గిస్తాయి’’ అని చెప్పి పంపుతాడు.



శ్రీహరి మాయాదేవిని పిలిపించి.. ‘‘ఓ దేవీ! హిరణ్యకశిపుని కుమారులు, ప్రహ్లాదుని తరువాత తరువాత పుట్టినవారు ఆరుగురుమంది ఆనాడు నా ఆజ్ఞతో పాతాళానికి వెళ్లారు. వారిని దేవకీదేవి తొలి ఆరుగర్భాలలో వుంచు. వారందరూ కంసునికి బలి అవుతారు. ఆమె ఏడవ గర్భంలో అనంతుడు ప్రవేశిస్తాడు. నువ్వు ఆ గర్భాన్ని ఆకర్షించి.. నందుని ఇంటవున్న వసుదేవుని భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. అప్పుడు దేవకీ ఏడవ గర్భం వ్యర్థమయిందని అందరూ అనుకుంటారు. తరువాత దేవకీ ఎనిమిదవ గర్భంలో నేను ఉదయిస్తాను. నువ్వు యశోదాదేవి గర్భంలో పుట్టి, రేపల్లెలో వున్న వారందరినీ నీ మాయలో ముంచెత్తు. వసుదేవుడు నన్ను నీ స్థానంలో వుంచి, నిన్ను దేవకి దగ్గరకు తీసుకెళతాడు. కంసుడు వధించడానికి వచ్చినప్పుడు నువ్వు అతని చేతికి దొరకకుండా గ్రామదేవతా రూపంలో భూమిలో పూజిస్తూ వుండు’’ అని చెప్పగా.. ఆమె దానికి అంగీకరించి, తన పని మీద వెళుతుంది.

ఈ విషయం గురించి తెలిసిన నారదుడు, కంసుని దగ్గరకు వెళ్లి అతనితో.. ‘‘నీ చెల్లెలు దేవకికి ఎనిమిదవ గర్భంలో నారాయణుడు పుట్టి, నీకు మృత్యుకారణం అవుతాడు’’ అని చెబుతాడు. దాంతో కంసుడు, దేవకీదేవిని చంపబోతాడు. అప్పుడు వసుదేవుడు.. ‘‘పుట్టిన బిడ్డలను నీకు అప్పగిస్తాను. నువ్వు వారిని వశంలో పెట్టుకో’’ అనగా.. కంసుడు వీరిద్దరిని కారాగృహంలో బంధిస్తాడు. దేవకికి వరుసగా ఆరుగురు కొడుకులు పుడతారు. ఆ పిల్లల్ని వసుదేవుడు, కంసునికి ఇవ్వగా.. అతను కరుణలేకుండా ఆ పిల్లల్ని చంపాడు. ఏడవసారి దేవకికి గర్భస్రావమవుతుంది. ఆ గర్భాన్ని మాయాదేవి, రోహిణి గర్భంలోనికి ఆకర్షిస్తుంది. ఎనిమిదవసారి దేవకికి గర్భం వస్తుంది. గర్భస్థుడైన శ్రీహరిని బ్రహ్మాదులు స్తుతించారు.

శ్రావణమాసంలోని బహుళాష్టమినాడు రాత్రి దేవకి ప్రసవిస్తుంది. అప్పుడు శ్రీహరి జన్మిస్తాడు. దేవకీ, వసుదేవులు ఆ పరమపురుషుని స్తుతించారు. దేవకి, ‘‘నువ్వు బాలకుని రూపంలో మాకు దర్శనమివ్వు’’ అని కోరగా.. అతడు బాలకుడయ్యాడు. మాయా ప్రభావంతో అందరూ ఆ సమయంలో గాఢనిద్రలో వుండిపోతారు. వసుదేవుడు బాలుడిని తీసుకొని రేపల్లెకు పోవుతుండగా.. మధ్యలో యమునానది, మహావర్షం కురుస్తుంది. బాలకునిపై వర్షం పడకుండా శేషుడు తన పడగలను విప్పుతాడు. రేపల్లెలో కూడా అందరూ గాఢనిద్రలో వుండగా.. యశోధ ప్రసవిస్తుంది. అప్పుడు వసుదేవుడు ఈ బాలుడిని యశోధ పక్కలో వుంచి, ఆ మాయ బాలికను తీసుకొని వచ్చి దేవకికి ఇస్తాడు.

ఆ సమయంలో కావలివారు మేలుకొని, విషయం మొత్తం కంసునికి తెలుపుతారు. అతను బాలికను చంపబోతుండగా దేవకి.. ‘‘ఇది ఆడపిల్ల కదా! దీని వల్ల నీకు ఏ కీడు వుంటుంది? పురుషుడైతే కీడు కలుగుతుందని అనుకోవచ్చు. కాబట్టి ఈ బాలికను వదిలేయ్’’ అని ఏడుస్తుంది. అయినా కంసుడు ఆ బాలికను చంపబోతుండగా... ఆమె ఆకాశంలో ఎగిరి.. ‘‘నీకు మృత్యువు తప్పదు. నిన్ను చంపేవాడు పుట్టాడు’’ అని చెప్పి అదృశ్యం అవుతుంది. అప్పుడు కంసుడు.. దేవకీ, వసుదేవతలతో ‘‘నేను చేసిన ప్రయత్నాలన్ని వ్యర్థమయ్యాయి. మిమ్మల్ని బాధపెట్టినందుకు నన్ను క్షమించండి’’ అని వారిని విడిచిపెట్టి, మర్యాదలు చేస్తాడు.

శ్రీకృష్ణుని బాల్యక్రీడలు :
శ్రీకృష్ణుడు, బలరాముడు నందుని పల్లెలో వుండేవారు. శ్రీకృష్ణుడు.. తనకు పాలిచ్చి చంపబోయిన పూతన ప్రాణాలను తీస్తాడు. తనమీదికి రాబోయిన శకటాసురునికి చంపేస్తాడు. తనను గాలిలోకి ఎత్తుకునిపోయిన తృణావుర్తునిని సంమరిస్తాడు. ఈ ఘటనలను చూసిన నందాదుల ప్రజలు భయపడిపోయి, రేపల్లె విడిచిపెట్టి యమునానదీ తీరంలో వున్న బృందావనానికి వలస వెళ్తారు.

కృష్ణుడు తన తోటి పిల్లలతో కలిసి.. గొల్లవారి ఇళ్లలోకి దూరి పాలు, పెరుగు, వెన్నలను దొంగలించి తినేవాడు. తనతోపాటు వచ్చిన పిల్లలకు కూడా పంచిపెట్టేవాడు. ఇలా ప్రతిరోజు చేయడ వల్ల.. ఇతని ఆగడాలు భరించలేక గోపికలు వచ్చి యశోదతో చెబుతారు. దాంతో ఆమె కృష్ణునిని రోటికి కట్టివేయగా.. దానిని ఈడ్చుకుంటూ రెండు మద్ది చెట్ల మధ్యనుంచి లాగి ఆ మద్దలను కూలగొడతాడు. దీంతో మద్దులరూపంలో వున్న గంధర్వులకు శాపవిమోచనం కలుగుతుంది.

గోవులను గాచుటకు వెళ్లి, యమునానది మడుగులో వున్న కాళియునిని మర్దించి, అతనిని సముద్రానికి తరిమేశాడు. యమునా జలాన్ని స్నానపానాలకు యోగ్యంగా మార్చాడు. బలరాముడు తాళవనంలో ప్రవేశించి ధేనుకాసురుడిని సంహరించి.. గోపబాలురతో తాటిపళ్లు తినిపించాడు. కృష్ణ, బలరాములు ఇలా ఒక్కొక్కరుగా చాలామంది రాక్షసులను చంపారు. ఆవుదూడలకు, గోపబాలకులను బ్రహ్మ దాచివేగా.. కృష్ణుడు ఒక సంవత్సరంవరకు బాలురుగా, దూడలుగా రూపమెత్తి.. తనేమిటో తెలియజేస్తాడు.

కృష్ణుని జీవిత విశేషాలు :
కంసుడు ధనుర్యాగంతో పేరుతో పిలవబడ్డ అక్రూరునితో కృష్ణ, బలరాములు వెళ్లారు. కృష్ణుడు కుబ్జ నుంచి గంధాదులను గ్రహించి.. ఆమెను అనుగ్రహించాడు. ధనుశ్శాసనాలకు వెళ్లి.. ధనస్సును విరిచాడు. కంసుని సభాభవనానికి వెళ్లి.. బలరాములు చాణూర ముష్టికులను, మల్లవీరులను మట్టికరిపించారు. కృష్ణుడు, కంసుడిని సింహాసనంపై నుంచి లాగి కిందకుపడేసి చంపాడు. తనకు తాత అయిన ఉగ్రసేనుని రాజుగా చేశాడు. దేవకీ, వసుదేవలను ఆదరంగా గౌరవించాడు. 

కృష్ణుడు అన్నతో కలిసి సాందీపని అనే ఒక మునీంద్రుని నుంచి వేదవేదాంగాలను ఒక్కసారి విని నేర్చుకున్నాడు. రాజనీతిని, ధనుర్వేదాన్ని నేర్చుకున్నాడు. వీరి ప్రభావాన్ని చూసి స్వయం గురువే ఆశ్యర్యపోయాడు. తనపై దండెత్తిన జరాసంధాదులను చాలాసార్లు ఓడించాడు. ధర్మరాజు ద్వారా రాజసూయం చేయించాడు. ఎదిరించిన రాజులను పాండవుల సహాయంతో అణిచివేశాడు. తనను వరించిన భీష్మకుని కుమార్తె రుక్మిణిని ఎత్తుకుని వచ్చి.. ఆమెతో పెళ్లి చేసుకున్నాడు.

జాంబవంతుని గెలిచి, శ్యమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. సత్రాజిత్తు కుమార్తె అయిన సత్యభామను, జాంబవతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఇంకా ఐదుగురు మిత్రవిందాదులను వివాహం చేసుకున్నాడు. ఇంద్రుని కోరికపై నరకాసురునిని చంపి.. అతని చెరలో వున్న పదహారువేలమంది కన్యలను విడిపించాడు. తాను అన్ని రూపాలను ధరించి, ఆ కన్యలతో పరిణయమాడాడు.

ప్రద్యుమ్నుడు :
రుక్మిణి కుమారుడు ప్రద్యుమ్నుడు. అతడు పుట్టగానే శంబరుడు అనే రాక్షసుడు.. అతనిని ఎత్తుకుని పోయి, చంపాలనే నెపంతో సముద్రంలో పడేస్తాడు. అతడు చచ్చిపోయాడని సంతోషించి.. ఆ రాక్షసుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఆ ప్రద్యుమ్నుడిని ఒక పెద్ద చేప మింగుతుంది. అయినా అతను చావలేదు. ఒకరోజు జాలరులు చేపలు పట్టుకుంటుండగా.. ఈ చేప వారి వలలో పడుతుంది. ఈ పెద్ద చేపను వారు తమ రాజు అయిన శంబరునికి కానుకగా సమర్పిస్తారు.

శంబరుని రాజుకు మాయావతి అనే భార్య వుండేది. ఆమె ఆ రాజ్యానికి రాణి అయినప్పటికీ, ఇంట్లో అన్ని పనులు తానే చేసుకునేది. జాలరులు, శంబరునికి కానుకగా ఇచ్చిన చేపటను వండటానికి లోనికి పంపిస్తాడు. ఆ చేపను కోయగా.. అందులో బాలుడు కనిపిస్తాడు. ఆమె ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోగా.. నారదుడు అక్కడికి చేరుకుని, ‘‘ఇతడు రుక్మిణి కొడుకు. ఇతనిని నీ భర్త సముద్రంలో పడవేయగా.. చేప మింగింది. ఇప్పుడు వీడు నీకు దొరికాడు. శ్రద్ధగా ఇతనిని చూసుకుంటూ.. పెంచుకో’’ అని చెప్పి వెళ్లిపోయాడు.

మాయావతి ఆ బాలుడిని పెంచుకుంటుంది. క్రమంగా అతడు పెరిగి పెద్దవాడయిపోతాడు. ఒకరోజు మాయావతి అతనిని మోహించి, దానికి తగినట్లుగా ప్రవర్తిస్తుంది. అది చూసిన ప్రద్యుమ్నుడు.. ‘‘నువ్వు నన్ను పెంచిన తల్లివి. తల్లి ప్రేమ చూపించకుండా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు?’’ అని ప్రశ్నిస్తాడు. దానికి ఆమె, అతని తల్లి గురించి, అతనితో జరిగిన వృత్తాంతం గురించి వివరిస్తుంది. అలాగే శంబరునిని చంపి, తనను పరిగ్రహించమని అతనికి అన్ని విద్యలు నేర్పిస్తుంది. మాయా విశేషాల గురించి బోధిస్తుంది. 

ఇలా ఈ విధంగా విద్యను అభ్యసించిన ప్రద్యుమ్నుడు, శంబరునిని యుద్ధానికి పిలుస్తాడు. ఆ యుద్ధంలో అతని సైన్యంతో సహా అందరిని సంహరిస్తాడు. తరువాత అతను మాయాదేవితో కలిసి ద్వారకా నగరానికి వెళతాడు. రుక్మిణి మొదట అతనిని చూసి గుర్తించలేకపోతుంది. అప్పుడు కృష్ణుడు, నారదుడు అక్కడికి చేరుకుంటారు. నారదుడు.. ‘‘తల్లీ! ఇతడు నీ కుమారుడు. నీ ఇంటినుంచి శంబరుడు ఇతనిని ఎత్తుకుపోయి చంపబోగా.. ఈమె సంరక్షించి పెంచింది’’ అని చెబుతాడు.

అప్పుడు రుక్మిణి..‘‘ఈమె శంబరుని భార్య కదా! ప్రద్యుమ్నుడు ఈమెను ఎలా వివాహమాడుతాడు. పైగా ఈమె అతనిని పెంచి పోషించింది కదా!’’ అని శంకిస్తుంది. దీంతో నారదుడు.. ‘‘పూర్వజన్మలో ప్రద్యుమ్నుడు మన్మథుడు. మాయావతి రతిదేవి. ఈమె, ప్రద్యుమ్నుడిని అపహరించిన మాయావి శంబరుడిని తన మాయలో పడేసి.. అతనికి భార్యగా తన మాయారూపంలో సంచరించింది. తన నిజరూపంతో ప్రద్యుమ్నుడిని పెంచి, వరించింది. అందువల్ల ఈమెను కోలిగా స్వీకరించు’’ అని చెప్పగా.. రుక్మిణి, తన కొడుకుని, కోడలిని ఆదరించి ఆహ్వానిస్తుంది.